పురాణాలకు సంబంధించిన ప్రశ్నలు - సమాధానాలు
భాగవతంలో మొత్తం 18,000 శ్లోకాలు. భాగవత ప్రథమ స్కంధంలో పందొమ్మిది అధ్యాయాలున్నాయి. ప్రథమ స్కంధంలో ప్రధానంగా అధికారి లక్షణం చెప్పబడింది.
విష్ణుపురాణం ప్రకారం కహోళుడు విష్ణుసహస్త్రనామంలోని ఏ మంత్రాన్ని జపించి అష్టావకృని పుత్రునిగా పొందాడు.
ఓం భూతాత్మనే నమః.
దుర్యోధనునికీ, భీమునికీ ఏ తీర్థంలో గదాయుద్దం జరిగింది?
సమంతపంచక తీర్థం.
సమంతపంచక తీర్థంలో యుద్ధం చేయించమని ఎవరు చెప్పారు?
బలరాముడు.
యుద్దంలో దుర్యోధనుడు ఆజ్ఞాపించగా కర్ణుడు అభిమన్యుని ధనువును వెనుక నుంచి విరిచాడు.
గోకర్ణుని కథ భాగవత మహాత్మ్యంలో కనిపిస్తుంది.
శ్రీరామ రక్షా స్త్రోతం బుధ కౌశికముని రచించారు.
తీవ్రాంశుడు అంటే సూర్యుడు.
వామన పురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి వామనుని విష్ణుసహస్రనామాలలోని "ఓం ప్రభవాయనమః" మంత్రాన్ని జపించి పుత్రునిగా పొందాడు.
విశ్వామిత్రుడు శాపవిమోచనం కోసం సహస్రనామాలలోని "ఓం పూతాత్మనే నమః" మంత్రాన్ని జపించాడు.
దుర్యోధనుని సంహారం తరువాత కౌరవుల సేనాపతిగా అశ్వత్థామని నియమించారు.
పాంచాలుల శిబిరానికి రాత్రివేళ వెళ్ళి నిదురిస్తున్న వారిని సంహరించాలనే యోచన అశ్వత్థామకు ఉలూకము పక్షిని చూసి వచ్చింది.
రుద్ర కవచం దుర్వాస మహాముని రచించారు.
గోకర్ణుని కథ భాగవత మహాత్మ్యంలో కనిపిస్తుంది. గోకర్ణుని సోదరుని పేరు ధుంధుకారి. గోకర్ణుడు చెప్పిన భాగవత సప్తాహం ఆషాఢ శుద్ధ నవమి రోజున ప్రారంభమయింది.
సనకసనందనులు దగ్గర భాగవత సప్తాహం నారదుడు విన్నాడు.
అలకనంద, భాగీరథి నదులు కలిసి గంగగా మారే తీర్థ స్థలానికి పేరు దేవప్రయోగ.
గార్గి "జనకుడు" ఆస్థానమున ఉండెనని చెప్పబడింది.
అష్టావక్రుని తండ్రి పేరు కహోలుడు. కహోలుడు ఉద్దాలకుడు కుమార్తెను వివాహం చేసుకున్నాడు.
అష్టావక్రుని వృత్తాంతాన్ని లోమసుడు ధర్మరాజుకు చెప్పినట్లు భారతంలో ఉంది.
సూతుడు భాగవతము శుకుడు నుండి విన్నాడు.
భాగవతం ముఖ్యంగా పరీక్షిత్తుని ఉద్దేశించి చెప్పబడింది.
చతుశ్లోకీ భాగవతం విష్ణువు ఉపదేశించారు.
పరీక్షిత్తుకు శాపం ఇచ్చింది శమీకపుత్రుడు.
కుంతీదేవి పరీక్షిత్తుకు తాతమ్మ అవుతుంది.
ద్వారకకు బయలుదేరినప్పుడు శ్రీకృష్ణుని వెళ్ళనీయకుండా ఉత్తర అడ్డుకున్నది.
పాండవుల కోసం సభాభవనం నిర్మించమని మయుడికి శ్రీకృష్ణుడు చెప్పారు.
మయుడు పద్నాలుగు మాసాలలో సభను నిర్మించాడు.
రుక్మిణి, శ్రీకృష్ణుల కుమారుడు ప్రద్యుమ్నుడు.
రాజులకు ఆరు గుణాలుండాలని నారదుడు చెప్పాడు.
రాజులకు ఏడు ఉపాయాలుండాలని నారదుడు చెప్పాడు.
వేదాల సాఫల్యం అగ్ని వల్ల జరుగుతుందని నారదుడు చెప్పాడు.
ఇంద్రసభ పొడవు - 150 యోజనాల, వెడల్పు - 100 యోజనాలు, ఎత్తు - 5 యోజనాలు అని నారదుడు ధర్మరాజుకి చెప్పాడు.
మయసభ రూపకల్పన చేసినదెవరువిశ్వకర్మ.
మాఘ శుద్ధ ద్వాదశి రోజున ఏ వ్రతం ఆచరిస్తారు? ఆ రోజు వైశిష్ట్యం ఏమిటి?
వ్రాహ ద్వాదశి. పృథ్విని వరాహస్వామి రక్షించిన రోజు.
ఫాల్గున శుద్ధ ద్వాదశి రోజున ఏ వ్రతం ఆచరిస్తారు?
నృసింహ ద్వాదశి.
మాసంలో ప్రతి సప్తమికి ఉపవాసం ఉంటూ ఒక సంవత్సరం పాటు ఆచరించే వ్రతం పేరేమిటి?
ఆరోగ్యవ్రతం.
