Type Anything.., You Get World Wide Search Results Here. !

ఏకాదశి వ్రతం - Ekadashi Vratham

 ఏకాదశి వ్రతం

ఏకాదశి వ్రతం చేయడానికి పూనుకునే వారు దశమి రోజునుంచే కొన్ని తప్పని సరి నియమాలు పాటించాల్సి ఉంటుంది. దశమి రోజున మాంసం, ఉల్లిపాయలు, మసూరి పప్పు మొదలై నిషేధిత పదార్థాలు ఆహారంగా తీసుకోకూడదు. రాత్రిపూట పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి.

ఏకాదశి రోజు ఉదయం: దంతావధానం చేయకుండా నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకుని నమలండి. నోట్లో వేలు పెట్టి గొంతు శుభ్రపరచుకోండి. చెట్లనుంచి ఆకులను తుంచకూడదు. చెట్టునుంచి రాలిన ఆకునే వాడాలి. ఒకవేళ ఇలా జరగకపోతే నీటితో 12 సార్లు పుక్కలించండి. ఆ తర్వాత స్నానం చేసి ఆలయానికి వెళ్ళి భగవద్గీత పఠనం చేయాలి లేదా పురోహితుడు చదువుతుంటే మీరు వినాలి. "ఈ రోజు నేను దొంగతనం, దురాచారం చేసే మనుషులతో మాట్లాడను అలాగే ఎవరి మనసు నొప్పించను" అని దేవుని ముందు ప్రమాణం చేయాలి.


" ఓం నమో భగవతే వాసుదేవాయ " ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు శహస్రనామాలను జపించండి. విష్ణు భగవానుడిని స్మరించి ప్రార్థించండిలా... హే త్రిలోక నాథా! నా గౌరవం నీ చేతిలో ఉంది. కాబట్టి నేను చేసిన ఈ ప్రతిజ్ఞను పూర్తి చేయడానికి శక్తిని ఇవ్వమని భగవంతుడిని వేడుకోండి.


ఒకవేళ ఏమరుపాటుతో తప్పుడు కార్యక్రమాలతో సంబంధమున్నవారితో మాట్లాడితే సూర్యనారాయణ దేవుడిని దర్శించుకుని ధూప, దీప నైవేద్యాలతో శ్రీహరిని పూజించి క్షమించమని వేడుకోండి. ఏకాదశి రోజున ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. ఎందుకంటే చీమలు మొదలైన సూక్ష్మ జీవులు చనిపోతాయనే భయం ఉంటుంది. అంటే చిన్న ప్రాణికికూడా హాని కలుగచేయకూడదు. ముఖ్యంగా ఈ రోజు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలాగే ఎక్కువగా మాట్లాడకూడదు. అసలు మాట్లాడటం మొదలుపెడితే మాట్లాడకూడని మాటలుకూడా మాట్లాడాల్సివస్తుంది.


ముఖ్యంగా ఈ వ్రతం పాటించే రోజు వీలైనంత ఎక్కువగా దాన, ధర్మాలు చేయాలి. ఇతరులు తయారు చేసిన ఆహార పదార్థాలను ఎట్టిపరిస్థితులలోనూ ఆహారంగా తీసుకోకూడదు. దశమితో కలిసి వచ్చే ఏకాదశిని వృద్ధ ఏకాదశిగా పేర్కొంటారు. ముఖ్యంగా వైష్ణవులు యోగ్య ద్వాదశి కనుక వస్తే ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. త్రయోదశి వచ్చే ముందే వ్రతాన్ని పూర్తి చేసి వ్రత పారాయణ చేయాలి.


ఫలాహారంలో క్యారెట్టు, గోభీ, పాలాకులాంటి ఇతర ఆకుకూరలు వాడకూడదు. అరటిపండు, మామిడి పండు, ద్రాక్ష, బాదం, పిస్తా మొదలైన పండ్లను ఆహారంగా తీసుకోవాలి. మీరు ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం భగవంతునికి సమర్పించి ఆ తర్వాతే ఆహారంగా తీసుకోవాలి. ఆహారం తీసుకునే ముందు తులసీ దళం సమర్పించాలి. ద్వాదశిరోజున బ్రాహ్మణులకు తీపి పదార్థాలు, దక్షిణ ఇవ్వాలి. కోపగించుకోకుండా మంచి మాటలు మాట్లాడాలి. ఈ వ్రతం చేసేవారు అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు.


వ్రత కథ...

ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంబించెను. ఓ నారద మహాముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము.


యుధిష్టిర మహారాజు శ్రీ కృష్ణ భగవానునితో ఇలా అన్నాడు. ఓ వాసుదేవ ,ఈ మాఘ మాసం కృష్ణ పక్షం లో వచ్చేటువంటి ఏకాదశి మహత్యాన్ని వివరించమని కోరాడు.

శ్రీ కృష్ణ పరమాత్మ :- ఓ యుధిష్టిర ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఏకాదశి పేరు "విజయ ఏకాదశి" ఈ ఏకాదశిని ఎవరు భక్తీ శ్రద్దలతో ఆచరిస్తారో వారిని విజయం వరిస్తుంది, మరియు వారి పాపాలు కూడా తొలిగిపోతాయి.


ఒకానోకసారి నారద ముని బ్రహ్మ దేవుడి దగరికి వెళ్లి తనకి ఈ విజయ ఏకాదశి యొక్క విశిష్టతను తెలుపమని కోరెను అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పనారంబించెను. ఓ నారద మహాముని ఇంతకు ముందు ఎవరికీ దీని వ్రత మహత్యం గురించి చెప్ప లేదు నువ్వు అడిగినవు కావున నీకు తెలియ చేసెదను వినుము. ఈ ఏకాదశి వ్రతం అన్ని పాపాలను హరిస్తుంది. ఈ పేరులో చెప్పిన విదంగానే ఈ ఏకాదశి వ్రతం అన్ని విజయాలను చేకూరుస్తుంది అందుకు సందేహమే లేదు.


