Type Anything.., You Get World Wide Search Results Here. !

గుడిలో శఠగోపనం {షడగోప్యం} వల్ల ఫలితాలు .

 గుడిలో శఠగోపనం {షడగోప్యం} వల్ల ఫలితాలు .

దేవాలయంలో  దర్శనం అయ్యాక  తీర్ధం , షడగోప్యం  తప్పక  తీసుకోవాలి . చాలా మంది దేవుడిని దర్శనం చేసుకున్నాక వచ్చినపైనైపోయింది అని కూర్చుంటారు . కొద్దిమంది మాత్రమే ఆగి , షడగోప్యం పెట్టించుకుంటారు.

షడగోప్యం అంటే అత్యంత రహస్యం . అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి .

అంటే మీ కొరికే షడగోప్యము . మానవునికి  శత్రువులైన  కామమూ , క్రోధము , లోభము , మొహమూ , మదము , మాత్సర్యములు  వంటివి ఇకనుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి  తీసుకోవటము మరో అర్ధం .

షడగోప్యంలో రాగి, కంచు, వెండి లోహాలతో తయారుచేస్తారు పైన విషుణువు పాదాలు ఉంటాయి. తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ , దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి , మనలోని అధిక విదుత్  బయటకెళుతుంది . తద్వారా శరీరంలో ఆందోళనా , ఆవేశము తగ్గుతాయి . షడగోప్యము ను శఠగోపనం అని కూడా అంటారు .




Top

BOTTOM