Type Anything.., You Get World Wide Search Results Here. !

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము - Sri Satyanarayana Swamy Vratam

 

శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము



భూశుద్ధి :

ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి,అలికి,బియ్యపు పిండితోగాని,రంగుల చూర్ణములతోగాని,ముగ్గులుపెట్టి,దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.పీట మరీ ఎత్తుగాని, మరీ పల్లముగానీ ఉండకూడదు.పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి,కుంకుంమతో బొట్టు పెట్టి,వరిపిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి. సాధారణంగా  అష్టదళ పద్మాన్నే వేస్తారు.పూజచేసేవారు తూర్పు ముఖంగా కూర్చోవాలి.ఏ దైవాన్ని పూజింపబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపతమునుగాని, ఆ పీట పై ఉంచాలి.ముందుగా

పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి),దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒక పళ్లెంలోగాని, క్రొత్త తుండు గుడ్డ  మీద గాని బియ్యం పోసి దానిపై ఒక తమలపాకు నుంచి,అందు పసుపు గణపతి నుంచి అగరువత్తులు వెలిగించాలి.ఇప్పుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి.దీపారాధన నైరుతి దిశలో చేయవలెను.


దీపారాధనకు కావలసిన వస్తువులు - దీపారాధన విధానము

దీపారాధన చేయుటకు కుంది (ప్రమిద) వెండిది గాని, ఇత్తడిదిగాని, మట్టిది గాని వాడవచ్చును.కుందిలో 3 అడ్డవత్తులు 1 కుంభవత్తి (మధ్యలో)వేసి నూనెతో తడుపవలెను. ఇంకొక అడ్డవత్తి నూనెతో తడిపి ఏకహారతిలో (కర్పూర హారతికి వాడే వస్తువు)వేసి ముందుగా ఏకహరతిలో వేసిన వత్తిని అగ్గిపుల్లతో వెలిగించి, వెలిగించిన వత్తితో కుందిలోని 1 అడ్డవత్తి 1 కుంభవత్తి  వెలిగించవలెను.తర్వాత చేయి కడుక్కుని నూనె కుంది నిండావేసి పిదప ఆ కుందికి మూడుచోట్ల కుంకుమ అలంకారము చేయవలెను. తర్వాత అక్షతలు వేసి దీపారాధనను లక్ష్మీ స్వరూపముగా భావించి నమస్కారము చేయవలెను.కుందిలో మిగిలిన రెండు అడ్డవత్తులు పూజా సమయంలో ధూపము చూపిన తరువాత దీపము చూపించుటకు  వాడవలెను. దీపారాధనకు నువ్వులనూనెగాని, కొబ్బరినూనెగాని, ఆవునెయ్యి గాని వాడవచ్చును. మనము ఆచమనము చేసినటువంటి పంచపాత్రలోని నీళ్లు దేవుని పూజకు వినియోగించరాదు. పూజకు విడిగా ఒకగ్లాసుగాని,చెంబుగాని తీసుకొని దానిలో శుద్ధ జలమును పోసి ఆ చెంబునకు కలశారాధన చేసి ఆ నీళ్ళు మాత్రమే దేవుని పూజకు ఉపయోగించవలెను.


ఈ వ్రతమునకు కావలసిన వస్తువులు:

శ్రీ నత్యనారాయణ స్వామివారి ప్రతిమ లేదా చిత్రపటము బియ్యము, చూర్ణము, పసుపు, కుంకుమ, తమలపాకులు, పోకలు, లవంగములు, ఏలకులు మొదలగు సుగంధ ద్రవ్యములు. ఖర్జూర ఫలములు, ద్రాక్షఫలములు, కిస్ మిస్ ఫలములు, ధూపమునకు సాంబ్రాణి, కొబ్బరికాయలు, పళ్ళు, పువ్వులు, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె, అగరువత్తులు, వస్త్ర, యజ్ఞోపవీతములు మరియు  పంచామృతాలు (ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార) గోధుమనూక, పాలు, కలశము, నూతనవస్త్రములు, రవికెలగుడ్డ, మామిడాకులు మొదలైనవి.


మంటపారాధనకు నూతన వస్త్రములు, అగరువత్తులు, స్వామికి సువాసన ద్రవ్యములు, మంచి గంధము మొదలగునవి వ్రతము చేయుటకు ముందుగా సేకరించి యుంచుకొనవలెను. నూతన వస్త్రములతోను, దక్షిణ తాంబూలములతోను, పురోహితులను సంతుష్టి గావింపవలెను, యధాశక్తిగా వ్రతము ఆచరించవలయును. లోభత్వము కూడదు. భక్తి శ్రద్ధలు ప్రదానము. 


శ్రీ సత్యనారాయణ వ్రతము ఎక్కడ? ఎప్పుడు? ఎట్లు చేయవలెను?

ప్రతిమాసమునందును, రవి సంక్రమణ దినమునందుగాని, పౌర్ణమి తిథి యందుగాని, ఏకాదశి యందుగాని, ఏదైనా ఒక శుభదినమున సాయంకాలమున గాని, ఉదయమున గాని, స్నానముచేసి శుచియై సంధ్యావందనాది నిత్యకర్మలను యధావిధిగా ఆచరించి, బ్రాహ్మణులను, బంధుమిత్రాదులను రప్పించి, శుభకరములైన మంగళ వాయిద్యములతోడను, మంగళకరములైన స్వస్తి వాచకములతోడను, వేద పటణముల తోడను, దేవాలయమునగాని, పుణ్య క్షేత్రముల యందుగాని, సముద్రతీరమున గాని, నదీతీరమునగాని, వనమందు గాని, స్వగృహమున గాని శ్రీ సత్యనారాయణస్వామి వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించవలయును. పూజా స్థలమును గోమయముచే శుద్ధి చేసి, తూర్పుగా బియ్యం, చూర్ణము, పసుపు, కుంకుమలతో ముగ్గులు పెట్టి, మంటపము గావించి, మామిడాకుల తోరణములతో సుందరముగా అలంకరించి పూజాద్రవ్యములు రాగిపాత్ర నూతనవస్త్రములు, కొబ్బరికాయ, పూజాస్థలము నందుంచి భక్తితో దీపారాధన జేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తిశ్రద్ధలతో ఆచరించవలెను. భక్తిలోపము కారాదు. లోభము కూడదు. యధాశక్తి ఆచరించిన విశేష పుణ్యఫలము లభించును. భక్తి శ్రద్ధలు ప్రదానము.


కలశ పూజ :

వెండి, రాగి, లేక కంచు గ్లా సులు( లేదా పంచ పాత్రలు) రెండింటిలో శుద్ద జలమును తీసుకొని ఒక దానియందు ఉద్దరిణిని, రెండవ దానియందు అక్షతలు, తమలపాకు, పువ్వు ఉంచుకొనవలెను. రెండువ పాత్రకు బయట మూడు వైపులాగంధమును వ్రాసి కుంకుమ అద్దవలెను. ఇట్లు చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమునుగాని, కుంకుమనుగాని పూయరాదు. గంధమును ఉంగరపు వేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన, మధ్య, ఉంగరపు వ్రేళ్లను కలిపి సమర్పించవలెను. యజమానులు( ఒక్కరైతే ఒకరు, దంపతులు లైతే ఇద్దరూను) ఆ కలశాన్ని కుడి చేతితో మూసివుంచి, ఇలా అనుకోవాలి. ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదవవలెను.

శ్లో||  కలశస్య ముఖే విష్ణు: కంటే రుద్ర స్సమాస్శ్రితః

      మూలే తత్ర స్థితో బ్రహ్మామధ్యే మాతృ గణాస్మృతాః||

      ఋగ్వేదో ధయజుర్వేద స్సామావేదో హ్యధర్వణః   

      అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః    


శ్లో ||   గంగైచ యమునే చైవ కృష్ణే, గోదావరి, సరస్వతీ,

      నర్మదా సింధు కావేరౌయో జలే స్మిన్ సన్నిధంకురు ||


ఇక్కడ ఇలా శ్లోకము ముగిసిన తరువాత ఆయాతు శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ( ఏ దేవుని పూజైతే చేస్తున్నామో ఆ దేవుని పేరును చెప్పవలెను) పూజార్ధం మమ దురితక్షయకార కాః కలశో దకేన ఓం దేవం సం ప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవుని పై చల్లాలి) ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తన పై చల్లు కోవాలి) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజాద్రవ్యములు పై కూడా చల్లాలి)  కలశ మందలి నీటిని పై మంత్రం చదువుతూ పువ్వుతో గాని, ఆకుతో గానీ చల్లాలి.


మార్జనము:

ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావ స్థాంగతో పివా

యస్స్మరేత్పుండరీ కాక్షం సబాహ్యాభ్యంతర శ్ముచి:|| 


అని పిద పకాసిని అక్షతలు, పసుపు, గణపతి పై వేసి, ఆయనను తాకి నమస్కరించి ప్రాణ ప్రతిష్టాపన చేయవలెను. ప్రాణ ప్రతిష్ఠ అనగా శ్రీ మహా గణాధి పతయేనమః ప్రాణ ప్రతిష్టా పన ముహూర్తస్సు ముహూర్తోస్తు తధాస్తు. తరువాత ఇలా చదువుతూ విఘ్నేశ్వరునికి నమస్కరించవలెను.

శ్లో || శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్

  ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నో పశాంతయే ||

  సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః

  లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః

  ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః

  వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః

  షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి

  విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా

  సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||


అధ గణపతి పూజ

మంత్రః || గణానాం త్వా గణపతిగ్ o  హవామహే కవిం కవీనా ముపమశ్ర వస్తవం, జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రాహ్మణ స్పత ఆన స్శ్రణ్వ న్నూతభి స్సీద సాదనం, శ్రీ మహాగణపతియే నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని గణపతిని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.

    

శ్రీ  మహా గణాధిపతయే నమః ఆవాహయామి . ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి .అనగా మనస్పూర్తిగా దేవుని మన ఇంట్లో కి ఆహ్వానించడం . అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.     


శ్రీ  మహా గణాది పతయే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి . సింహాసనార్ధం అక్షతాం సమర్పయామి . దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ అక్షతలు వేయవలెను.


శ్రీ  మహా గణాది పతయే నమః పాదయో: పాద్యం సమర్పయామి . దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు  నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

శ్రీ  మహా గణాధిపతయే నమః హస్తయో  అర్ఘ్యం సమర్పయామి. దేవుడు చేతులు కడుగుకొనుటకై  నీళ్లిస్తున్నామని మనసున తలుస్తూ ,ఉద్దరిణితో నీరు వేరొక గిన్నెలో వదలవలయును.

    

శ్రీ  మహా గణాది పతయే నమః పాదయో  పాద్యం సమర్పయామి . దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు  నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచ పాత్రలోని నీరు అదే  గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.

    

శ్రీ  మహాగణాదిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి . అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్లిస్తున్నామని మనసున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు నీరు వదలవలెను.

    

సూచన : అర్ఘ్యం , పాద్యం, ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను .అరివేణంలో వదలరాదు.


శ్లో || ఆపోహిష్టా మయోభువ స్టాన ఊర్జేత ధాతన, మహేరణాయ చక్షసే, యోవశ్శివత మోర సస్త స్య భాజయ తే హనః, ఉశ తీరివ మాతరః తస్మా దరంగమామ వోయస్యక్ష యాయ జిన్వధ, ఆపోజనయధాచనః, శ్రీ మహాగణాధిపతయే నమః స్నపయామి (స్నానం) 

శ్రీ మహాగణాధి పతయే నమః స్నానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవుని పై చల్లవలెను.


శ్లో|| అభి వస్రాసు వస నాన్యర్ షాభిధే నూస్సు దు ఘాః పూజమానః అభి చంద్రాభర్త వేనొ హిరణ్య భ్యశ్వాన్ రథి నో దేవ సోమ


శ్రీ  మహా గణాది పతయే నమః వస్త్ర యుగ్మం సమర్పయామి అనుచూ వస్త్రమును ( పైన చెప్పినట్లు ప్రత్తిని కుంకుమలో అద్ది నచో అది వస్త్రమగును ) స్వామీ వారి ప్రతిమకు అద్దవలెను.


యజ్ఞోపవీతం బరమం పవిత్రం ప్రజాపతే ర్యత్స పూజం పురస్తాత్ ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః

శ్రీ మహా గణాది పతయే నమః ఉపవీతం సమర్పయామి.  అనగా  జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో  చేయవచ్చును . ప్రత్తిని తీసుకొని పసుపు చేత్తో బొటన వ్రేలు, మధ్య వ్రేలితో మధ్య మధ్య నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమ అద్దవలెను దీనిని పురుషదేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను.


శ్లో|| యనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ: హ్రదాశ్చ పండరీ కాణి సముద్రస్య గృహ ఇమే శ్రీ మహాగణాధిపతయేనమః దూర్వాణి నానావిధ పుష్పాణి పూజయామి.


ఓం సుముఖాయనమః, ఓం ఏకదంతాయనమః, ఓం కపిలాయనమః, ఓం గజకర్ణాకాయనమః, ఓం లంబోదరాయనమః, ఓం వికటాయనమః, ఓం విఘ్నరాజాయనమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయనమః, ఓం గజాననాయనమః, ఓం వక్రతుండాయనమః, ఓం శూర్పకర్ణాయనమః, ఓం హేరంభాయనమః, ఓం స్కంద పూర్వజాయనమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయనమః, ఓం మహాగణాధిపతయేనమః నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి. 


శ్లో|| వనస్పత్యు ద్భవై ర్దివ్యై ర్నానాగంధ దై స్సు సంయుతః ఆఘ్రేయ స్సర్వ దేవానాం ధూపయం ప్రతిఘ్రు హ్యాతామ్, ఓం శ్రీ మహాగణాధిపతయేనమః దూపమాఘ్రాపయామి 


శ్లో|| సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం, గృహాన మంగళం దీపం త్ర్యైలోక్య మిరాపహం, భక్త్యాదీపం ప్రయాచ్చామి దేవాయ పరమాత్మనే, త్రాహిమాం నరకా ద్ఘోరా ద్దివ్య జ్యోతిర్నమోస్తుతే, శ్రీ మహాగణాధిపతయేనమః దీపం దర్శయామి, ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి.


