మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు
కాశీ లో మరణిస్తే “మోక్షం” ప్రాప్తిస్తుంది అని హిందువుల లో ఒక విశ్వాసం . అందుకోసం జీవిత అంత్యకాలం కాశీ లో గడపడానికి వెడుతూ ఉంటారు . అటువంటి వారికీ వసతిని కల్పించే ముఖ్య మైన మూడింటిలో కాశీ లాభ్ ముక్తి భవన్ ఒకటి . మిగతా రెండూ ముముక్షు భవన్ , గంగా లాభ్ భవన్ . 1908 లో కాశీ లాభ్ ముక్తి భవన్ స్థాపించబడింది .
.
44 సంవత్సరాల పాటు కాశీ లాభ్ ముక్తి భవన్ మేనేజరు గా పనిచేసిన భైరవ నాద్ శుక్లా ఆ భవనం ఎదుట ఎర్రని గోడల ముందు చెక్క కుర్చీలో కూర్చుని చెప్పిన విషయాలు ఇపుడు నేను మీ ముందు ఉంచ బోతున్నాను .
.
.
1. Resolve all conflicts before you go
.
అంత్య కాలానికి ముందే క్రోధాన్ని విడనాడు :
శ్రీ రాం సాగర్ అనే ఒక సంస్కృత పండితుడు ఆరుగురు అన్నదమ్ములలో పెద్దవాడు . చిన్న తమ్ముడు అంటే ఇష్టం . కానీ కాలక్రమం లో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకూ వెళ్ళింది .
.
ఆయన తన అంత్యకాలం లో కాశీ లాభ్ ముక్తి భవన్ లో మూడవ నెంబరు రూమ్ బుక్ చేసుకున్నారు . తాను ఇంకొక పదహారు రోజులలో చనిపోతాను అని ఆయనకు ముందే తెలుసు . 13 రోజులు గడిచిపోయాయి . 14 వ రోజున ఆయన తన విడిపోయిన తమ్ముడికి కబురు పెట్టాడు . “40 ఏళ్ల క్రితం నా తమ్ముడితో గొడవపడిన విషయం నన్ను కలిచివేస్తోంది . నేను సుఖంగా మరణించలేను . నాలో ఉన్న క్రోధం పోవాలి” అన్నాడు .
.
తమ్ముడు 16 వ రోజు నాటికి వచ్చాడు . తమ్ముడిని చూడగానే అన్న కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి . తమ్ముడి చెయ్యి తన చేతిలోకి తీసుకుని తమ్ముడి తల నిమురుతూ “ఆ గోడ పడగొట్టేయ్యి” అన్నాడు . అన్నదమ్ములిద్దరూ భోరున విలపించారు . తమ్ముడి చేతిలో ప్రశాంతంగా ప్రాణాలు వదిలాడు అన్న .
.
భైరవ నాద్ శుక్లా ఇలా అంటున్నారు .
“ఇటువంటి కధలు నేను ఎన్నో చూశాను . ఇక్కడకి వచ్చే వాళ్ళు బోల్డంత లగేజీతో వస్తారు . అందులో ఏదీ తీసుకువెళ్ళలేరు . జీవితం లో ఘర్షణలు లేకుండా ఎవరూ ఉండరు . కానీ వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిది . అంత సంతోషం పొందుతారు”
.
2. Simplicity is the truth of life
.
సాధారణం గా జీవించడం
.
చనిపోతాము అని తెలిసిన దగ్గరనుండి చెత్త తిండి తినడం మానేస్తారు చాలామంది . అప్పటికి కానీ చాలామందికి తాము సింపుల్ జీవితం గడిపి ఉండవలసింది అని అనిపించదు . “సింపుల్ జీవితం అంటే తక్కువ ఖర్చుపెట్టడం . ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం ఎక్కువ సంపాదించాలి అనుకోవడం . ఎక్కువ తాపత్రయపడటం కన్నా తక్కువ లో సంతృప్తి పొందడం నేర్చుకుంటే ఆనందం గా జీవించవచ్చు” అంటారు భైరవ నాద్ శుక్లా
.
.
3. Filter out people’s bad traits
.
ప్రజలలో ఉన్న చెడు లక్షణాలను మాత్రమె చూడకు
.
భైరవ నాద్ శుక్లా ఇలా అంటారు “ ప్రతీ మనిషిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి . మనం ఎదుటివ్యక్తిలోని చెడును మాత్రమే చూసి మంచిని పట్టించుకోము . ఒక వేల మనం ఎదుటి వారి లోని చెడును గురించి కంటే వారి లోని మంచిని గుర్తిస్తే మనం వారితో స్నేహం మాత్రమె కాదు, వారిని అర్ధం చేసుకోవడమే కాదు .... వారిని ప్రేమించడం కూడా నేర్చుకోగలం”
.
4 . Be willing to seek help from others
.
ఇతరుల సహాయం పొందడం కూడా నేర్చుకో
.
