Type Anything.., You Get World Wide Search Results Here. !

ఉపవాసం ఎందుకు చేయాలి?

 ఉపవాసం ఎందుకు చేయాలి?

   భక్తి శ్రద్దలు గల అత్యధిక పక్ష భారతీయులు ఒక క్రమ పద్దతిలో లేదా పండుగల వంటి ప్రత్యెక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అటువంటి రోజుల్లో వాళ్ళు ఏమీ తినకుండా లేక ఒక్కసారి తినడం లేదా పండ్లు లేక అల్పాహారమును ఆహారముగా తీసికొని ఉపవాసము ఉంటారు.  కొందరు రోజంతా కనీసం మంచి నీళ్ళు అయినా త్రాగకుండా కఠిన మైన ఉపవాసము చేస్తారు.  ఉపవాసం ఎన్నో కారణాల కోసం చేయబడుతుంది. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియ పరచడానికి కూడా ఉపవాసం చేస్తారు.  గాంధీ గారు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలియపరచడానికి ఉపవాసం చేసారు.

ఉపవాసం ఎందుకు చేస్తాము?

   ఆహారాన్ని పొదుపు చేయడానికా లేక ఆకలిని బాగా పెంచుకుని విందు ఆరగించాదానికా? నిజానికి అందుకు కాదు. మరి మనమెందుకు ఉపవాసం చేస్తాము?

   సంస్కృతంలో ఉప అంటే 'దగ్గరగా' + వాస అంటే 'ఉండడం' అని అర్ధము.  కాబట్టి ఉపవాసము అంటే దగ్గరా (ఆ భగవంతుడి) ఉండడం అంటే భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం.  మరి ఉపవాసం - ఆహారముల మధ్య ఏమిటి సంబంధము?

   కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకొడి గాను మరియు మనసులో అలజడిని కలిగిస్తుంది.  అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా గాని ఉండి తన సమయాన్ని శక్తిని ఆదా చేసికోవాలనుకుంటాడు.  తద్వారా బుద్ధి చురుకుగాను మనసు పవిత్రముగాను అవుతుంది.  అది వరకు ఆహారపుటాలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది.  తనకు తాను నియమించుకొన్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది.

ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరమ్మత్తూ మరియు పూర్తి విరామము అవసరము.  ఉపవాసంలో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండుట వలన జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది. 

   ఇంద్రియాలతో విషయ భోగాలు అనుభవించే కొద్దీ అవి వశము కాక ఇంకా ఎక్కువ కావలెననును.  ఉపవాసము మనకు ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవడానికి కోర్కెలను ఉదాత్తమైన వాటిగా చేసికోవడానికి శాంతియుత మనస్సును కల్గి ఉండడానికి మార్గము చూపి సహాయ పడ్తుంది.

   ఉపవాసము మనలని నీరస పరిచేదిగాను, తొందరగా కోపం కల్గిన్చేటట్లుగాను మరియు తరువాత అనుభవించ వచ్చుననే ప్రేరణ నిచ్చేదిగాను ఉండకూడదు.  ఉపవాసము వెనుక ఉన్నతమైన లక్ష్యము లేనప్పుడు ఇట్లా జరుగుతుంది.  కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం లేదా పత్యం (diet) పాటిస్తారు.    మరి కొందరు భగవంతుని మెప్పించడానికి ప్రతిజ్ఞగా  లేదా తమ కోరికలను తీర్చుకొనేందుకు, మరి కొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసికోవడానికి, సంయమనానికై, కొందరు ఒక విధమైన తపస్సు గాను ఉపవాసము చేస్తారు.  మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్త ఆహారము తీసికోవలసినదని కేవలము ఉపవాసము చేయునప్పుడే కాక మిగతా రోజుల్లో కూడా శుచి ఐన బలవర్ధకమైన సాత్విక ఆహారము తీసికోవలసినదిగా భగవద్గీత మనకు బోధిస్తుంది.




Top

BOTTOM