Type Anything.., You Get World Wide Search Results Here. !

దీపావళి పండుగ - Diwali festival

 దివ్వెల పండుగ దీపావళి

శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినందుకు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని.. ఆ రోజు నుంచే దీపావళి జరుపుకుంటున్నారనేది ఓ పురాణ గాథ.

దీపావళి పండుగను ఐదు రోజులు జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి. ఈ రోజు స్నానం చాలా పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండుగలు రెండు ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి. భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి పూజకు విశేష ప్రాధాన్యత ఉంది.

ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ఈ రోజున ధనలక్ష్మి పూజచేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. తర్వాత లక్ష్మీపూజ చేయాలి. రాత్రి వరకు అమ్మవారిని పూజించవచ్చు. 

ఉదయం అభ్యంగన స్నానం చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇక, దీపావళి మర్నాడు జరిగే గోవర్దన పూజను జరుపుకోవాలని తెలియజేస్తున్నారు. ఇంద్రుడి గర్వాన్ని కృష్ణుడు అణచివేసినందుకు గుర్తుగా గోవర్దన పూజను యాదవులు జరుపుతారు. 

Top

BOTTOM