శ్లో || నైవేద్యం,  'ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి,ధీ యో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి,(ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను) శ్రీ మహాగణాధిపతయేనమః గుడోపహార నైవేద్యం సమర్పయామి, అమృతమస్తు అమృతో పస్తర ణమసి,ఓం ప్రాణాయ స్వాహా,ఓం అపానాయ స్వాహ,ఓం వ్యానాయ స్వాహ,ఓం ఉదానాయ స్వాహ,ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుమార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) స్వామికి నివేదనం చూపించాలి. నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళ యామి'అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన ఆర్యపాత్ర (పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర )లో వదలాలి.తరువాత 'పాదౌ ప్రక్షాళయామి' అని మరోసారి నీరు ఆర్ఘ్య పాత్రలో ఉద్ధరిణెతో వదలాలి.పునః శుద్ధచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.


శ్లో|| పూగీ ఫలైస్స కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుక్తం ముక్తా చూర్ణేన సంయుక్తం  తాంబూలం ప్రతిగ్రుహ్యాతాం 

శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి అని చెబుతూ తాంబూలమును (మూడు తమలపాకులు,రెండు పోకచెక్కలు,అరటి పండు వేసి) స్వామివద్ద ఉంచాలి.తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు ఇస్తున్నామని తలుస్తూ ,'తాంబూల చరవణా నంతరం శుద్ధ ఆచమనీయంసమర్పయామి'అంటూ ఉద్ధరిణెతో నీరు ఆర్ఘ్య పాత్రలో వదలాలి.పిమ్మట కర్పూరం వెలిగించి 


శ్లో|| ఓం శ్రీ  మహాగణాధిపతయే కర్పూర నీరాజనం సమర్పయామి. అని కర్పూర బిళ్ళలు ఘారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి,మూడుమార్లు త్రిప్పుచూ,చిన్నగా ఘంట వాయించవలెను.అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని  వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు,పువ్వులు,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,


శ్లో|| గణానాంత్వా గణపతిగ్ o  హవామహే కవింక వీనాముపశ్రవస్తవం, జ్యేష్ట రాజం

బ్రహ్మణాం బ్రాహ్మణ స్పత ఆన స్శ్రుణ్య న్నూతభి స్సీద సాదం శ్రీ మహాగణాది పతయే నమః

సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అని చెప్పుకొని అక్షతలు పువ్వులు చిల్లర స్వామి వద్ద ఉంచవలెను.


శ్లో|| మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప, యత్పూజితం మాయాదేవ

పరిపూర్ణం తదస్తు తై


శ్లో|| అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః

శ్రీ మహాగణాధిపతయే స్సుప్రీతో వరదో భూత్వా ఉత్తరే కర్మణ్య విఘ్నస్త్వితి భవంతో బ్రువంతు.

ఉత్తరే కర్మణ్య విఘ్నమస్తు. గణాధిపతి ప్రసాదం శిరసా ఘ్రుహ్ణమి అని స్వామికి నమస్కరించి, స్వామివద్ద ఉన్న పుష్పమును తీసి తలపై ఉంచుకొనవలెను. లేదా అక్షతలను తలపై వేసుకొనవలెను.


శ్లో|| సహస్ర పరమాదేవి శతమూలా శాతాంకురా,సర్వగ్ o  హరతుమేపాపం

దూర్వాదు స్వప్న నాశనీ, గణపతిం యదాస్థానము ముద్వాసయామి, యజ్ఞేన యజ్ఞ మయం

జంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హా నాకం మహిమాన స్పంచతే యత్ర పూర్వే

సాధ్యా స్సంతి దేవాః


శ్లో || యస్శివో నామరూపాభ్యాం యాదేవి సర్వామంగళా, తయో స్సస్మర ణా త్పుంసాం సర్వతో

జయమంగళమ్ , లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీ వర శ్యామో

హృదయస్థో జనార్దనః ఆ పదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం, లోఖాభి రామం శ్రీరామం

భూయో భూయో నమామ్యహమ్, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, శ్రీ లక్ష్మీ నారాయణాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః, శచీ

ఓం తత్పురుషాయ విద్యహే వక్రతుండాయ ధీమహి

తన్నో దన్తి : ప్రచోదయాత్

ఓం తత్పురుషాయ విద్యహే వక్ర  తున్డాయ ధీమహి

తన్నో నన్ది : ప్రచోదయాత్

ఓం తత్పురుషాయ విద్యహే మహాసేనాయ ధీమహి

తన్నో షణ్ముఖః ప్రచోదయాత్

ఓం తత్పురుషాయ విద్యహే సువర్ణ పక్షాయ ధీమహి

తన్నో గరుడః ప్రచోదయాత్

ఓం వేదాత్మనాయ విద్యహే హిరణ్య గర్భాయ ధీమహి

తన్నో బ్రహ్మః ప్రచోదయాత్

ఓం నారాయణాయ విద్యహే వాసుదేవాయ ధీమహి

తన్నో విష్ణు : ప్రచోదయాత్

ఓం వజ్రనకాయ విద్యహే తీక్షణః దంష్ట్రాయ ధీమహి

తన్నో నారసింహ ప్రచోదయాత్

ఓం భాస్కరాయ విద్యహే లాలీ లాయ ధీమహి

తన్నో అగ్ని : ప్రచోదయాత్

ఓం కాత్యాయ నాయ విద్యహే కన్య కుమారి ధీమహి

తన్నో దుర్గః ప్రచోదయాత్

ఓం మహాదేవ్యైచ విద్యహే విష్ణు పత్న్యైచ ధీమహి

తన్నో లక్ష్మి : ప్రచోదయాత్

ఓం సాయి రామాయ విద్యహే ఆత్మా రామాయ ధీమహి

తన్నో బాబా ప్రచోదయాత్

ఓం సాయీశ్వరాయ విద్యహే సత్య దేవాయ ధీమహి

తన్నః సర్వ ప్రచోదయాత్

ఈశాన స్సర్వ విద్యానాం

ఈశ్వర స్సర్వ భూతానాం

బ్రహ్మాది పతి ర్బ్రహ్మణోధి పతి :

బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం

పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః, అయం ముహూర్త స్సుముహూర్తో స్తు.


పంచలోక పూజ

ఈ క్రింది శ్లోకాలను చదువుతూ పంచలోకములయొక్క అధి దేవతలను పూజించవలెను.


ఆచమ్య, పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీ సత్యనారాయణ వ్రతాంగ గణపత్యాది పంచలోక పాలక పూజాం కరిష్యే.


గణానాంత్వా గణపతిగ్ o  హవామహే కవింక వీనాముపశ్రవస్తవం, జ్యేష్ట రాజం

బ్రహ్మణాం బ్రాహ్మణ స్పత ఆన స్శ్రు న్నూ తిభి స్సీద సాదనం సాంగం సాయుధం సవాహనం

సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం గణపతిం లోకపాలక మావాహయామి స్థాపయామి

పూజయామి.


ఓం బ్రహ్మ దేవానాం పదవీ :- కవీనా మృషిర్ ప్రాణం మహిషో మృగాణాం శ్యేనో గ్రుధ్రాణాగ్ o 

స్వధి తిర్వనానాగ్ o  సోమః పవిత్ర మత్యేతి రేభన్, సాంగం సాయుధం సవాహనం సశక్తిం

పత్నీ పుత్ర పరివార సమేతం బ్రహ్మాణం లోకపాలక మావాహయామి స్థాపయామి పూజయామి


ఓం ఇదం విష్ణుర్వి చక్రమే త్రేధా నిదధే పదం, సమూడ మస్య పాగ్ o  సురే సాంగం

సాయుధం సవాహనం,  సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం

విష్ణుంలోక పాలక మావాహయామి స్థాపయామి పూజయామి


ఓం కద్రుద్రాయ ప్రచేతసే మీడు ష్టమాయ తవ్యసే, వోచేమ శంతమగ్ o  హృదే, సాంగం

సాయుధం సవాహనం,  సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం

రుద్రం లోక పాలక మావాహయామి స్థాపయామి పూజయామి


ఓం గౌరీ మియాయ సలిలాని తక్ష పడీ ద్విపదీ సాచ తుష్పదీ, అష్టాపదీ నవపదీ

బభూవుషీ సహస్రాక్ష రా పరమేవ్యోమన్, సాంగం సాయుధం సవాహనం,  సశక్తిం పత్నీ పుత్ర

పరివార సమేతం గౌరీం  లోక పాలక మావాహయామి స్థాపయామి పూజయామి

గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః,  ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి  సమర్పయామి, దూపమాఘ్రాపయామి, దీపందర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి, తరువాత నగ్రహములను (తొమ్మిది గ్రహములు) ఒక్కొక్కటిగా ఈ క్రింది శ్లోకములను చదువుతూ పూజించవలెను.

నవగ్రహ పూజ

సూర్య  1 . అస్యతే నేత్య మంత్రస్య, హిరణ్యస్తూ ఋషి: సవితాదేవతా, త్రిష్ట ప్చంద:, యాజమాన స్యాధి దేవతాప్రత్యధి దేవతా సహిత సూర్య గ్రహ ప్రసాద సిద్ద్యర్ధే సూర్యగ్రహరాధనే వినియోగః, శ్లో|| వేదీ మథ్యే లలిత కమలే కర్ణ కాయాంరథ స్థ పానాశ్వో రర్కో రుణరుచిన పుస్సప్త జ్జుద్ద్వి బాహు:, గోత్రే రమ్యే బహుఉవిధ గుణే కాశ్యపాఖ్యే ప్రసూతః కాళిం గాఖ్యే  విషయ జనితః ప్రాజ్ఞుఖః పద్మహస్తః, పద్మాసనః పద్మకరో ద్విబాహు: పద్మద్యుతి స్సస్త తురంగ వాహః, దివాకరో లోకవపు:, కిరీటి మయి ప్రసాదం విదధాతు దేవః అస్యత్యేన రజసా వర్తమానో నివేశయన్న మృతం మర్త్యంచ, హిరణ్యయేన సవితా రథే నాదేవో యాతి భువనా విపశ్యన్, ఓం భూర్భువస్సువః సూర్యగ్రహగచ్చ:, సూర్యగ్రహం, రక్తవర్ణం, రక్తగంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచ్చత్ర ధ్వజ పతాకాది శోభితం దివ్య రథ సమారూడం మెరుం ప్రదక్షిణీ కుర్వాణం, ప్రాజ్ముఖం, పద్మాసనస్థ, ద్విభుజం, సప్తాశ్వం, సప్త రజ్ఞుం కళింగ దేశాది పతిం కాశ్యపసగోత్రం, ప్రభవ సంవత్సరే మాఘ మాసే, శుక్లపక్షే, సప్తమ్యాం, భానువాసరే, అశ్వినీ నక్షత్ర జాతం, సింహరాశ్వధి పతిం, కిరీటినం సుఖాసీనం, పత్నీపుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణె వర్తూలాకార మండలే స్థాపిత స్వర్ణ ప్రతిమారూపేణ సూర్యగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి ఓం అగ్నిదూతం వృణీమహే హొతారం విశ్వవేద సం అస్య యజ్ఞ స్య సుక్రతుం, సూర్యగ్రహాది దేవటం అగ్నిం సాంగ సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రా పరివార సమేతం సూర్య గ్రహస్య దక్షిణతః అగ్ని మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం కద్రుద్రాయ ప్రచేత సే మీడుష్టమాయ తవ్య సేవో చేమ శాంత మిగ్ o హృదే సూర్యగ్రహ ప్రత్యధి దేవతాం రుద్రం సాంగ సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రా పరివార సమేతం సూర్య గ్రహస్య ఉత్తరతః రుద్ర మావాహయామి స్థాపయామి పూజయామి.

చంద్ర  

2 . ఆప్యాయ స్వేతస్య మంత్రస్య గౌతమ ఋషి:, చంద్రోదేవతా, గాయత్రీ ఛందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యాధి దేవతాసహిత చంద్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్ధే చంద్రగ్రహారాధన వినియోగః శ్లో || ఆగ్నేయభాగే సరధోధ శాశ్వశ్చా త్రేయజో యామున దేశజశ్చ, ప్రత్యజ్ఞ్మస్థఖ్చ, తురశ్ర పీటే గదాధరాం గోహిమవత్స్వభావః, శ్వేతాంబర శ్వేతపు: కిరీటి శ్వేత ద్యుతి దండధరో ద్విబాహుః, చంద్రో మ్రుతాత్మా వరదః కిరీటీ శ్రేయాంసిహ్యం  విదధాతుదేవః, ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం భవా వాజస్య సంగధే, ఓం భూర్భువస్సువః చంద్రగ్రహేహగచ్చ, చంద్రగ్రహం, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేతమాల్యాబరధరం, శ్వేతచ్చతరంధ్వజ పటాకాది శోభితం, దివ్యరధ సమారూడం మేరుం ప్రదక్షిణే కుర్వాణం దశాశ్వర థ వాహనం,ప్రత్యజ్ఞుఖం, ద్విభుజందండధరం యాముదేశాది పతి, ఆత్రేయస గోత్రం, సౌమ్య సంవత్సరే, కార్తీకమాసే, శుక్లపక్షే, పౌర్ణ మాస్యాం ఇందువాసరే కృతికా నక్షత్ర జాతం, కర్తరాశ్యది పతిం, కిరీటినం సుఖాసీనం పత్నీ పుత్రా పరివార సమేతం, గ్రహ మండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణే సూర్యగ్రహస్యా గ్నేయదిగ్భాగే, సమచతురాస్రమండ లేసాపిత రజత ప్రతిమారూపేణ చంద్రగ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అప్సుమేటోమో అబ్రవీ దంతర్విశ్వాని భేషజ, అగ్నిని చ విశ్వశంభువ మాపశ్చ విశ్వభేషజీ: చంద్రగ్రహాది దేవతాః సాంగాః  సాయుధాః సవాహనాః స్రశక్తి: పుత్రా పరివార సమేతాః చంద్రగ్రహస్య దక్షిణతః అపః ఆవాహయామి స్థాపయామి పూజయామి, ఓం గౌరీ మియాయ సలిలాని తక్ష త్యేక పడీ ద్విపదీ సా చతుష్పది అష్టాపది నవపదీ బభూవుషీ సహస్రాక్ష రా పరమే వ్యోమన్, చంద్రగ్రహ ప్రత్యధి దేవతాం, సాంగాం సాయుధం సవాహనం సశక్తిం పుత్రపరివార సమేతాం చంద్రగ్రహస్యో త్తరతః గౌరీ మవాహయామి స్థాపయామి పూజయామి.

