Type Anything.., You Get World Wide Search Results Here. !

రామాయణానికి సంబంధించి పలు ఇతర గ్రంథాలు సంస్కృతంలో రచింపబడినవి.అందులో ముఖ్యంగా - Many other texts related to the Ramayana were written in Sanskrit

 రామాయణానికి సంబంధించి పలు ఇతర గ్రంథాలు సంస్కృతంలో రచింపబడినవి.అందులో ముఖ్యంగా:

మైరావణ చరిత్ర

మైరావణ చరిత్ర, లేక అహిమహిరావణ చరిత్ర అనే పేరుతో చాల లిఖిత పుస్తకాలున్నాయి. ఇటీవలి వరకు దీనిని హరికధగా చెప్పేవారు. దీనిని జైమిని భారతంలో భాగంగా పేర్కొన్నారు. కాని కొందరు పండితులు దీనితో ఏకీభవించరు.


కుశలో పాఖ్యానం

కుశలో పాఖ్యానము అనే రామకధకు సమబందించిన భాగం మరొకటున్నది. ఇది జైమిని భారతంలో భాగం. జైమినీయ అశ్వమేధంలో ఈ కుశలో పాఖ్యానము 25-36 అధ్యాయాలుగా ముద్రితమైనది. జైమినీయ అశ్వమేధంలోని ప్రధాన ఇతివృత్తం యుధిష్థరుడు పట్టాభిషేకం తర్వాత అశ్వమేధయాగం చేయటం, ప్రసక్తాను ప్రసక్తంగా ఇందులో రామాశ్వమేధకధ చెప్పబడింది. ఈ కధలో పద్మపురాణంలోని పాతాళఖండంలో ఉన్న కధలలోలాగ రామపశ్చాత్తాపం, సీతారామ లవకుశ సమాగమం, రాముడు సీతా సమేతుడై అశ్వమేధయాగం ఆచరించటం వర్నితమయినాయి.


ఇవే కాకుండా, "సత్యోపాఖ్యానం, రామరాజ్యం, దేవీ భాగవతం, పద్మపురాణం, స్కంద పురాణం" మొదలగు గ్రంథాలలో రామకధను వివరించుట జరిగింది.



Top

BOTTOM