మనం శక్తివంతులుగా తయారు కావడం మంచిదే కావచ్చు . కానీ మనమే అన్నీ చేసుకోగలం అనే గర్వమూ , అహంభావమూ మంచివి కావు . ఎంత శక్తిమంతుడైనా అన్నీ తానే చేసుకోలేడు. ఆ విషయం లో తాను ఇతరులకు సహాయ పాడడం తో పాటు ఇతరుల సహాయం అర్దించే ధైర్యం కూడా ఉండాలి .
.
ఈ ప్రపంచం లో ప్రతీ వ్యక్తీ ఏదో ఒక విషయం లో మనకంటే ఎక్కువ విషయ పరిజ్ఞానం కలిగిన వాడి ఉంటాడు . మనం అర్ధిస్తే అది మనకూ లభిస్తుంది .
.
భైరవ నాద్ శుక్లా 80 లలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటున్నారు . ఒక రోజు వర్షం కురుస్తూ ఉంటె కొందరు యువకులు ఒక ముసలామెను తీసుకుని వచ్చారు . వాళ్ళు వచ్చి ఆమెను జాయిన్ చెయ్యడానికి కావలసిన దరఖాస్తు నింపకుండా వెళ్ళిపోయారు . కొన్ని గంటలు గడిచాయి . పోలీస్ లు వచ్చారు . వాళ్ళ గురించి అడిగారు . నేను తెలియదు అన్నాను . ఆమెను తీసుకుని వచ్చిన వారు నక్సలైట్లు అని చెప్పారు పోలీస్ లు . మర్నాడు వాళ్ళు వచ్చినపుడు నేను అడిగాను “మీరు ఒకే సారి 5 నుండి 8 మందిని షూట్ చేసి చంపగలిగినపుడు ఆ ముసలామెను కూడా అలా చెయ్యొచ్చు కదా !మేరె ఆమెను సమాధి చెయ్యొచ్చు కదా ! నేను అబద్ధం చెప్పే పరిస్థితి ఎందుకు కలిగించారు ?”
.
అందులో ఉన్న ఆమె మనుమడు మోకాళ్ళ పై కూలబడి అన్నాడు . “మాలో ఎవరమూ ఆమె మోక్షం పొందే విధంగా ఆమెకు సహాయపడలేము . ఇక్కడ ఉంటె ఆమె తప్పక మోక్షం పొందుతుంది అందుకే ఇక్కడకు తీసుకువచ్చాము . మమ్మల్ని క్షమించండి”
.
.
5 Find beauty in simple things
.
చిన్న చిన్న విషయాలలో అందం ఉంది
.
.
మా ముక్తి భవన్ లో ప్రతీ రోజూ మూడు సమయాల్లోనూ భజనలు జరుగుతూ ఉంటాయి కొందరు ఆ భజనలలో ఎంతో ఆనందం తో కీర్తనలు పాడతారు . దారిన పోయే వారు కూడా ఆ ఆనందం పంచుకోవడం కోసం కొంత సేపు అక్కడ చేరుతారు . కానీ కొందరు అది తమ ఏకాంతకు ఆటంకం కలిగిస్తోంది అనో , తమకు ఉన్న పానాలకు ఆటకం కలిగిస్తోంది అనో అనుకొంటారు .
.
.
6 Acceptance is liberation
.
సమస్యలనుండి పారిపోకు
.
కొందరు తాము ఉన్న స్థితి ని అంగీకరించలేరు . ఇలా అంగీకరించలేక పోవడం వారిలో నిరాశ నిస్పృహలను కలిగించి వత్తిడి పెంచుతుంది . నీవు ఉన్న స్థితిని నీవు అంగీకరిస్తే నీ సమస్యలనుండి నీవు బయట పడడం నేర్చుకోగలవు . లేదంటే నీవు చీకటిలోనే ఉంటావు .
.
సమస్యను నీవు గుర్తిస్తే పరిష్కారం కోసం అన్వేషించగలవు .
.
సమస్య పట్ల నిర్లక్ష్యం , పట్టించుకోకపోవడం , దూరంగా పోవాలి అనుకోవడం నీలో ఆడుర్డాను పెంచుతాయి . సమస్యను అంగీకరిస్తే నీవు దానినుండి బయటపడే ప్రయత్నం చెయ్యగలవు . దానిని ఎదుర్కోగలవు . అపుడు నీవు శక్తి మంతుడవు అవుతావు
.
7.Accepting everyone as the same makes service easier
.
అందరి పట్ల సమభావం తో ఉండు
.
.
ముక్తి భవన్ లో చేరిన ప్రతీ ఒక్కరినీ ఒకే విధం గా కాకుండా వారి కులమూ , మతమూ , డబ్బూ , సాంఘిక , ఆర్ధిక స్థితి గతులను బట్టి నేను చూడడం మొదలు పెడితే వారికీ నాకూ కూడా శాంతి ఉండేది కాదు .
.