అంగారక

3 . అగ్నిర్మూర్ధే త్యస్య మంత్ర స్య విరూప ఋషి: అంగారక గ్రహొ దేవతా త్రిష్టుప్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత అంగారక గ్రహప్రసాద సిద్ధ్యర్ధే అంగారక గ్రహారాదనే వినియోగః శ్లో || యామ్యే గదాశక్తి ధరశ్చ శూలివరప్రదో యామ్యముఖో తిరిక్త, కుజస్త్వ వంతీ విషయ స్త్రీకణస్త స్మిన్ భారద్వాజకులే ప్రసూతః రక్తాం బరోరక్త వపు: కిరీటీ చతుర్భుజో మేషగ మో గదా భ్రుత్, ధరాసుత శ్శక్తి ధరశ్చ శూలి సదా మమ స్యా ద్వరదః ప్రశాంతః, ఓం అగ్నిర్మూర్దాదినః కకుత్పతి: పృధి వ్యా అయం ఆపాగ్ రే తాగ్ o సి జిన్వతి,ఓం భూర్భువస్సువః, అంగారక గ్రహే హాగచ్చ, అంగారకగ్రహ, కర్త వర్ణం రక్త గంధం, రక్తపుష్పం, రక్తమాల్యాంబరధరం, రక్తచ్చత్ర ధ్వజ పతాకాది శోభితం, దివ్యరథ సమారూడం, మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, మేషవాహనం, దక్షినాభిముఖం, చతుర్భుజం,గదాశూలశక్తి ధరం,అవంతిదేశాధి పతి, భారద్వాజస గోత్ర, రాక్షసనామ సంవత్సరే, ఆషాడ మాసే, శుక్లపక్షే, దశమ్యాం, భౌమవాసరే, అనూరాధా నక్షత్రజాతం, మేష వృశ్చిక రాశ్యధి పతిం, కిరీటినం సుఖాసీనం,పత్నీ పుత్ర పరివార సమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నదీ కరణే, సూర్యగ్రహస్వ దక్షిణదిగ్భాగే త్రికోణాకార మండలే స్థాపిత తామ్ర ప్రతిమా రూపేణ అంగారక గ్రహామావాహయామి స్థాపయామి పూజయామి ఓం స్యోనా ప్రుధీ శీభవా వృక్ష రానివేశనీ, యచ్చా వశ్శర్మ సప్రధాః అంగారక గ్రహాధి దేవతాం, ప్రుధీ వీంసాంగాం, సాయుధాం, సవాహనం,సశక్తి పుత్ర పరివార సమేతాం, అంగారక గ్రహస్య దక్షిణతః ప్రుథి వీ మావాహయామి స్థాపయామి, పూజయామి, ఓం క్షేత్రస్య పతినా వయగ్ o , హితేనే వ జయామసీగా మశ్వం పో షయిత్వా సనో మ్రుడాతీ దృశే, అంగారక గ్రహ ప్రత్యధి దేవతాం, క్షేత్రపాలక, సాంగం సాయుధం సవాహనం సశక్తిం, పత్నీ పుత్ర పరివార సమేతం అంగారక గ్రహ స్యోత్తరతః క్షేత్రపాలక మావాహయామి స్థాపయామి పూజయామి.

బుధ 

4.శ్లో || ఉదజ్ఞ్ముఖో మాగధ దేశ జాతశ్చ ఆత్రేయ గోత్ర స్య శరమండలస్థ, సఖడ్గ చ ర్మో రుగదాధ రోజ్ఞస్త ఈశాన్య భాగే వరద స్సుపీతః, పీతాంబరః, పీతవపు:, కిరీటీ చుత్రభుజో దండ ధర శ్చ సౌమ్యః, చర్మా సిద్రు క్సోమ సుత స్సుమేరు స్సింహధి  రూడో వరదో బుధశ్చ, ఓం ఉద్భు థ్య స్వాగ్నే ప్రతిజాగ్రు హ్యేన మిష్టాపూర్తే సగ్ o సృజే ధామ యుంచ పునః క్రున్వగ్ద్ స్త్వా పిత రామ్ యవాన మన్వాతాగ్ సీత్వయితంతు మేతం ఓం భూర్భువస్సువః బుధః గ్రహే హాగచ్చ బుధగ్రహం, పీతవర్ణం, పీతగంధం, పీతపుష్పం, పీతమాల్యాంబరధరం పీతచ్చత్ర ధ్వజపతాకాది శోభితం, దివ్యరథ మారూడం, మేరుం ప్రదక్షిణి కుర్యాణం సింహాసనం ఉదజ్జఖం, మగధదేశాధి పతిం,చతుర్భుజం, ఖడ్గ చర్మాంబరధరం, ఆత్రేయసగోత్రం, అంగీరసనామ సంవత్సరే మార్గ శీర్ష మాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే పూర్వాభాద్రా నక్షత్ర జాతం మిథున కన్యారాశ్యధి పతిం కిరీటినం, సుఖాసీనం, పత్నీ పుత్రా పరివార సమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణే సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే, బ్నాకార మండలే, స్థాపిత కాంస్య ప్రతిమా రూపేణ బుధ గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం, సమూడ మస్య పాగ్ సురే బుధ గ్రహాధి దేవతాం, విష్ణుం, సాంగం, సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీ పుత్రా పరివార సమేతం బుధ గ్రహస్య దక్షిణతః విష్ణు మావాహయామి, స్థాపయామి, పూజయామి, ఓం సహస్ర శీర్షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్, సభూమిం విశ్వతో వృత్వా, అత్యతిష్ట దశాంగులం, బుధ గ్రహ ప్రత్యధి దేవతాం నారాయణం, సాంగం, సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీ పుత్ర పరివార సమేతం బుధ గ్రహస్యో త్తరతః నారాయణ మావాహయామి స్థాపయామి పూజయామి.

బృహస్పతి

5 . బృహస్పతే  అతి యదర్యే త్యస్య మంత్రస్య, గ్రుత్స్న మదఋషి, బృహస్పతి గ్రహొ దేవతా, త్రిష్టుప్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యాధి దేవతా సహిత బృహస్పతి గ్రహ ప్రసాద సిద్ధ్యర్ధే బృహస్పతి గ్రహారాధనే వినియోగః శ్లో || సౌమ్యే సుదీర్ఘే చతురస్ర పీటే రథే జ్గిరాః పూర్వముఖ స్వభావః త్రిదండాక్ష మాలాజలపాత్ర ధారీ, సిందాఖ్య దేశే వరద స్సుజీవః పీతాంబరః పీతవపు: కిరీటీ చతుర్భుజోదేవః గురు: ప్రశాంతః గదాసిదండం చ కమండలం చ త ధాక్ష సూత్రం వరదో స్తు మహ్యం ఓం బృహస్పతే అతియదర్యో అర్హాద్యు మద్విభాతి క్రతు మజ్జనేషు, యద్గిదయచ్చ వసర్త ప్రజాత దతస్మా  సుదర విణం దేహి చిత్రం ఓంభూర్భువస్సువః బృహస్పతి గ్రహేహాగచ్చ, బృహస్పతి గ్రహం, పీతవర్ణం, పీతగంధం, పీతపుష్పం, పీతమల్యాంబరధరం, పీతచత్ర ధ్వజ పతాకాది శోభితం దివ్యరధ సమారూడం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం, పూర్వాభి ముఖం పద్మాసన స్థం, చతుర్భుజం, దండాక్షమాలా ధారిణం, సింధుద్వీప దేశాధి పతిం, అంగీరస గోత్రం, అంగీరస నామ సంవత్సరే వైశాఖమాసే శుక్ల పక్షే ఏకాద శ్యాం గురువాసరే ఉత్తరానక్షత్ర జాతం,


ధనుర్మీన రాశ్యాధి పతిం, కిరీటినం, సుఖాసీనం, పత్నీ పుత్ర పరివార సమేతం, గ్రహమండలే ప్రవిష్ట మస్మి న్నధి కరణేసూర్యగ్రహస్యోత్తర దిగ్భాగే దీర్ఘ చతురస్ర మండలే స్థీ పిత త్ర పు ప్రతిమారూపేణ బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమత స్సురు చోవేన ఆపః, సబుధ్నీయా ఉత్తమా అస్య విష్టా స్సత శ్చ యోనిమ సతః శ్చ వివః బృహస్పతి గ్రహాధి దేవతాం బ్రాహ్మణం సామ్గం, సాయుధం, సవాహనం, సశక్తిం, పత్నీ పుత్ర పరివార సమేతం బృహస్పతి గ్రహస్య దక్షిణతః బ్రాహ్మణ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్రం వో విశ్వత స్పరి హవామ హే జనేభ్యః అస్మాక మస్తు కేవలః, బృహస్పతి గ్రహ ప్రత్యధిదేవతాం, ఇంద్రు, సాంగం, సాయుధం సవాహనం, సశక్తిం, పత్నీ పుత్ర పరివార సమేతం బృహస్పతి గ్రహస్య ఉత్తరతః, ఇంద్ర మావాహయామి స్థాపయామి పూజయామి.

శుక్ర

6 . శుక్రంతే అన్యది త్యస్య మంత్రస్య, భరద్వాజ ఋషి:, శుక్రగ్రహొ దేవతా త్రిష్టుప్చంద యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహితా శుక్ర గ్రహ ప్రసాద సిద్ధ్యర్ధే శుక్ర గ్రహరాధనే వినియోగః శ్లో || ప్రాచ్యాం భ్రుగుర్భో జకటి ప్రదేశ సస భార్గవః పూర్వము స్వభావం, స పంచ కోణే శ ర ధాధి రూడో దండాక్షమాలా వరదోంబుపాత్ర, శ్వేతాంబరః శ్వేతవపు:, కిరీటీ చతుర్భుజో దైత్య గురు: ప్రశాంతః గదాసిదండ చక్ర మండలం చత ధాక్ష సూత్రం వరదో స్తు మహ్యం, ఓం శక్రం తే అన్యద్యంజతం అన్య ద్విషురూపే ఆహవీ ద్యౌరి వాసి విశ్వాహి మాయా అవసి స్వథావో భద్రాతే పూషన్ని హ రాతిరస్తు, ఓం భూర్భువస్సువః, శుక్రగ్రహేగచ్చ, శుక్రగ్రహం, శ్వేతవర్ణం, శ్వేతగంధం, శ్వేతపుష్పం, శ్వేత మాల్యాంబరధరం, శ్వేతచ్చ త్ర ధ్వజ పతాకాది శోభితం దివ్యరథ సమారూడం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం పూర్వాభిముఖం, పద్మాసనస్థం, చతుర్భుజం దండాక్ష మాల జతావల్కల థారిణం, కాంభోజ దేశాధిపతి, భార్గవస గోత్రం, పార్ధివ సంవత్సరే శ్రావణమాసే శుక్ల పక్షే, అష్టంయాం భ్రుగువాసరే, స్వాతీ నక్షత్ర జాతం తులా వృషభ రాశ్యాది పతిం కిరటినం సుఖాసీనం పత్నీ పుత్ర పరివార సమేతం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఇంద్ర మరుత్వంత మిహ పాహి సోమం యథా శార్యాతే అషిబ స్సుతస్య, తవ ప్రణీతీ తవ శూర శార్మన్నా వివాసంతి క వ య స్సు యజ్ఞాః, ల్శుక్రగ్రహ ప్రత్యధి దేవతాం ఇంద్ర మరుత్వంతం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్ర మరుత్వంత మావాహయామి స్థాపయామి పూజయామి.

శనైశ్చర 

7 . శమగ్ని రగ్నిభి రిత్యస్య మంత్రస్య, హిళి భి ఋషి:, శ నైశ్చ రగ్ర హొ దేవతా, ఉష్ణి క్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత శనై శ్చ రగ్ర హ ప్రసాద సిద్ధ్యర్ధే శనై శ్చర గ్రహారాధనే వినియోగః, శ్లో || చాపాసనో రథ స్సునీలః ప్రత్య జ్ఞ్ముఖ కాష్యపజః ప్రతీచ్యాం, సశూల చాపేషు వర ప్రద శ్చ సౌరాష్ట్ర దేశే ప్రభవ శ్చ సౌరీ, నీలద్యుతి ర్నీలవపు:, కిరీటి గ్రుద్ర స్థిత శ్చా ప కర్త్రో ధను ష్మాన్, చతుర్భుజ స్సూర్య సుతః ప్రశాంత స్సచాస్తూ మహ్యం వరమంద గామీ. ఓం శమగ్ని రగ్నిభి స్క్ర చ్చన్న స్త పతు సూర్యః, శంవాతో వాత్వర పా పశ్రిధః, ఓం భూర్భువస్సువః, శనైశ్చర  గ్రహేహాగచ్చ, శనై శ్చ ర గ్రహం నీలవర్ణం, నీలగంధం,నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, నీలచ్చత్ర ధ్వజపతాకాది శోబితం, దివ్య రథసమారూడం, మేరుం ప్రదక్షిణి కుర్వాణం చాపాసనస్థం ప్రత్యజ్ఞ్ముఖం, గ్రధ్ర రథం, చతుర్భుజం శూలాయుధ ధరం, సౌరాష్ట్ర దీశాదిపతిం, కాశ్యపసగోత్రం విభవ సంవత్సరే పౌష్యమాసే శుక్లపక్షే నవమ్యాం స్థిరవాసరే భరణీ నక్షత్ర జాతం మకర కుంభ రాశ్యధిపతిం, కిరీటినం సుఖాసీనం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మి న్నధి కరణే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే దనురాకార మండలే స్థాపిత  అయః ప్రతిమా రూపేణ శనైశ్చర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం యమాయ సోమగ్ సునుత యమాయ జుహుతాహవి, యమాగ్ o హయజ్ఞో గచ్చ త్యగ్నిదూతో అరంక్రుతః శ నైశ్చర గ్రహాధి దేవతాం యమం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం సనైశ్చర్య గ్రహస్య దక్షిణతః యమమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం ప్రజాపతే నటవ దేవతా న్యనో విశ్వజాతాని పరితాబభూవ యత్కామాస్తే జుహు మస్తనో అస్తు వయగ్గ్ స్యామ పతియోర యీణాం, శనైశ్చర గ్రహస్యోత్తరతః, ప్రజాపతి మవాహయామి స్థాపయామి పూజయామి.

