Type Anything.., You Get World Wide Search Results Here. !

అష్టదిక్పాలకులు - Asta Dikpalakulu

 అష్టదిక్పాలకులు.

ఒక చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని నలుదిక్కులా నలుగురు ద్వారపాలకులను నియమించినట్టే, విశ్వానికి రారాజైన పరమాత్ముడు విశ్వానికి రక్షణగా నాలుగు దిక్కులు, నాలుగు మూలలకు కలిపి మొత్తం ఎనిమిది మంది రక్షకులను నియమించారు. వారే అష్టదిక్పాలకులు. 


తూర్పు: దీనిని పూర్వదిశ అనికూడా అంటారు. ఈ దిక్కుకు పాలకుడు ఇంద్రుడు. ఆయన ఆయుధం వజ్రాయుధం. వాహనం ఐరావతం. భార్య శచీదేవి. ముఖ్య పట్టణం అమరావతి. 


పడమర: దీనికే పశ్చిమదిశ అని పేరు. వరుణుడు దీనికి పాలకుడు. భార్య కాళికా (కాళికా అమ్మవారు కాదు). ఆయుధం: పాశం. ముఖ్య పట్టణం : శ్రద్దావతి. వాహనం: మొసలి. 


ఉత్తరం: దీనికి పాలకుడు ధనాధిపతి కుబేరుడు. ఆయుధం: ఖడ్గం. ముఖ్య పట్టణం : అలకాపురి.  వాహనం: నరవాహనం. భార్య : చిత్రరేఖ 


దక్షిణ దిక్కు: అధిపతి యముడు. వాహనం: దున్నపోతు. నగరం: సంయమని. భార్య: శ్యామలా దేవి. ఆయుధం: దండం. 


ఈశాన్య దిక్కు: తూర్పు, ఉత్తర దిక్కుల మధ్య ఉండే కోణాన్ని ఈశాన్య మూల అంటారు. దీనికి అధిపతి ఈశానుడు. ఈయన సాక్షాత్తు ఈశ్వరుడే. ఆయుధం: త్రిశూలం. వాహనం: వృషభం. భార్య: పార్వతి. నగరం: యశోవతి. 


ఆగ్నేయం: తూర్పు - దక్షిణ దిక్కుల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆగ్నేయమంటారు. దీనికి అధిపతి అగ్నిదేవుడు. భార్య: స్వాహాదేవి. ఆయుధం: శక్తి. వాహనం: మేక, నగరం : తేజోవతి. 


నైరుతి: పశ్చిమం, దక్షిణ దిక్కులు కలిసే చోటు. దీనికి అధిపతి నిరుతి. వాహనం: అశ్వం, భార్య: దీర్ఘాదేవి, ఆయుధం: నల్లటి కత్తి, పట్టణం: కృష్ణాంగనం. 


వాయవ్యం: పశ్చిమ, ఉత్తర దిశలు కలిసే ప్రదేశానికి వాయవ్య మాల అని పేరు. దీనికి అధిపతి వాయుదేవుడు. ఆయుధం: ధ్వజం, పట్టణం: గంధవతి, భార్య: కళ్యాణి, వాహనం: లేడి. 


వర్షాలు కురిపించే దేవుడైన ఇంద్రుడు, మన శరీరంలో ఆకలి రూపంలో దాగి ఉండే అగ్నిదేవుడు, సంపదలను ప్రసాదించే కుబేరుడు, మనకు ప్రాణాధారమైన వాయుదేవుడు, ధర్మాన్ని రక్షించే యముడు, జలాలను సంరక్షించే వరుణుడు, నిర్మాణంలోని విశిష్టతను తెలియజేసే ఈశానుడు, ధైర్యాన్ని, మనోబలాన్ని ప్రసాదించే నిరుతి ఈ ఎనిమిది దిక్కులకు అధిపతులుగా వ్యవహరిస్తున్నారు.




Top

BOTTOM