శ్రీ రామ చంద్రుడు పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేయునప్పుడు సీత , లక్ష్మణునితో కలిసి పంచవటిలో నివసించేవాడు. రావణడు సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు దిగులుతో అన్ని కొలుపొయినవాడిలా గుండెను సీతాదేవి ని వెతికే క్రమంలో జటాయువు మరనిన్చబోతుండగా చూసి ఏమయినది అని వివరం అడుగగా జటాయువు సీతమ్మని రావణాసురుడు ఎలా అపహరించాడో సీతామాతని కాపాడబోయి రావణుడి చేతిలో రెక్కలు తెగి పడిన విషయం వివరింఛి మరణిస్తాడు. శ్రీ రాముడు తన సీతా కోసం జటాయువు చేసిన ప్రాణ త్యాగానికి జటాయువికి వైకుంట లోక ప్రాప్తి ప్రసాదిస్తాడు. సీతా దేవిని వెతికే క్రమంలో కబందుడిని సంహరిస్తాడు.


ఆ తరువాత శ్రీరాముడు సుగ్రీవుడు స్నేహితులవుతారు . సుగ్రీవుడు వానర సేనకు రాజు అగుట చేత సీతమ్మవారిని వెతకడానికి పెద్ద వానర సేనని తయారు చేసి హనుమంతుని సీతమ్మను వెతకడానికి లంకకు వెళ్లి వెతకమని ఆజ్గ్న వేస్తాడు. హనుమ లంక లో సీతమ్మను అశోకవనంలో చూసి శ్రీరాముని ముద్రికని చూపి అయన గుణగణాలను కొనియాడి హితవు పలికి సీతాదేవి దగ్గర ఉంగరం తీసుకుని తిరిగి శ్రీ రాముని వద్దకు వచ్చి వివరించెను. శ్రీ రాముడు సుగ్రీవుని సహాయంతో లంకా నగరానికి వెళ్ళాలంటే ఆ సముద్రాని దాటడం అంత సులువు కాదని గ్రహించి లక్ష్మణునితో ఇలా అన్నాడు, ఓ సుమిత్ర కుమారా ఈ సముద్రముని దాటడం అంత సులువు కాదే ఇప్పుడు మనం ఏమి చేయవలను..? అనగా ఒక గొప్ప ఋషి ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు అ ఉత్తముడిని అడిగి మన కర్తవ్యమ్ ఏమిటో కనుకుందాం. అయన మాత్రమే మనకి ఈ సమయంలో సహాయపడగలరు, ఆ తరవాత ఆ ఋషి దగ్గరకి బయల్దేరారు. ఋషిని చేరుతూనే నమస్కరించి కుశలములు అడిగి వారు వచ్చిన పనిని వివరించారు .


ఋషి రామునితో ఇలా అంటాడు, శ్రీ రామ నేను నీకు ఒక ఉపవాస దీక్షను వివరిస్తాను శ్రద్ధగా వినుము, దీని ఆచరించడం ద్వార నీకు తప్పకుండ విజయం లభీస్తుంది. ఏకాదశి ముందు రోజు ఒక వెండి, ఇత్తడి , లేదా, బంగారం ఏది లేకపోతె మట్టి కుండ ఒకటి తీసుకుని అందులో నీలు పోసి నవధాన్యాలు, పసుపు కుంకుమ వేసి కుండకి తోరణాలు కట్టి అందంగా అలకరించా లి. దీనిని  శ్రీమన్నారాయణుడి దగ్గర పెట్టాలి. మరునాడు ఏకాదశి ఉదయమే స్నానం చేసి భక్తీ శ్రద్ధలతో శ్రీమన్నారాయణుకి పూజ చేసి ఈ కుండకి పసుపు కుంకుమ , గంధం , అక్షింతలు వేసి నమస్కరించి ఉపవసించి రాత్రి కి జాగరణ చేయాలి. మరునాడు ద్వాదశి తిథి రాగానే మల్లి ఆ కుండకి పూజ చేసి ఏదైనా ఒక నదిలో కలిపేయాలి. తరువాత ఎవరికైనా భోజనం పెట్టి నువ్వు భోజనం చేయాలి. ఈ విధం నువ్వు ఉపవాసం చేస్తే తప్పకుండ విజయం లభిస్తుంది అని చెప్పను.


శ్రీ రామచంద్రుడు ఋషి చెప్పినట్టుగానే వ్రతం పాటించి లంక మీద విజయం సాదించాడు. ఈ వ్రతం ఎవరు అయితే ఆచరిస్తారో వారికి వైకుంట ప్రాప్తి కూడా కలుగుతుంది. ఓ నారద ఈ విధంగా ఎవరు ఈ ఏకాదశి వ్రతం నమ్మకంతో భక్తీ శ్రద్ధలతో ఆచరిస్తారో వారి అతి ఘోరమైన పాపాలు అయిననూ హరించిపొయి విజయం లబిస్తుంది మరియు వైకుంఠ లోక ప్రాప్తి లబిస్తుంది. అని శ్రీ కృష్ణ పరమాత్మ వివరించి యుధిష్టిర ఎవరు ఈ ఉపవాస దీక్ష చేస్తారో ఈ కధ ను వింటారో వారికీ అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడ లభిస్తుంది అని తెలుపెను.


Top

BOTTOM