రాహు

8 . కాయాన శ్చిత్రే త్యస్య మ మంత్రస్య, వామదేవ ఋషి:, రాహుగ్రహొదేవతా, గాయత్రీ చ్చందః, యజమానస్యాది దేవతా ప్రత్యధి దేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ద్యర్ధే రాహుగ్రహరాధనే వినియోగః శ్లో|| పైటో న సో బర్బర దేశ స్శూర్పా సనస్సింహగత స్వభావః యామ్యాననో నైరుతి దిక్కరాశో వరప్రద స్శూల సచర్మ ఖడ్గః, నీలాంబరో నేలవపు: కిరీటీ కరాళ వక్త్రః కరవాల శూలీ, చతుర్భుజ శ్చరధర్మశ్చ రాహు సింహాధి రూడో వరదో స్తు మహ్యం, ఓం కాయాన శ్బిత్ర అభువ దూతీ సదా వృధ స్సఖా, కయాష చిష్ట యా వృతా, ఓం భూర్భువస్సువః, రాహుగ్రహే గచ్చ రాహుగ్రహం,నీలవర్ణం, నీలగంధం, నీలపుష్పం, నీలమాల్యాంబరధరం, మేరుమ ప్రదక్షిణీ కుర్వాణం నైర్ ఋతిముఖం, శూర్పా సన స్థం చతుర్భుజం, కరాళ వక్త్రం ఖడ్గ చర్మధరం, పైటీవ స గోత్రం బర్బర దేశాధిపతిం, రాక్షస నామ సంవత్సరే, భాద్రపద మాసే, కృష్ణ పక్షే, చతుర్దశ్యాం, భానువాసరే విశాఖా నక్షత్ర జాతం, సింహరాశి ప్రయ్క్తం కిరీటినం సుఖాసీనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం గ్రహమండలే ప్రవిష్ట మస్మిన్నధి కరణే సూర్యగ్రహ్స్య నైర్ రుతి దిగ్భాగే శూర్పాకార మండలే స్థాపిత లోహప్రతి రూపేణ రాహుగ్ర హ మావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అయంగౌ: వ్రుశ్ని రక్ర మీద సదన్మాకర స్సువః, పీతరం చ ప్రియం త్సువ రాహు గ్రహాది దేవతాం సర్పాం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం రాహుగ్రహస్య  దక్షిణతః సర్పాంసాగ మావాహయామి స్థాపయామి పూజయామి, ఓం నమో అస్తు సర్పే భ్యో యే కేచ పృధి వీ మనుయేం తరిక్షే యేది వితే భ్య స్సర్వేభ్యో నమః రాహుగ్రహ ప్రత్యధి దేవతాం సర్పాం సాంగం సాయుధాం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం రాహుగ్రహస్య ఉత్తరతః సర్పమావాహయామి స్థాపయామి పూజయామి.

కేతు

9 . కేతుం కృణ్వన్నిత్య స్య మంత్రస్య, మధుచ్చంద ఋషి:, కేతుగ్రహొ దేవతా గాయత్రీ చ్చందః, యాజమాన స్యాధి దేవతా ప్రత్యధి దేవతా సహిత కేతుగణ ప్రసాద సిద్ధ్యర్ధే కేతుగణారాదనే వినియోగః, శ్లో || ధ్వజాసనో జైమిని గోత్ర ర్వేదే షుదే శే షు విచిత్ర వర్ణః, యామ్యాసనో వాయుదిశః ప్రఖడ్గ శ్చ ర్మా సిభి శ్చా శన మతశ్చ కేతు:, ధూమ్రో ద్విబాహు ర్వర దో గదా భ్రుద్గ్ర ధ్రాపన స్థో వికృతాన శ్చ కిరీటకే యూ విభూషితాంగ స్సచాసుమే కేతుగణః ప్రశాంతః, ఓం కేతుం క్రుణ్వన్న శేతవే పేశో మర్త్వా ఆపేశ సే సముషద్భి రాజా యథాః, ఓం భూర్భువస్సువః, కేతుగానేహాగచ్చ, కేతుగణం, చిత్రవర్ణ, చిత్రగంధం, చిత్రపుష్ప, చిత్రమాల్యాంబరధరం చిత్ర చ్చత్ర ద్వజ పతాకాది శోభితం దివ్యరథ సమారూడం మేరు మప్రదక్షిణీ కుర్వాణం ధ్వజాసన స్థం దక్షిణాభి ముఖం అంతర్వేది దేశాధిపతిం ద్విబాహుం గదాధరం జైమిని గోత్రం రాక్ష సనామ సంవత్సరే చైత్ర మాసే కృష్ణ పక్షే చతుర్ధశ్యా మిందువాసారే రేవతీ నక్షత్రజాతం కర్కాటకరాశి ప్రయుక్తం సింహాసనాసీనం గ్రహమండలే స్థాపిత పంచలోహ ప్రతిరూపేణ కేతుగణ మావాహయామి స్థాపయామి పూజయామి:, ఓం సచిత్ర చిత్రం చితయంత మస్మే చిత్ర పక్షత్ర చిత్రత మం వయోధాం చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభి ర్గ్రణతే దువస్వ కేతు గణాది దేవతాం చిత్రగుప్తం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం కేతు గణస్య దక్షిణతః చిత్రగుప్త మావాహయామి, స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మ దేవతానాం పదవీ: కవీనామృషిర్వి ప్రాణాం మహిషో మృగాణాం, శ్యేనో గృథ్రాణాగ్ స్వథితి ర్య నానాగ్ సోమః పవిత్ర మత్యేతి రేభన్, కేతు గణ ప్రత్యధి దేవతాం బ్రాహ్మణం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం కేతుగణ స్యోత్తరతః బ్రాహ్మణ మావాహయామి స్థాపయామి పూజయామి.


అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత అది త్యాది నవగ్రహ దేవతా భ్యో నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, దూపమా ఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.


అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత అది త్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధిరస్తు అని నమస్కరించి తరువాత అష్ట దిక్పాలకులను ఆహ్వానించునట్లుగా ఎనిమిది వైపులా తాంబూలముంచుచు క్రింది విధంగా పూజించవలెను.


ఇంద్రాద్య ష్ట దిక్పాలక పూజా

1 . ఓం ఇంద్రంవో విశ్వత స్పరీ హవామ హే జనేభ్యః అస్మాక స్తు కేవలం సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం ఇంద్రం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.


2  ఓం అగ్నిం దూతం వృణీ మహే హొతారం విశ్వవేద సం, అస్య యజ్ఞస్య సుక్రతుం, సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీ పుత్ర  పరివార సమేతం అగ్నిం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.

3 . ఓం యమాయ సామగ్ o సునుత యమాయ జుహుతాహవి: యమగ్ o హయజ్ఞో గచ్చత్య గ్నిందూతో అరంక్రుతః సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీ పుత్ర  పరివార సమేతం యమం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.


4 . ఓం మోషుణః పరాపరానిర్ ఋతి ర్దుర్హ ణా వదీత్ పదీ ష్ణ తృష్ణ యా సహ సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర  పరివార సమేతం నిర్ఋతిం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.


5 . ఓం ఇమం మే వరుణ శ్రుదీ హావ మద్యా చ మృడయ, త్వా మనస్యు రాచకే, సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర  పరివార సమేతం వరుణం దిక్పాలక మావా హాయామి స్థాపయామి పూజయామి.


6 . ఓం తవవాయవ నృత స్పతే త్వ ష్ణు ర్జా మాతర ద్బుత ఆవాం స్యా వృణీ మహే సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర  పరివార సమేతం వాయుం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.


7 . ఓం సోమేధే నుగ్ సోమో అర్వంత మాశుగ్ సోమో వీరం కర్మణ్యం ద దాతు, సాదన్యం విత థ్యగ్ సభే యం పితు స్శ్రువణం యోద దాశ దస్మై సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర  పరివార సమేతం కుబేరం  దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.


8 . ఓం తమీశానం జగత స్థ స్తు షప్షతిం ధి యంజిన్వ మన సే హూమ హే వయం, పూషానో యధా వేద సామ సద్వ్రధే రక్షితా పాయు రదబ్ద స్స్వస్తయే  సాంగం సాయుధం, సవాహనం సశక్తిం పత్నీపుత్ర  పరివార సమేతం ఈశానం దిక్పాలక మావాహాయామి స్థాపయామి పూజయామి.


ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, శుద్దాచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి, అక్షాతాన్ సమర్పయామి, పుష్పాణి సమర్పయామి, దూపమా ఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, మంత్రపుష్పం సమర్పయామి.


శ్రీ సత్యనారాయణ పూజా

పిదప సత్యనారాయణ ప్రతిమను తమలపాకున ఉంచి ఈ క్రింది విధముగా పంచామృతములతో శోధనము చేయవలెను.

1 . ఆప్య్యాయ స్యేతి క్షీర, ఆప్య్యాయశ్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణియం, భవావాజస్య సంగధే

2 . దధి  క్రావుణ్నో ఇతి దధి, క్రావున్నో అకారి షం, జిష్ణోక శ్వ స్య వాజినః సురభి నో ముఖాకర త్ర్పణ ఆయూగ్ షి తారి షత్, 3 . శుక్రమసీత్యాజ్యం, శుక్రమసి జ్యోతిరపితేజోసి దేవో వస్స వితో త్పునా త్వచ్చి ద్రేణ పవిత్రేణ వసో సూర్యర్యరశమిభి: 4 . మధువాటా ఋతాయేతి మధు, మధు వాటా ఋతాయే మధుక్షరంతి సింధవః, మాధ్వీర్న స్సంత్యో షది:, మధుసక్తముతో ష్ణ సి మధుమత్పార్ది వగ రజః, మధుదౌరస్తునః పితా,  మధుమాన్నోవనస్పతిర్మధుమాగ్ అస్తు సూర్యః, మాద్విర్గావో భవంతునః, 5 . స్వాదు పవ స్వేతి శుద్దోదకం, స్వాదు: పవ స్య డి వ్యాయా జన్మనే స్వాదురింద్రాయ సుహావేతునామ్నే, స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్ o అద్యాభః, ఆపోహిష్టేతి శుద్దోదక స్నానం, ఆపోహిష్టా మయోభువస్తావ ఊర్నే దధాతన, మహేరనాయ చక్షసే, యోవ శ్శివ తమోర సస్త స్యభాజయతే హనః, ఉశతీరివ మాతరః, తస్మా అరంగ మామవో యస్య క్ష యాయ జిన్వధ, అపోజనయదాచనః


 ప్రాణప్రతిష్టాపనం  కరిష్యే

ఓం అస్య శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాఋషయః, రుగ్యజుస్సామాధర్వణాన చందాంసి, ప్రాణ శ్శక్తి:, పరాదేవతా హ్రాం బీజం, హ్రీం శక్తి:, క్రోం కీలకం, శ్రీ సత్యనారాయణ ప్రాణ ప్రతిష్టా జపే వినియోగః హ్రాం అంగుష్టాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, హ్రూం మధ్యమాభ్యాం నమః, హ్రైం అనామికాభ్యాం నమః, హ్రౌం కనిష్టికాభ్యాం నమః, హ్రాం కరతలకర ప్రుష్టాభ్యాం నమః, హ్రాం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహ, హ్రూం శికాయై వషట్, హ్రైం కవచాయ హుం, హ్రౌం నేత్రత్రయాయ వౌషట్, హ్రః అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరో మితి దిగ్భందః


ధ్యానం శ్లో|| శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృ ద్ద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాధం ఓం హ్రాం హ్రీం క్రోం యం రం లం వం శం షం హం ళం క్షం శ్రీ సత్యనారాయణ ప్రాణ ఇహ ప్రాణ ఓం హ్రాం హ్రీం క్రోం శ్రీ సత్యనారాయణ సర్వెంద్రియాణి వాజ్మ నశ్చ క్షు స్శ్రోత్ర జిహ్వ ఘ్రాణ, ఇహై వాగత్య సుఖం చిరంతిష్టంతు స్వాహ, ఓం ఆసునీతే పునరస్మాసు చక్షు: పునః ప్రాణ మహినో దేహిభోగం జ్యోక్ప శ్యేమ సూర్య మచ్చరంత మనుమతే మ్రుడయాన స్స్వస్తి అమృతం వైప్రాణ అమృత మాప, ప్రాణానేన యథా స్థానముపహ్వాయతే, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్ర పరివార సమేతం శ్రీ సత్యనారాయణ మావాహయామి స్థాపయామి, పూజయామి అని శ్రీ సత్యనారాయణ స్వామిని ధ్యానించునట్లుగా నమస్కరించవలెను.


ధ్యానం - శ్లో || ధ్యాయేత్స త్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం, లోకనాథం త్రిలోకేశం సౌస్తుభాభరణం హరిం, పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పతకభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మద్యై రభి పూజితం

శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ధ్యానం సమర్పయామి అని శ్రీ సత్యనారాయణ స్వామిని మనస్సున ధ్యానించి నమస్కరించవలెను.


ఆవాహనం - ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్, సభూమిం విశ్వతో వృత్వా. అత్యతిష్టద్దశాంగులమ్. శ్లో || జ్యోతిస్సాంతిం సర్వలోకాంతరస్థ మొకారాఖ్యం యోగి హృద్ధ్యాన గమ్యం, సాంగం శక్తిం సాయుధం భక్తి సేవ్యం సర్వాకారం విష్ణు మావాహాయామి. శ్రీ సత్యనారాయణ స్వామినినే నమః ఆవాహయామి ఆవాహనార్ధం అక్షతాం సమర్పయామి అనగా మనస్పూర్తిగా దేవుని ఇంట్లోకి ఆహ్వానించడం. అట్లు మనస్సున స్మరిస్తూ అక్షతలు దేవునిపై వేయవలెను.


ఆసనం - ఓం పురుష ఏ వేదగ్ సర్వం, యద్భూతం యచ్చ భవ్యం, ఉతా మృతత్వ స్యేశానః యద న్నేనాతిరో హతి

శ్లో|| కల్పద్రుమూలే   మణివేది మధ్యే సింహాసనం స్వర్ణ మాయం విచిత్రం, విచిత్ర వస్త్రా వృత మచ్యుత ప్రభోగ్రు హన లక్ష్మీ ధరణీ సమన్విత

శ్రీ సత్యనారాయణ స్వామినే నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి .సింహాసనార్ధం అక్షతాం

సమర్పయామి . దేవుడు కూర్చుండుటకై మంచి బంగారు పీట వేసినట్లు అనుకుంటూ

అక్షతలు వేయవలెను.

పాద్యం - ఏతావాన స్య మహిమా ఆతో జ్యాయాగ్ శ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని, త్రిపాద స్యా మృతం దివి.