ఎదుటి వ్యక్తులను సమభావం తో నీవు చూసిన నాడు నీకు ప్రశాంతత ఉంటుంది . నీ పని నీవు చక్కగా చెయ్యగలుగుతావు .
.
,
. 8. If/When you find your purpose, do something about it
.
నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తించు . సాధించే ప్రయత్నం చెయ్యి .
.
నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది గుర్తించడం చాలా గొప్ప విషయం కానీ దానిని నువ్వు సాధించే ప్రయంతం చెయ్యని నాడు అది నిష్పలం .
.
చాలా మంది ఏమి చెయ్యాలో తెల్సు కానీ ఏమీ ప్రయత్నం చెయ్యకుండానే జరిగిపోవాలి అనుకుంటారు . ఏమీ చెయ్యకుండా కూర్చోవడం కన్నా అసలు లక్ష్యమే లేకపోవడం ఉత్తమం . లక్ష్యం అంటూ ఉంటె నీకున్న సమయమూ , నువ్వు చెయ్యవలసినదీ ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటావు . నీ ఆలోచన దాని మీదనే ఉంటె నీవు తప్పించుకోలేవు .
9. Habits become values
నీ మంచి అలవాట్లు విలువలు గా మారతాయి
.
మంచి అలవాట్లను చేసుకో ! అది నీకు మంచి విలువలను నేర్పుతుంది .
మంచి అలవాట్లను అభ్యాసం చేతనే నేర్చుకోవాలి . అదేమీ సులువైన విషయం కాదు . ప్రతీసారీ నువ్వు ప్రయత్నపూర్వకంగానే సాధించాలి . సత్యమూ , దయా , సానుభూతీ ,నిజాయతీ ఇవేవీ నీ
ప్రయత్నం లేకుండా వాటంత అవి రావు .
.
10. Choose what you want to learn
నీవేమి నేర్చుకోవాలో నీవే నిర్ణయించుకో !
ఈ ప్రపంచం లో ఎంతో విజ్ఞానం ఉంది . అందులో నీవు ఏది కావాలి అనుకుంటున్నావో దాన్ని ఎంచుకో . ప్రతీ ఒక్కరూ వారి అభిరుచులను, సిద్ధాంతాలనూ , అనేక విషయాలనూ నీ మీద రుద్దుతారు . అయితే నీకు ఏది ఇష్టమో అది ఎంచుకో ! వారి సూచనలు పరిగణన లోకి తీసుకో . నీ మనసు హృదయం చెప్పినట్టు నువ్వు ఎంచుకో !
.
ఇక్కడకి వచ్చిన వారు ఆఖరు దశలో ఉంటారు . నడవలేరు .... మాట్లాడలేరు ..... అపుడు వారిలోకి వారు వెళ్ళడం మొదలు పెడతారు . వారి అనుభవాలలోనే వారు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు . నేర్చుకున్నదానిని నెమరు వేసుకుంటూ ఉంటారు .
.
11. You don’t break ties with people; you break ties with the thought they produce
నీవు ప్రజలతో సంబంధాలు తెంచుకోకపోతే ; వారు రగిలించిన ఆలోచనలతో సంబంధం తెంచుకో
.
నీవు ప్రేమించిన వ్యక్తులు , నీకు ఆప్తులు అయిన వ్యక్తులు నీతో అన్నివిషయాలలోనూ ఏకీభవించక పోవచ్చు . వారి భావాలు నీ భావాలకు వ్యతిరేకం కావడం వలన వారి భావాలతో విభేదించ లేక వారికీ దూరం జరుగుతున్నావు తప్ప వారికి నీవు దూరం కావు . మీ మధ్య భేదాభిప్రాయం ఆలోచనలలోనే తప్ప వ్యక్తులతో కాదు . నీవు నేర్చుకోవలసినది వారిపై ప్రతీకారభావం కాదు . వారి పట్ల కఠిన హృదయం కాదు .
.
12. 10 percent of what you earn should be kept aside for dharma
నీ సంపాదనలో పది శాతం దానం కోసం కేటాయించుకో !
.
ధర్మం అంటే మత సంబధం కాదు . మంచిని చెయ్యడం . ఒక పది శాతం సంపాదన ఇందుకు కేటాయించుకో !
.
చాలామంది జీవిత అంత్య కాలంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు . వృద్ధాప్యం వలన వారికి కలుగుతున్న అసౌకర్యాలు ఇతరులకూ కలుగుతున్నాయని తెలుసుకుని అవి తొలగాలని కొంత సహాయ పడుతూ ఉంటారు . ఎవరైతే ఆప్యాయతను పొందుతూ ఉంటారో , అపరిచితుల ప్రేమను పొందుతారో , వారు ప్రశాంతంగా ప్రాణం విడువగలుగుతారు . నీవు సంపాదించినదంతా నీవే అనుభవించాలి అనుకోకు . కొంత ఇతరులకు మిగుల్చు .
.
------------