శ్లో || నారాయణ నమస్తే స్తు నరకార్ణ వతారక , పాద్యం గృహాణ దేవేశ మామ సౌఖ్యం వివర్దయ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పాదౌ : పాద్యం సమర్పయామి . దేవుడు కాళ్ళు కడుగు కొనుటకు నీరు ఇస్తున్నామని

మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలోని నీరు అదే గిన్నెలో  ఉద్దరిణెతో వదలవలెను.

    

అర్ఘ్యం - త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుష:, పదో స్యేహ భవాత్పునః, తతో విశ్వజ్వ్య క్రామత్ సాశనాశనే అభి.

శ్లో|| వ్యక్తా వ్యక్త స్వరూపాయ హృషీక పతయే నమః మయా నివేదితో భక్యా హ్యార్ఘోయం ప్రతిగృహ్యాతాం


శ్రీ సత్యనారాయణ స్వామినే నమః హస్తౌ : అర్ఘ్యం సమర్పయామి . దేవుడు చేతులు కడుగుకొనుటకై 

నీళ్ళిస్తున్నామని మనసున తలుస్తూ పైన చెప్పిన పాత్రలో ఉద్దరిణెతో ఒక మారు  నీరు వదలవలెను. 


సూచన : అర్ఘ్యం , పాద్యం , ఆచమనం మొదలగు వాటికి ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలోనికి వదలవలెను. అరివేణంలో వదలరాదు .

స్నానం - యత్పురుషేణ హవిషా, యజ్ఞమతన్వత, వసంతో అస్యాసీదాజ్యం, గ్రీష్మ ఇద్మ స్శర ద్దవి:, 

శ్లో|| తీర్దో దకై: కాంచన కుంభ సంస్థై స్సువాసితైర్ధే వక్రుపార సార్ధ్యే, మయార్పితం స్నాన మిదిం గృహాణ పాదాబ్జనిష్యూత నదీ ప్రావాహ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః స్నపయామి అని పంచాపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవుని పై చల్లవలెను.


పంచామృతస్నానం -

ఆప్యాయస్య సమేతుతే విశ్వత స్సోమవ్రుష్ణి యం. భావా వాజస్య సంగధే, దధి క్రావుణ్నో అకారిషం జిష్ణోర శ్వస్య వాజినః సురభినో ముఖాకారత్ప్రన అయూగ్ షితారిషత్, శుక్ర మస్మిజ్యోతిరసి తేజోసి దేవో వ స్సవితో త్పునా త్వ చ్చ ద్రేన పవిత్రేనా వసోస్సోర్యస్య రశ్మిభి, మధువాటా ఋతాయతే మధుక్షరంతి సింధవః, మధ్విర్నస్సషంతోధి: మధుసక్తముతో శశి మధుమ త్పార్దివగ్ రజు, మధుధ్యౌరస్తునః పితా, మధుమానో వనస్పతి ర్మధు మాగ్ అదాభ్యః స్నానం పంచామ్రుతై ర్దేవ ఘ్రుహాన పురుషోత్తమ, అనాధనాథ సర్వజన గీర్వాణ ప్రణతిప్రియః


శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి అని స్నానమునకు

పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవునెయ్యి, ఆవుపాలు, ఆవుపెరుగు, తేనె, పంచదార కలిపిన పంచామృతమును స్వామిపై ఉద్దరిణెతో చల్లవలెను.


శుద్దోదక స్నానం - ఆపోహిష్టామాయో భువ స్తాన ఊర్జెదధాతన, మహేరణాయ చక్షసే యోవస్శివత మోర సస్త స్యభాజయతే  హనః ఉశతీరివమాతరః తస్మాదరంగ మామవోయస్య క్ష యాయ జన్వధ, ఆపోజనయతాచనః,

 శ్లో|| నదీనాం చైవ సర్వాసామానీతం నిర్మలోదకం, స్నానం స్వీకురు దేవేశ మయాదత్తం సురేశ్వర, శ్రీ సత్యనారాయణ స్వామినే నమః శుద్దోదక స్నానం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవునిపై చల్లవలెను.


వస్త్రం సప్తాస్యా సన్పరిధయః త్రిస్సాప్త సమిధః కృతాః దేవాయద్యజ్ఞా తన్వానాః అబత్నం న్పురుషం పశుం.


శ్లో|| వేదసూక్త సమాయుక్తే యజ్ఞం సామసమంవితే సర్వవర్ణ ప్రదే దేవవాససీతే వినిర్మితే శ్రీ సత్యనారాయణ స్వామినే నమః వస్త్ర  యుగ్మం సమర్పయామి అనుచు వస్త్రమును (ప్రత్తిని బొట్టు బిళ్ళ ఆకారములో గుండ్రముగా చేసుకొని కొద్దిగా తడి చేసి కుంకుమలో అద్దినచో అది వస్త్రమగును ) స్వామివారి ప్రతిమకు అద్దవలెను.


యజ్ఞోపవీతం : తవయజ్ఞం బర్హిషిప్రౌక్షణ్, పురుషం జాత మగ్రతః తేన దేవాయజంత, సాధ్యా ఋషయ స్చయే,


శ్లో || బ్రహ్మవిష్ణు మహేశానాం నిర్మితం బ్రహ్మసూత్రకం, ఘ్రుహాన భగవన్ విష్ణో సర్వేష్ట ఫలదో  భవ శ్రీసత్యనారాయణ స్వామినే నమః ఉపవీతం  సమర్పయామి అనగా జందెమును ఇవ్వవలెను. ఇదియును ప్రత్తితో చేయవచ్చును .ప్రత్తిని తీసుకుని పసుపు చేత్తో బొటన వ్రేలు , మధ్య వ్రేలితో మధ్య మధ్య  నలుపుతూ పొడవుగా చేసి ,కుంకుమఅద్దవలెను. దీనిని పురుష దేవతా పూజకు మాత్రమే సమర్పించవలెను .


గంధం - తస్మాద్య జ్ఞాత్సర్వ హుత సంభ్రుతం వ్రుషదాజ్యం, పాశూగ్ స్తా గ్ శ్చ క్రే వాయ వ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యా స్చయే,

శ్లో || శ్రీ ఖండం చందనం దివ్యం గందాడ్యం సుమనోహరం,  విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగృహ్యాతాం, శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి అని ముందుగా తీసి పెట్టుకున్న గంధమును కుడి చేతి ఉంగరం వ్రేలుతో స్వామివారి ప్రతిమపై చల్లవలెను.


ఆభరణం

తస్మాద్య జ్ఞాత్సర్వ హుతః, రుచస్సామాని జజ్ఞిరే, చందాగ్ సి జజ్న రె తస్మాత్ యజుస్త స్మాద జాయత.

శ్లో || హిరణ్యహర కేయూర గ్రైవేయ మనికంకణై:, సుహారం భూషనై ర్యుక్తం గృహాన పురుషోత్తమ శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ఆభరణం సమర్పయామి స్వామింకి శక్తికి తగినట్లుగా బంగారంగాని, వెండి గాని ఆభరణములను చేయించినవి స్వామి వద్ద వుంచి పూజించవలెను .


పుష్పం  తస్మాదశ్వా అజాయంతః యేకే చొ భ యాదతః, గావో హి జజ్ఞిరే తస్మాత్,  తస్మాబ్జాటా అజావయః,

శ్లో || మల్లికాది సుగంధాని మాలత్యాదీని మే ప్రభో, మయాహృతాని పూజార్ధం పుష్పాణి ప్రతిగృహ్యాతాం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః పుష్పాణి సమర్పయామి అని, స్వామికి పువ్వులతో అలంకారము చేయవలెను. పువ్వులతో పూజించవలెను.


పిదప ఆధాంగ పూజను చేయవలెను. ఈ క్రింది నామాలను చదువుచు పుష్పము లతో గాని, కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.


అథాంగ పూజా

ఓం కేశవాయ నమః పాదౌ పూజయామి, ఓం గోవిందాయ నమః గుల్పౌ పూజయామి, ఓం ఇందిరాపతయే నమః జంఘే పూజయామి, ఓం అనఘాయ నమః జానునీ పూజయామి, ఓం జనార్ధనయ నమః ఊరుం పూజయామి, ఓం విష్టర స్రావ సేనమః కటిం పూజయామి, ఓం కుక్షి స్తాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి, ఓం లక్ష్మీ వక్ష స్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి, ఓం శంఖ చక్ర గదాశారజ్గ పానయే నమః బాహూన్ పూజయామి, ఓం కంబుకంటాయ నమః కంటఓ పూజయామి, ఓం పూర్ణేందు నిభావక్త్రాయ నమః వక్త్రం పూజయామి, ఓం కుంద కుట్మలం దంతయ నమః దంతాన్పూజయామి, ఓం సూర్య చంద్రాగ్ని ధారిణే నమః  నేత్రే పూజయామి, ఓం సహస్ర శిరసేనమః శిరః పూజయామి, ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి.

తరువాత అష్టోత్తర శతనామావళి పూజ. దీని యందు 108  మంత్రములుండును. ఈ మంత్రములను చదువుతూపుష్పముతో గాని, పసుపు కుంకుమలతో గాని స్వామిని పూజించవలెను.

  1. ఓం నారాయణాయ నమః

  2. ఓంనరాయ నమః

  3. ఓం శౌరయే నమః

  4. ఓం చక్రపానయే నమః

  5. ఓం జనార్ధనాయ నమః 

  6. ఓం వాసుదేవాయా నమః

  7. ఓం జగద్యోనయే నమః

  8. ఓం వామనాయ నమః

  9. ఓం జ్ఞాన పంజరాయ నమః

  10. ఓం శ్రీవల్లభాయ నమః                                                           

  11. ఓం జగన్నాథాయ  నమః  

  12. ఓం చతుర్ముర్తయే నమః 

  13. ఓం వ్యోమకేశాయ నమః

  14. ఓం హృషీకేశాయ నమః

  15. ఓం శంకరాయ నమః

  16. ఓం గరుడద్వాజాయ నమః

  17. ఓం నారసింహాయ నమః

  18. ఓం మహాదేవాయ నమః

  19. ఓం స్వయంభువేనమః

  20. ఓం అచ్యుతాయ నమః

  21. ఓం శంఖపాణయే నమః

  22. ఓం పార్ధసారదియే నమః

  23. ఓం పరంజ్యోతిషే నమః

  24. ఓం అత్మజ్యోతిషే నమః

  25. ఓం అచంచలాయ నమః

  26. ఓం శ్రీ వత్సామ్కాయ నమః

  27. ఓం అఖిలధారాయ నమః                                                     

  28. ఓం సర్వలోక పతిప్రభవే నమః

  29. ఓం ప్రభవే నమః  

  30. ఓం త్రివిక్రమాయ నమః

  31. ఓం త్రికాలజ్ఞానాయ నమః

  32. ఓం త్రిధామ్నే నమః

  33. ఓం కరుణాకరాయ నమః

  34. ఓం సర్వజ్ఞాయ నమః

  35. ఓం సర్వాంగాయ నమః

  36. ఓం సర్వస్మై నమః

  37. ఓం సర్వేశాయ నమః

  38. ఓం సర్వసాక్షికాయ  నమః                                                 

  39. ఓం హరయే నమః

  40. ఓంభువనేశ్వరాయ నమః                                                   

  41. ఓం శ్రీధరాయ నమః

  42. ఓం దేవకీపుత్రాయ నమః

  43. ఓం హలాయుదాయ నమః

  44. ఓం సహస్రబాహవే నమః

  45. ఓం అవ్యక్తాయ నమః

  46. ఓం సహస్రాక్షాయ నమః

  47. ఓం అక్షరాయ నమః

  48. ఓం క్షరాయ  నమః

  49. ఓం గజారి ఘ్నాయ నమః

  50. ఓం కేశవాయ నమః                                                         

  51. ఓం కేశమర్దినాయ నమః

  52. ఓం కైటభారయే నమః

  53. ఓం అవిద్యారయే నమః

  54. ఓం కామదాయ నమః

  55. ఓం కమలేక్షణాయ నమః

  56. ఓం హంసశత్రవే నమః

  57. ఓం అధర్మ శత్రవే నమః

  58. ఓం కాకుత్స్థాయ నమః                                                          

  59. ఓం ఖగవాహనాయ నమః

  60. ఓం నీలాంబుదద్యుతయే నమః

  61. ఓం శారిజ్గణే  నమః 

  62.  ఓం హరయే నమః 

  63. ఓం శేషాయే నమః 

  64. ఓం పీతవాసనే నమః

  65. ఓం గుహశ్రయాయ నమః

  66. ఓం వేదగర్భాయ నమః

  67. ఓం విభవే నమః

  68. ఓం విష్ణవే నమః            

  69. ఓం శ్రీమతే నమః

  70. ఓం త్రైలోక్య  భూషనాయ నమః

  71. ఓం యజ్ఞమూర్తయే నమః

  72. ఓం అమేయాత్మనే నమః

  73. ఓం వరదాయ నమః                                                                

  74. ఓం వాసనానుజాయ నమః

  75. ఓం జితేంద్రియాయ  నమః

  76. ఓం జితక్రోదాయ నమః

  77. ఓం సమద్రుష్టయే నమః

  78. ఓం సనాతనాయ నమః

  79. ఓం భక్తప్రియాయ నమః

  80. ఓం జగత్పూజ్యాయ నమః

  81. ఓం పరమాత్మనే నమః

  82. ఓం నిత్యాయ  నమః

  83. ఓం నిత్యత్రుప్తాయ నమః

  84. ఓం నిత్యానందదాయ నమః

  85. ఓం సురాధ్యక్షాయ నమః

  86. ఓం నిర్వికల్పాయ నమః

  87. ఓం నిరంజనాయ నమః

  88. ఓం బ్రాహ్మన్యాయ   నమః                                                     

  89. ఓం పృథీ వీనాధ్యాయ నమః

  90. ఓం నిష్కలంకాయ నమః

  91. ఓం నిరాభాసాయ నమః

  92. ఓం నిష్ప్రపంచాయ నమః

  93. ఓం నిరామయాయ  నమః       

  94. ఓం భక్తవశ్యాయ నమః 

  95. ఓం మహొదరాయ నమః

  96. ఓం అసురాంతకాయ నమః 

  97. ఓం సర్వలోకానామంత్రకాయ నమః  

  98. ఓం అనంతాయ నమః

  99. ఓం అనంత విక్రమాయ  నమః

  100. ఓం మాయాధరాయ నమః

  101. ఓం నిరాధారాయ నమః

  102. ఓం సర్వధారాయ నమః

  103. ఓం ధరధరాయ నమః

  104. ఓం పుణ్యకీర్తయే నమః

  105. ఓం పురాతనాయ నమః

  106. ఓం త్రికాలజ్ఞాయ నమః

  107. ఓం విష్టరశ్రవసే నమః

  108. ఓం చతుర్భుజాయ నమః


ఓం సత్యనారాయణ స్వామినే నమః  నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.


ధూపం - యత్పుమ్శం వ్యవధు:, కతిథావ్యంల్ప యాన్ ముఖంకిమస్య కౌ బాహూ, కావూరూ పాదావు చ్యేతే

శ్లో || దశాంగం గగ్గులో పేతం సుగంధంచ మనోహరం

ధూపం గృహాణ దేవేశ సర్వదేవ నమస్క్రుతః

ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః దూపమాఘ్రాపయామి. ధూపం సమర్పయామి.అంటూ ఎడమచేత్తో గంటవాయిస్తూ కుడిచేత్తో అగరుబత్తిని తిప్పుతూ పొగను దేవికి చూపవలెను.

దీపం - బ్రాహ్మణోస్య ముఖమాసిత్, బాహూరాజన్యః కృతః, ఊరుతద్య స్య యద్వైశ్యః, పద్బ్యాగ్ శూద్రో  అజాయత 

ఘ్రుతావర్తి సంయుక్తం విహ్నినా యోజితం ప్రియం, దీపం గృహాణ దేవేశ త్ర్యైలోక్య తిమిరాపహామ్ 


ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సాక్షాత్ దీపం దర్శయామి. అని మొదట్లో చెప్పిన విధంగా దీపారాధనలో వున్న అదనపువత్తులలో ఒకదానిని తీసుకొని హారతి వెలిగించే దాంట్లో వేసి వెలిగించి గంట మ్రోగిస్తూ ఆ దీపం స్వామికి చూపుతూ పై శ్లోకమును చదువవలెను.


నైవేద్యం - చంద్ర మామతోజాతః చక్షో సూర్యో అజాయత, ముఖాదింద్ర శ్చాగ్నిశ్చ, ప్రానద్వాయు రజాయత, శ్లో|| సౌవర్ణ స్థాలిమధ్యే మణగణచితే గోఘ్రుతాక్తా న్ సుపక్వాన్ భక్ష్యాన్  భోజ్యాంశ్చ లేహ్యాన పరిమిత ర సాన్ చోష్య మనన్నం నిధాయ, నాశాక్యేరుపేతం దధి మధు సాగుద కశేర పానీయయుక్తం తాంబూలం చాపి విష్ణో ప్రతిది వ స మా హం మానసు కల్పయామీ రాజాన్నం సూపసంయుక్తం శాక చొ ష్య సమన్వితం, ఘ్రుత భక్ష్య సమాయుక్తం  నైవేద్యం ప్రతిగృహ్యాతాం, 'ఓం భూర్భువ స్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి,ధీ యో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి,(ఋతం త్వా సత్యేత పరిషించామి అని రాత్రి చెప్పవలెను) అమృతమస్తు అమృతో పస్తర ణమసి,ఓం ప్రాణాయ స్వాహా,ఓం అపానాయ స్వాహ,ఓం వ్యానాయ స్వాహ,ఓం ఉదానాయ స్వాహ,ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ ఆరుమార్లు చేతితో (చేతిలోని ఉద్ధరిణెతో) స్వామికి నివేదనం చూపించాలి.పిదప ఓం సత్యనారాయణ నమః నైవేద్యానంతరం 'హస్తౌ ప్రక్షాళ యామి'అని ఉద్ధరిణెతో పంచపాత్రలోని నీరు ముందు చెప్పిన ఆర్యపాత్ర (పంచ పాత్ర కాకుండా విడిగా చెంబులో పెట్టుకొనే నీళ్ల పాత్ర )లో వదలాలి.తరువాత 'పాదౌ ప్రక్షాళయామి' అని మరోసారి నీరు ఆర్ఘ్య పాత్రలో ఉద్ధరిణెతో వదలాలి.పునః శుద్ధచమనీయం సమర్పయామి అని ఇంకొక పర్యాయం నీరు వదలాలి.


తాంబూలం - నాభార్యా ఆసీదంత రిక్షం, శీర్షో ద్యౌ సస మవర్మత, పద్భ్యాభూమి రది సస్శ్రో త్రాత్, తాతాలో కాగ్ అకల్పయన్, శ్లో || పూగీ ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం .

శ్రీ సత్యనారాయణ స్వామినే నమః తాంబూలం

సమర్పయామి అని తాంబూలమును అనగా మూడు తమలపాకులు ,రెండు పోక చెక్కలు వేసి

స్వామి వద్ద ఉంచాలి. తాంబూలం వేసుకున్నాక నోరు కడుక్కొనుటకు నీరు

ఇస్తున్నామని తలుస్తూ ,'తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ' అంటూ

ఉద్దరిణెతో నీరు అర్ఘ్య పాత్ర లో వదలాలి . పిమ్మట కర్పూరం వెలిగించి .......


నీరాజనం - వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమస్సు పౌరే, సారవాని రూపాని విచితథీరః నామాని కృత్య భి వదన్ యదాస్తే: నర్యప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే,

జాతం జనిష్య మానాంచ అమృతే స్టే ప్రతిష్టితాం, ఆధర్వ పితుంమే  గోపాయ రస మన్న

మహాయుషే, అబద్ధాయో శీతతనో అవిషం నః పితుకృణు,


శగ్ స్యశూన్ మే గో  పాయ ద్విపాదో యే చతుష్పదః అష్టాష పాశ్చయ ఇహగ్నేయే చిక పాషా ఫా ఆశుగాః సాపన

సబం మే గోపాయ ఏచన భయాస్సాభాసదః తవింద్రి యా వతః కురుసవ మాయురుపాసతాం, అహేబుద్నియ మంత్రం మే గోపాయ య ముషాయ స్ర్యైవి దావిదః, రుచాస్సమాని యజూగ్ షిసాహి శ్రీర మ్రుకానతాం, మానోహిగ్ సేజ్ఞా, వేదో గామశ్వం పురుషం జగత్ అబి భర దగ్న ఆగహిషి యా పరిపాతయ, సామ్రాజ్యం చ విరాజ చాభి శ్రీ ర్వా చనో గృహే, లక్ష్మే రాష్ట్ర వ్య యా ముఖే తయామా సగ్ సృజామసి, సంతత శ్రీరస్తు, సర్వమంగళాని భవంతు, నిత్య శ్రీ నిత్య మంగళాని భవంతు.


నీరాజనం గృహాణేదం పంచవర్తి సమన్వితం, తేజో రాశి మయందత్తం గృహానత్వం నీరాజనం సమర్పయామి.

శ్రీ సత్యనారాయణ స్వామినే నమః అని కర్పూర నీరాజనం సమర్పయామి. అని కర్పూర  బిళ్ళలు హారతి కుందిలో వేసి ముందుగా దీపారాధనకు వెలిగించిన దీపంతో వెలిగించి,మూడుమార్లు త్రిప్పుచూ,చిన్నగా ఘంట వాయించవలెను.అనంతరం మళ్లీ పువ్వుతో నీరు హారతి కుంది చివర వదులుతూ 'కర్పూర నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి' అని చెప్పి నీరాజనం స్వామివారికి చూపించి తరువాత ఇంటిలోని  వారందరూ హారతిని కళ్ళకు అద్దుకోవాలి. తరువాత అక్షతలు,పువ్వులు,చిల్లర డబ్బులు చేతితో పట్టుకొని,

మంత్రపుష్పం : ఓం|| ధాతా పురస్తాద్యముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రదీ శ శ్చతస్రః తమేవం విద్వాన్ అమృత ఇహభవతి నాన్యః పంధా అయనాయ విద్యతే ఓం  సహస్రశీర్హం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం  విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ ౦ హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వము పజీపతి పతిం విశ్వస్యా త్మేశ్వరగ్ ౦ శాశ్వతగ్ ౦ శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వత్మాసం పరాయణం నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః నారాయణ పరబ్రహ్మ తత్త్వం నారాయణః పరః నారాయణ పరోధ్యాతాధ్యానం నారాయణః పరః యచ్చకించి జ్ఞగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్భ హిశ్చతత్సర్వం  వ్యాప్య  నారాయణ స్ధితం  అనంతమన్యయగ్ ౦ కవిగ్ ౦ సముద్రేతం విశ్వశంభువం పద్మ కోశ ప్రతీకాశగ్ ౦ హృదయంచా ప్యదో ముఖం  అధో నిష్ట్యా విత స్త్యాన్తే నభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులంభాతి విశ్వస్యాయతనం మహః సంతతగ్ ౦ శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం తస్యాన్తే సుషిరగ్ ౦ సూక్ష్మంత స్మిన్సర్వం ప్రత తస్యమధ్యే నుహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతో ముఖఃసోగ్రభుగ్విభ జన్తిష్ట న్నాహార మజరః కవిహ్తిర్యగూర్ధ్వ మధ శ్శాయీర శ్మయస్తస్య సంతతా తాపయతిస్వం దేహమపాదతలమస్తకం తస్యమధ్యేవ హ్నిశిఖా అణీ యోర్ధ్వా వ్యవస్దితఃనీలతో యద మధ్య స్ధాద్విద్యుల్లెఖేవ భాస్వరానీ వార శూక వత్తన్వీ పీతభాస్వత్యణుపమా తస్య శిఖాయామధ్యే పరమాత్మా వ్యసస్దితః సబ్రహ్మస్సశివస్సహరి స్స్యేంద్ర స్సోక్షరః పరమస్వరాట్ యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చస్ధ్రమావా అపాం పుష్పమ్ పుష్పవాన్ ప్రజావాన్  పశుమాన్ భవతియ ఏవం వేద యోపా మాయతనం వేద ఆయతనవాన్భవతి అగ్నిర్వా అపా మాయతనం ఆయతనవాన్భవతియోగ్నే రాయతనం వేద ఆయతనవాన్భవతియోగ్నే రాయతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవా అగ్నే రాయతనం ఆయతనవాన్భవతి ఏవం వేదయోపా మాయతనం వే ఆయతనవాన్భవతి వాయుర్వా అపా మాయతనం ఆయతనవాన్భవతి యోవా యో రాయతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవై వాయో రాయతనం ఆయతనవాన్భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్భవతి చస్ధ్రమావా అపామాయతనం ఆయతనవాన్భవతి శ్చస్ధ్రమస ఆయతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవై చంద్రమస  నవమ్ ఆయతనవాన్భవతియ ఏవం వేదయోపా మాయతనం వేద ఆయతనవాన్భవతి నక్షత్రాణి వా అపామాయతనం వేద ఆయతనవాన్భవతి యో నక్ష త్రాణా మాయతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవై నక్ష త్రాణా మాయతనం ఆయతనవాన్భవతియ ఏవం వేదయోపా మాయతనం వేద ఆయతనవాన్భవతి సర్జన్యోవా అపా మాయతనం వేద ఆయతనవాన్భవతియః సర్జన్య స్యాయతనం ఆయతనవాన్భవతి ఆపోవై సర్జన్య స్యాయతనం ఆయతనవాన్భవతియ ఏవం వేదయోపా మాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరోవా అపా మాయతనం ఆయతనవాన్భవతి యస్సంవత్సర స్యాతనం వేద ఆయతనవాన్భవతి ఆపోవై సంవత్సర స్యాయతనం ఆయతనవాన్భవతియ ఏవం వేద యోప్సు నావం ప్రతిష్టితాం వేద ప్రత్యేవతిష్టతి కింత ద్విష్నోర్బాల మాహుహ్ కా దేపిహ్ కిం పారాయణంఏకో యద్దారయ దేవః రే జతీ రో దసీ ఉభౌ హ్వాతా ద్విష్నోర్బల మాహుహ్ అక్ష రాద్ది ప్తి రుచ్యతే త్రి పదా ద్దారాయద్దేవః యద్విస్నోరేక్త ముత్తమమ్ ఓం రాజాధి రాజయ ప్రసహ్యాసాహిణే నమోవయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్  కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో ద దాతు కుబేరాయ వైశ్రవణాయ మహా రాజాయా నమః ఓం తద్భ్రహ్మ ఓం త ద్వాయుహ్ ఓం త దాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్సురోర్నమః అన్త శ్చరతి భూతే సుగుమాయాం విశ్వ ముర్తిసు త్వం యజ్ఞ స్త్వంవషట్కార  స్త్వమిస్ద్ర స్త్వగ్ ౦ రుద్ర స్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిహ్త్వం త దాస అపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోమ్  ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర స్సర్వభూతానాం బ్రహ్మధి పతిర్ బ్రహ్మణోధీ పతిర్ బ్రహ్మశివో మే అస్తు సదాశివోం  త ద్విష్నోహ్ పరమం పదగ్ ౦ సదా పశ్యన్తి సూరయః దివీ వ చక్షు రాతతం త ద్వి ప్రాసోవిసన్యవో జాగృవా న్సస్సమింధతే  విష్ణోర్యత్సరమం పదం అ ద్వైతం విష్ణవే చరుం నిర్వపతి యజ్ఞో వై విష్ణుహ్ యజ్ఞ ఏవాస్తతః ప్రతి తిష్టతి స్తోత్ర జు హొతి ఋతగ్ ౦ సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ  పింగళం ఊర్ద్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వైనమోనమః నారాయణాయ విద్మ హే వాసుదేవాయ ధీ మహీ త న్నో విష్ణుహ్ ప్రచోదయాత్ ఆకాశాత్సతితం తోయం యధాగచ్చతి సాగరం సర్వ దేవనమష్కారం కేశవం ప్రతి గచ్చతి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పుకొని అక్షతలు, పువ్వులు, చిల్లర స్వామివద్ద ఉంచవలెను. పిమ్మట ఈ దిగువ  మంత్రము జపిస్తూ మూడుసార్లు ప్రదక్షిణలు చేయాలి.


ప్రదక్షిణ నమస్కారములు -  శ్లో || యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహంపాపకర్మాహం పాపాత్మా పాపశంభవః త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల,అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ , తస్మాత్కారుణ్య భావేన రక్షరక్ష జనార్ధన, ప్రదక్షిణం కరిష్యామి సర్వ బ్రమ  నివారణం

సంసార సాగారాన్మాం త్వం ముద్ద రస్వ మహాప్రభో, శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ప్రదక్షిణం సమర్పయామి అని చేతిలో అక్షతలు ,పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి (అనగా తమ లో తాము చుట్టూ తిరిగి ) స్వామికి  నమస్కరించి ,సాష్టాంగ దండ ప్రమాణం చేసి (అనగా మగవారు పూర్తిగా పడుకుని తలను నేలకు ఆన్చి ,ఆడువారు మోకాళ్ళపై పడుకుని కుడికాలు ఎడమకాలు పై వేసి )తరువాత స్వామి పై చేతిలో నున్న అక్షతలు పువ్వులు వేయవలెను .



పునః పూజ : ఓం శ్రీ సత్యనారాయణ నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకుని, పంచ పాత్రలోని

నీటిని చేతితో తాకి ,అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .


ఛత్రం  ఆచ్చాదయామి ,చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి .సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోపచార పూజాం సమర్పయామి. అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .


ప్రార్ధన - శ్లో || అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్య సూదనం, హృషీకేశం జగన్నాధం, వాగీశం వరదాయకమ్. సగునంచ గనాతీతం గోవిందం గరుడధ్వజం, జనార్ధనానం జనానందం జానకీ వల్లభం హరిం, ప్రణమామి సదా భక్త్యా నారాయణ మజం పరం, దుర్గమే విషమే ఘోరే శత్రునా పరిపీడితే, విస్తార యతు సర్వేషు తథా నిష్ఠ భయోశుచ,

మామాన్యేతాని సంకీర్త్య ఫల మీప్సిత మాప్నుయాత్, సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వేటటం విశ్వం యేనతస్మై నమోనమః శ్రీ సత్యనారాయణ స్వామినే నమః ప్రార్ధన నమస్కారం సమర్పయామి.

ఫలం: శ్లో || ఇదం ఫలం మాయాదేవ స్థాపితం పురుతస్తవ, తేనమే సఫలావాప్తి రభ వే జ్ఞన్మని జన్మవి, శ్రీ సత్యనారాయణ స్వామినే నమః, ఫలం సమర్పయామి.

ఏతత్ఫలం శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి అనుకోని స్వామి వద్ద అక్షతలు తీసుకొని తమ తమ తలలపై వేసుకొనవలెను.ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి  తిరిగి క్రింద ఉంచి పళ్ళెములో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటముపై నుంచవలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ప్రవేశయామి. శోభనార్ధం పునరాగమనాయచ అని ఉద్వాసన పలుకుతారు.

శ్లో || యస్య స్మృత్యాచ నోమోక్త్యాతపః పూజాక్రియాది షు నూన్యం సంపూర్ణ తాం యాతి సద్యో వందే మచ్యంతం మంత్ర హీనం క్రియాహీనం భక్తిహీనం జనార్ధన, యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తడస్తుతే, అనయా ధ్యాన ఆవహనాది షోడశోపచార పూజయచ భగవాన్సర్వాత్మకః శ్రీ సత్యనారాయణ స్సుప్రీతో వరదో భవతు, శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజావిధానం సంపూర్ణం.


శ్రీసత్యనారాయణవ్రతకథ


ప్రథమోధ్యాయః

పూర్వమొకప్పుడు కొందరు మహామునులు నైమిశారణ్యమున కూడియున్నవారై సూతమునిని జూచి యిట్లదిగిరి. "ఏ వ్రతము చేసిన, తపస్సు చేసిన, కోరిన ఫలములు సిద్ధించునో అట్టి దానిని తెలుపుము" అనిన మహామునులను చూసి సూతముని "ఓ మునులారా! పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిషునువును ఇదే విధముగా కోరగా, శ్రీ హరి ఇట్లు చెప్పెను. ఆ విషయమును మేకు తెలిపెదను. షడ్దగా వినుడు " అనెను.


పూర్వమొకప్పుడు నారదమహముని సకల లోకములు తిరుగుచు మర్గామధమున్ భూలోకమునకు వచ్చెను. అచట మానవులు పడుతున్న కష్టములు చూసి, వీరికి ఈ కష్టములు ఎట్లు తొలగును ? అని అలోచించి, విష్ణు లోకమునకు వెళ్లి చతుర్భుజుండును (నాలుగు చేతులు కలవాడు) తెల్లని శరీరచ్చాయ గలవాడును, శంఖము, చక్రము, గద, పద్మము మొదలగు అలంకారములు కలవాడును అగు సరే హరిని చూచి ఇట్లు ప్రార్ధించెను. మనస్సులో ఊహించుటకు గాని, వాక్కుతో వివరించుటకుగాని శక్యముగాని అతీతమైన రూపముగలవాడా ! ఆది మధ్యంత రహితా!గునాత్ముడైనటువంటి ఆ పురుషుడైనటువంటి, భక్తుల భాదలు తొలగించు శ్రీ మన్నారాయణా! నీకు భక్తితో నమస్కరించుచున్నాను. శ్రీహరి  స్త్రోత్రమును వినినవాడై నారదమహమునితో ఇట్లనెన

ఓ నారదా మహామునీ ! నేవు వచ్చిన కారణమేమి? నీ కోరిక తెర్చేదను చెప్పుము' అనెను అంత నారదుడు శ్రీ మహావిష్ణువును జూచి 'ఓ జగద్రక్షా! భూలోకమున మానవులు నావిధములుగా కష్టములు పడుచున్నారు. వారలకా కష్టములు ఎట్లు తొలగును, అందుకైన ఉపాయము తెలిపి అనుగ్రహింపుము' అని ప్రార్దించెను.


అందులకు శ్రీ హరి ఇట్లు చెప్పసాగెను. నారద మహామునీ ! నీవు లోకహితార్దమై చక్కని విషయము అడిగితివి. అందులకు ఒక వ్రతము కలదు. అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించువారు, ఇహలోకమున సకలైశ్వర్యములు పొందినవారై పరమున మోఖమును పొందుదురు. అది విని నారదుడు ఇట్లు అడుగుచున్నాడు. ఓ దామోదరా ! ఆ వ్రతము ఆచరించు విధానమేమి ? ఆచరించుట వలన ఏమి ఫలితము కలుగును? దానిని ఇంతకూ ముందు ఎవరు ఆచరించిరి? అంతయును వివరముగా తెలుపుము అని కోరగా-        


శ్రీ హరి ఇట్లు చెప్పసాగెను. సత్యనారాయణ వ్రతము సకల దుఖమును నివారణ చేయును. సకలైశ్వర్యములు గలుగ జేయును. సంతానము కలుగును. సర్వత్రా జయము కలుగును. ఈ వ్రతమును వైసఖమాసమందుగని, మాఘమాసమందు గాని, కార్తీక మాసమున గాని, ఏకాదశి, పూర్ణిమ మ్దలగు శుభ తిథులయందుగాని, రవి సంక్రమణ దినమున గాని ఆచరించవలెను. కష్టములు సంభవించినప్పుడును, దరిద్రముతో భాదపడుచున్నపుడు ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రాతమాచరించినచో అట్టి వివాదమున తప్పక జయము కలుగును. ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతినెల ఆచరించవచ్చును. లేదా సంవత్సరమున కొక మారిననూ చేయవచ్చును.ఎవరి శక్త్యానుసారము వారు చేయవచ్చును. సూర్యోదయ పూర్వమే నిద్రలేచి కాలకృత్యములను నెరవేర్చుకొని స్నాన సంధ్యానుష్టానములు యధాప్రకారము నిర్వర్తించుకొని శుచియై నిశ్చల భక్తితో దేవాధిదేవా! శ్రీ సత్యనారాయణ ప్రభూ! నీ అనుగ్రహము పొందుటకై భక్స్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించుచున్నాను అని తన మనస్సున ధ్యానము చేసుకొని నమస్కారము చేయవలెను.


ఆ విధముగా సంకల్పముచేసి, మధ్యాహ్న కాలమున గూడ కర్మానుష్టానములు నేరవేర్చుకొని సాయంకాలమున మరల స్నానముచేసి రాత్రి ప్రారంభాకాలమున ఈ వ్రతమును ఆచరించవలెను. పూజా స్థలమును గోమయముతో అలికి శుద్ధిచేసి వరిపిండి మొదలగు అయిదు రంగుల చూర్నముతో ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రము పరచి, దానిపై బియ్యము పోసి దానిపై కలశమును ఉంచవలెను. ఆ కలశమును వెండితో గాని, రాగితో గని, ఇత్తడితో గాని తుదకు మట్టితో చేయవ లెను. లోభత్వము చేయరాదు యధాశక్తి అన్నియు ఆచరించవలెను. ఆసనము మీద మరల క్రొత్త వస్త్రములు పరచవలెను. ఆ నూతన వస్త్రములు మీద సత్యనారాయణస్వామి ప్రతిమ ఉంచవలెను. ఆ ప్రతిమ ఒక కర్షము బంగారముతో గాని, అర్ధ  కర్షము బంగారముతో గాని లేదా తుదకు పావు కర్షము బంగారముతో నైననూ చేయించి పంచం,రుతములతో అభిషేకము గావించి మంటపమున ఉంచవలెను.


ముందు విఘ్నేశ్వర పూజ చేయవలెను. తరువాత లక్ష్మీ దేవిని,  విష్ణుమూర్తిని, పరమేశ్వరుని, పార్వతిని, సూర్యుడు మొదలగు నవగ్రహములను, ఇంద్రాది అష్ట దిక్పాలకులను, అది దేవత ప్రత్యధి దేవతాయుతముగా పూజించవలెను. విఘ్నేశ్వరుడు మొదలగు ఐదుగురు దేవతలను కలశమున కుత్తరమున మంత్రముతో ఉత్తర సమాప్తిగా ప్రతిష్టించి పూజచేయవాలను. తరువాత అష్ట దిక్పాలురను తూర్పు ,మొదలగు ఎనిమిది దిక్కులయందు ప్రతిష్టించి పూజచేయవలెను. పిదప సత్యనారాయణస్వామి కలశము మీద పూజచేయవలెను. నాలుగు వర్ణములవారును స్త్రేలును పురుషులును కూడా ఈ వ్రతమును ఆచరించవలెను. బ్రాహ్మణులు పౌరాణికముగాను, వైదికముగాను కూడా ఈ వ్రతమును ఆచరించవలెను. బ్రాహ్మణులు కానివారు పౌరాణికముగానే వ్రతమును ఆచరించవలెను.


తుదకు ఏదినమైననూ సాయంకాలము ఈ వ్రతమును ఆచరించవచ్చును. వ్రతమును చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకోనివచ్చి చేయవలెను. అరటిపండ్లు, ఆవునెయ్యి, ఆవుపాలు, గోధుమనూక అది లేనిచో బియ్యమునూక, చక్కెర లేనిచో బెల్లము ఇవన్నియు సమానముగా అనగా సేరుంబావు చొప్పున చేర్చి, ప్రసాదమును తయారుజేసి స్వామికి నివేదన చేయవలను. ఈ విధముగా నైవేద్యము జరిగించిన పిమ్మట బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి కథ శ్రద్ధగా విని బంధుమిత్రాదుల తోడను, బ్రాహ్మణుల తోడను కలిసి భోజనము చేయవలెను. సత్యనారయణ స్వామికి ప్రీతిగా నృత్య గీతాదికములను జరిపించవలెను. ఇది భూలోకమున కలియుగమునందు ఇష్ట కామితార్ధములను బడయుటకు మిక్కిలి సులభమైన మార్గము.



ద్వితియోధ్యాయః

ఓ మునిశ్రేష్టులారా! పూర్వము ఈ వ్రతము ఆచరించిన వారి కథ చెప్పుచున్నాను వినుడు. పూర్వము కాశీ నగరమున ఒక బ్రాహ్మణుడుండేడి వాడు. అతడు మిగుల దరిద్రుడగుటచే అన్నవస్త్రములు లేక ఆకలి భాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుచుండెడి వాడు. భగవానుడు  బ్రాహ్మణా ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు దుర్భరమైన కష్టమును అనుభవించుట చోఇ తానూ ఒక వ్రుద్ద బ్రాహ్మణ రూపమును పోమ్దినవాడై ఆ బెడ బ్రహ్మనునకు ఎదురుగ పోయి 'ఒఈ బ్రాహ్మణుడా! నీవు వేద విదురుడవై యుండి ఇట్లు దరిద్రముననుభవించుచు తిరుగుచుంటివేమి? అని అడుగగా ప్రభూ నేను మిక్కిలి దరిద్రుడను, భిక్షాటన చే జీవించుచున్నాను, చాల కష్టములను అనుభవించుచున్నాను. అతడు బ్రాహ్మణుడా! శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారము. ఆ సత్య దేవుని సేవించినచో నీ కష్టములెల్ల తొలగిపోవును. కనుక నీవు ఆ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరింపుమనెను. వ్రాత విధానమును చెప్పి వృద్ధ బ్రాహ్మణుడు అచ్చటనే అంతర్ధాన మయ్యెను.


వెంటనే ఆ బ్రాహ్మణుడు సత్యనారాయణవ్రతమును రేపు చేసెదను అని మనసున సంకల్పించి, నాటి రాత్రి ఉత్సాహమున నిదురరాక ఎట్లో గడిపి మరునాడు ప్రాతః కాలమున లేచి  నిత్యకృత్యములు నేరవర్చుకొనినవాడై ఈ రోజు తప్పక వ్రతమాచ రించవలెను. మనస్సున దృడముగా నిశ్చయించుకొని బిక్షాటనకు బయలుదేరెను. ఆదినమున బ్రాహ్మణునకు ఎన్నడు రానంత ద్రవ్యము లభించినది. అతడు బంధువులను పిలిచి భక్తీశ్రద్ధలతోసత్యనారాయణ వ్రతమును ఆచరించేను. వ్రత ప్రభావము వలన బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలిగి, సకల సంపదలు పొందిచాల సంతోషించెను. అది మొదలు ప్రతిమాసమునాను విడువక సత్యనారాయణ వ్రతమును భక్తిశ్రద్ధలతో చేయుచుండెను. ఆ విధముగా చేయుట వలన ఆ బ్రాహ్మణుడు మహాదైశ్వర్య వంతుడగుటయేగాక సకల పాపముల నుండి విముక్తుడై అంత్యమున మోక్షమును పొందెను. ఈ వ్రత మాచరించినవారు సకల దుఃఖముల నుండి విముక్తిని పొందినవారై సుఖముగా నుందురు.


ఓ మునులారా! ఆ విధముగా అశ్రీ హరి నారదునకు చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిపితిని. అని సూతులవారు చెప్పిరి. మరల ఆ మునులు వారితో యిట్లనిరి. ఆ బ్రాహ్మణుని వలన యెవరు ఈ వ్రతమును చేసిరో సవిస్తరముగా తెలుపుమనిన సూతులవారు ఇట్లు చెప్పుచున్నారు. ఓ ములారా! ఆ వ్రతము యెవరిచే చేయబడినదో చెప్పుచున్నానని వినుడు. ఒకప్పుడు ఒక ఆబ్రాహ్మణుడు ఈ వ్రతమాచరిం చుచుండెను. భక్తీ శ్రాధాలతో బంధువులు, సర్వజనులు వచ్చి ఆనందముతో వ్రతకథ వినుచుండిరి. ఆ సమయమున ఒకకట్టెలమ్మునాతడు మిగుల అసకలి దప్పులతో నుండియు బ్రాహ్మణుడు చేయుచున్న దంతయు చూచి, ఓ మహాత్మా! మీరు చేయుచున్న వ్రతమేమి? ఈ వ్రతము చేసిన ఏమి ఫలితము వచ్చును? దయతో సవివరముగా తెలుపుము అని పార్ధించెను. అపుడు ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణుడు ఓయీ!  సత్యనారయణ వ్రతము. ఈ వ్రతమును ఆచరించిన సకల కోరికలు  సిద్ధించును. సకలైశ్వర్యములు కలుగునని తెలుపగా కట్టెలమ్మువాడు మిగుల సంతసించి దాహము తీసుకొని, ప్రసాదమును గ్రహించి భోజనం చేసిన పిమ్మట యింటికి వెడలిపోయెను. 


కట్టెలమ్మునాతడు సత్యనారాయణ వ్రతము చేయుటకు నిశ్చయించుకొని మరునాడు పుల్లల కావడి భుజము పై పెట్టుకొని ఈ దినము ఈ పుల్లలు అమ్మిన ధనము వెచ్చించి  సత్యనారయణ వ్రతము చేసెదను అని సంకల్పించుకొని పట్టనములోనికి బయలుదేరెను. అతడు ఆ దినము ధనవంతులుండు  వీధికి పోయి అమ్మగా పూర్వము కంటే రెట్టింపు ధనము వచ్చెను. అతడు మిగుల  సంతోషించి అరటిపండ్లు, చెక్కెర, నేయి, పాలు, గోధుమనూక మొదలగునవి తీసుకొని యింటికి చేరెను. తరువాత అతడు తన బంధుమిత్రాదులను ఆహ్వానించి  యధావిధిగా సత్యనారాయణ వ్రతము నాచరించెను. అవరత ప్రభావము వలన అతడు ధనమును, పుత్రపుత్రిక్లాను పొంది జీవిత కాలమంతయు సకల  సుఖములననుభవించి అంత్యము సత్యలోకమున పోందెను.


త్రుతీయోధ్యాయః

ఓ మునిశ్రేష్టులారా! ఇంకొక కథను చెప్పెదను వినుడు. పూర్వము ఉల్కాముఖుడను ఒక రాజు ఉండెడి వాడు. అతడు ఇంద్రియములను జయించినవాడు. సత్యవ్రతుడు, అతడు ప్రతిదినము దేవాలయమునకు పోవుచు, బ్రాహ్మణులకు ధనమిచ్చి, సంతోషపెట్టుచుండెను. ఆతడి  భార్య చాల సౌందర్యవతి మంచిగుణములు కలది. ఆ రాజు ఇట్లు వ్రతము చేయుచుండగా 'సాధువను' నో వైశ్యుడు అనంతమైన ధనముతో ఒక పడవను నింపుకొని వ్యాపారమునకై ఆ మార్గమున పోవుచు రాజు చేయుచున్న వ్రతమును చూచి, తన పడవను ఒడ్డునకు పంపించి రాజు వద్దకు పోయి ఇట్లు అడిగెను. ఓ రాజా! నీ విప్పుడు ఆచరించుచున్న వ్రతమును గూర్చి సవివరముగా నాకు తెలుపగోరుచున్నాను. దయతో నాకు చెప్పుమనగా రాజు ఇట్లు చెప్పెను. ఓయీ! పుత్రులు పొందుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము. ఈ వ్రతము చేయుటవలన సకల కార్యములు సిద్ధించునని వ్రత మాచరించు విధానమును చెప్పెను.   


వైశ్యుడు అంతయును విని, రాజా! నాకును సంతానము లేదు. కనుక నేను కూడా ఈ వ్రతమును ఆచరించి సంతానము బడయును అని పలికి, తన వ్యాపారము పూర్తీ చేసుకొని తన భార్యయైన లీలావతికి వ్రతమును గురించి చెప్పి, నాకు సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతము నా చరించుదునని ప్రతిజ్ఞ చేసెను. ధర్మ పరాయనమై భర్తతో సుఖించిన లీలావతి గర్భవతి అయి పది పదియవ మ్సమున ఒక కుమార్తెను కనెను. ఆ వైశ్య దంపతులు తమ కుమార్తెకు 'కళావతి' అని నామకరణము చేసి, అల్ల్లరుముద్దుగా పెంచుచుండిరి. ఆ కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అప్పుడు లీలావతి తన భర్తను చూచి, నాథా! మంకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసెదనని ప్రతిజ్ఞ చేసితిరి గదా! మనకు సంతానము కలిగినది కనుక వ్రతమును చేయుడని పలికెను. అందులకతడు అమ్మయి వివాహ కాలమున వ్రతమును చేసెదను అని వ్యాపారమునకు పట్టణమునకు పోయెను. కొంత కాలమునకు కళావతికి యుక్త వయస్సు వచ్చినది. ఒక దూతను పలిచి నీవు పోయి అమ్మాయికి తగిన వరుని వేడికి చూచి రమ్మని చెప్పెను. సాధువను ఆ వైశ్యుడు అట్లు చేపగా, ఆ దూత కంచన నగరమునకు పోయి యోగ్యడైన ఒక వైశ్య కుమారుని జూచి తీసుకొని వచ్చెను. సాధువు అన్ని విధముల తన కుమార్తెకు తగినవాడు అగుట జూచి, ఆ వైశ్య కుమారునకు తన కుమార్తె నిచ్చి వైభవముగా పెండ్లి చేసెను. 


ఆ అందములో ఆ వైశ్యుడు సత్యనారాయణ వ్రతము విషయము మరచెను. శ్రీ సత్యనారాయణ స్వామికి ఆ వైశ్యునిపై కోపము వచ్చెను. అప్పుడు వ్యాపారమున బహు నిపుణుడైన ఆ వైశ్యుడు అల్లునితో కూడి వ్యాపారము నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమునగల రత్నసాను పురమునకు పోయెను. ఆ రత్నసాను పురమును చంద్రకేతు అను మహారాజు పరిపాలించుచుండెను. సాధువు తన వ్రతము చేయకుండుట చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించిన వాడై అతనిని శపించెను. వీనికి దారుణమైన కటిన దుఃఖములు కలుగుగాక అని శపించెను. ఆ రాత్రి కొందరు దొంగలు రాజుగారి ధనాగారము కొంత ధనమును అపహరించి ఆ వర్తకులు ఉన్న చోటికి చేరుకొనిరి.

రాజభటులు ఆ దొంగలను పట్టుకొనుటకు నలుమూలల వెతుకుచూ తమ దగ్గరకు వచ్చుచుడుట చూచి ఆ దొంగలు ధనమును ఆ వర్తకుల చెంత వదలి పారిపోయిరి. రాజభటులు ధనము అక్కడ యుండుట చూచి ఆ వైశ్యులే దొంగలని నిశ్చయించి వారిని కట్టి రాజుకడకు గొనిపోయిరి. భటులు రాజును చూచి "ప్రభూ! ధనముతో గూడచోరులను బట్టి తీసుకొని వచ్చితిమి. విచారించి తగిన శిక్ష విధింపుడు"అని విన్నవించిరి. రాజు ఏమియు విచారింపక వీరిని తీసుకొని 

పోయి కారాగృహమున ఉంచుడు అని ఆజ్ఞాపించెను.భటులు వైశ్యులను తీసుకొని పోయి కారాగృహమున బంధించిరి.


వారందరూ అట్లు దుఖించుచుండగా తన కుమార్తెను చూచి అల్లుడా! చూచుచుండగానే నావతో గూడ మునిగిటివి గదా ఇది అంతయు సత్యనారాయణ స్వామి మహత్యము అని తలచుకొనుచు కుమార్తెను కౌగలించుకొని విలపింపసాగెను. కలావతి తన భర్త చనిపోవుట చూచి, అతని పాదుకులను గైకొని వాటితో సహగమనము చేయుటకు సిద్ధపడెను. వైశ్యుడు అది చూచి దుఖించుచూ ఇదంతయు సత్యనారాయణ స్వామి మహాత్యముగాని, వేరుకాదని నిశ్చయించుకొని అందరను  పిలచి తన అభిప్రాయము చెప్పి స్వామికి సష్టంగా నమస్కారము చేసి వేడుకొనెను.


అంత సత్యనారాయణస్వామి వైశ్యుని పై కరుణ వహించి ఓ వైష్యుడా! నీ కుమార్తె నా ప్రసాదము భుజిమ్పకుమ్డ భర్తను చూచుటకు వచ్చినది. ఆమె ఇంటికి పోయి ప్రసాదము తీసుకొని వచ్చినచో అంతయూ శుభమగునని చెప్పెను. ఆ విధముగా ఆకాశమునుండి వినబడిన మాటలు విని కాలావతి వెంటనే యింటికి పోయి స్వామీ ప్రసాదము స్వీకరించి వచ్చెను. ఆమె తిరిగి సముద్ర తీరమునకు వచ్చుసరికి తనభర్త నావతో గూడ పైకి తేలి యుండెను. అది చూచి అందరను  చాల ఆనందించిరి. అప్పుడు కలావ్త౯ఇ తండ్రిని చూచి తనదీ ఇంకను ఆలస్యమేల ఇంటికి పోవుదము రమ్మనెను. అపుడా వైషుడు బంధుమిత్రాదులతో కలసి అక్కడనే సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించి, పిమ్మట సుఖమగా ఇల్లు చెరుకొనెను. తరువాత్ ఆ వైషుడు బ్రతికి యున్నంత కాలము పౌర్ణమి తిథి యందును, రవిసంక్రమణ దినమందును సి సత్యనారాయణ స్వామి వ్రతము చేయుచు బ్రతికి యున్నంత కాలము సకల సుఖములు అనుభవించి అంత్యమున సత్యలోకమును పొందెను.



చతుర్థోధ్యాయః 

సూతమహాముని మరలా యిట్లు చెప్పదొడగెను. ఓ మునీమ్ద్రులారా! మరియొక కథ చెప్పెద వినుడు. పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్న బిడ్డలవలే చూచుకోనుచు రాజ్యపాలనము చేయుచుండెను. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి ఇంటికి వచ్చుచు మార్గములో ఒక మారేడు చెట్టు క్రింద గొల్లలు బంధువులతో కూడుకొనిన వాడై వ్రతము చేయచుండుట చూచియు మనోగార్వముతో  స్వామికి నమస్కారము చేయక ప్రసాదము స్వీకరించక వెడలిపోయెను. తరువాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందర యుంచి మరల పూజాస్థలమునకు పోయి అందరను భక్తితో ప్రసాదము భుజించిరి. రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరమునకు వెడలిపోయెను. అందులకు సత్యనారాయణస్వామికి రాజుపై ఆగ్రహము కలిగి, దానివలన రాజుయొక్క నూర్గురు కుమారులు చనిపోయిరి. సకల సంపదలు హరించెను. క్రమముగా దరిద్రము సంభవించెను. తరువాత అనేక కష్టములు సంప్రాప్తించెను.     


రాజు తనలో తానిట్లనుకొనెను. ఆహా! గొల్లలు యిచ్చినారని నీచముగా భావించి స్వామి ప్రసాదమును బక్షింపక తిరస్కరించితిని. అందుచే సత్యదేవునకు నాపై ఆగ్రహము కలిగి నాకిట్టి స్థితి కలిగినది ఆలోచించుకొని వెంటనే పోయి ఆ గొల్లల చెంతకు పోయి భక్తీ శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించెను. పిదప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తిని పొంది పుత్రవంతుడై బ్రతికి యున్నంత  కాలము సుఖముగా ఉండి అంత్యమున  సత్యలోకమునకు పోయెను.


మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తిశ్రద్ధలతో ఎవరు ఆచరింతురో ఎవరు ఈ కథ భక్తీ తో విమ్డురో వారు సకల సంపదలు పొందినవారై సుఖముగా నండూరు. దరిద్రుడు  ధనవంతుడగును. బంధనము పొందినవాడు విముక్తిని పొందును. భయగ్రస్తునకు భయము తొలగును. సకల అభీష్టములు పొందినవారై అంత్యమున సత్యలోకమునకు పోవుదురు. కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యకమును, వ్రత విధానమును, ఆ వ్రతము యొక్క మహత్యమును అందువలన లభించు ఫలితమును వివరించెను.


కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. కొందరు సత్యనారాయణు డనియు, కొందరు సత్యదేవుడనియు పిలిచుకొనుచున్నారు. సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతార రూపములు ధరించి భక్తులను కాపాడును. వారి కోర్కెలు తీర్చుచుండును. వ్రతము చేయుటకు శక్తి లేకున్నను ఎవరైనా ఈ వ్రతమును చేయుచుండగా చూచిననూ, భక్తీ శ్రద్ధలతో కథ విన్ననూ, సత్యదేవుని అనుగ్రహమువలన సకల కష్టములు తొలగిపోవును. సకల సంపదలు కలుగును.


                                  ఇతి శ్రీ స్కాందే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం సమాప్తః


పునఃపూజ - పునః ప్రానానాయామ్య - శ్రీ సత్యనారాయణ ముద్దిశ్య శ్రీ సత్యనారాయణ స్వామి ప్రీత్యర్ధం శ్రీ  సత్యనారాయణ స్వామినే నమః పునః పూజాం కరిష్యే, శ్రీ సత్యనారయణ స్వామినే నమః ధ్యాయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, పాదయః పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, స్నాపయామి, శుద్ధచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, దివ్య శ్రీ చందనం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, నానావిధ పుష్పాణి పూజయామి, ఓం కేశవాయ నమః .... దూపమా ఘ్రాపయామి, దీపం దర్శయామి ధూప దీపానంతరం ఆచమనీయం సమర్పయామి.


నైవేద్యం - ఓం భూర్భువస్సువః .......... ప్రచోదయాత్. సత్యంత్వర్తేన పరిషించామి శ్రీ సత్యనారాయణస్వామినే  నమః అమృతమస్తు అమృతో పస్తరిణమసి.


 

Top

BOTTOM