77 గోవులకు సంబంధించిన తీర్థాల పేర్లేమిటి?
గోనిష్క్రమణ తీర్థం.
సూర్య, కోటి, వయు తీర్థాలు ఎక్కడున్నాయి?
మధుర.
మధురలోని వత్స-కృందన సరస్సులో స్నానమాచరిస్తే, ఏ లోకాన్ని పొందుతారని పురాణం చెబుతుంది?
వాయిలోకం.
మను పుత్రుడైన ప్రియవ్రతునికి ఎందరు కుమారులు?
పదిమంది.
వారిలో జంబుద్వీపాన్ని ఎవరు పాలించారు?
అఘ్నిఘ్నుడు.
వరాహ పురాణం ప్రకారం జంబు ద్వీపం ఎన్ని యోజనాలు విస్తరించి ఉంది?
లక్ష.
వర్షఋతువు ఆగమనం గురించి చెప్పు మండూక సూత్రం ఏ వేదానికి చెందింది?
ఋగ్వేదం.
'మాండూక్యకారిక' అను భాష్యం ఎవరు రచించారు?
గౌడపాదుడు.
పరమాత్మ యొక్క సుగుణ స్వరూపాన్ని ఏ ఉపనిషత్తు వివరిస్తుంది?
శ్వేతశ్వతర ఉపనిషత్.
సంహిత పాఠములో అత్యున్నతమైన స్థాయి ఏది?
ఘన.
కఠ ఆరణ్యకం ఏ వేదానికి చెందింది?
కృష్ణయజుర్వేదం.
శాంఖాయన ఆరణ్యకములోని మూడు నుంచి ఆరవ అధ్యాయములకు ఏ ఉపనిషత్ అని పేరు?
కౌశీతకి ఉపనిషత్.
కర్ణాటకలోని ఏడు ముక్తి స్థలములకు ఏ క్షేత్రములని కూడా పేరు?
పరశురామ క్షేత్రములు.
స్కందునకు విష్ణువు ప్రసాదించిన అనుచరులు పేర్లేమిటి?
చక్రుడు, విక్రనుడు, సంక్రముడు.
ఇంద్రుణ్ణి పతిగా పొందాలని తపస్సు ఆచరించిన భరద్వాజుని కుమార్తె పేరు శృతావతి.
కుంభకర్ణుడు కొడుకు నికుంభుడు.
ఋష్యశృంగుని తండ్రి పేరు విభాండకుడు.
యుయుత్సుడెవరి కొడుకు?
ధృతరాష్ట్రుడు.
సముద్రుని భార్య వేల ( మేరు కూతురు)
వాతాపి సోదరుడు ఇల్వలుడు. అగస్త్యుడు ఇల్వలుడిని అంతమొదించినాడు .
ఉన్మాదుడు, పుష్పదంతుడు శంఖుకర్ణుడు అనే పార్షదులను కార్తికేయునికి ఎవరు ప్రసాదించారు?
పార్వతి.
వాసుకి కార్తికేయునికి ఎవరిని ప్రసాదించాడు?
జయుడు, మహాజయుడు.
వర్థనుడు, నందనుడు అనబడే సేవకులను స్కందునకు ఎవరు ఇచ్చారు?
అశ్వినీ కుమారులు.
స్త్రీకి పతి సేవను మించి తపవిధానము మరొకటి లేదని రామాయణంలో సీతదేవి పలికారు.
పర్వతములు, వనములు, పశు పక్షులతో సహా ఈ భూమి ఇక్ష్వాకులదని శ్రీరాముడు వాలితో చెప్పాడు.
తార సుషేణుడు కుమార్తె.
శ్రీరంగంలో ఉన్న పుష్కరిణి పేరు చంద్ర పుష్కరిణి.
సింధు నది సముద్రంలో సంగమించే తీర్థానికి వరుణ తీర్థం పేరు.
అగస్త్యునికి, అతని భార్య విదర్భ రాజకుమారి అయిన లోపాముద్రకి కలిగిన పుత్రుని పేరు దృఢస్యుడు.
భారతం ప్రకారం పరశురాముడు ఏ నదిలో స్నానమాచరించి శ్రీరాముడు హరించిన తేజస్సును మరల పొందాడు?
వధూసర.
'అగ్ని నీ యోని, యజ్ఞం శరీరం, నీవు విష్ణువు యొక్క శక్తికి ఆధారం' అంటూ దేనితో స్నానమాచరించాలి?
సముద్రం.
పరమాత్మ శక్తులతోపాటు ప్రళయమందు శయనించే క్రియను ఏమంటారు?
నిరోధం.
భాగవతంలోని సప్తమ స్కంధంలో ప్రధానమైన ఇతిహాసం ఎవరిది?
ప్రహ్లాదుడు.
పుంసవన వ్రతాన్ని ఎవరు ఆచరించారు?
దితి.
నారదుడు ఎవరి సంతానాన్ని సన్యాసులుగా మార్చాడు?
దక్షుడు.
ఏ దానం ఇచ్చేవారు అందరికన్నా ముందు స్వర్గంలోకి అడుగు పెడతారని భారతం చెబుతోంది?
అన్నదానం.
ఆ తరువాత ఎవరికి అనుమతి?
సత్యవాదికి.
ఆ తరువాత ఎవరు ప్రవేశిస్తారు?
అడగకుండా దానమిచ్చువాడు.
భారతం ప్రకారం మనుష్యలోకానికీ, యమలోకానికీ మధ్య ఎన్ని యోజనాల దూరం ఉంది?
86వేలు.
శౌచములు ఎన్ని విధాలని మార్కండేయుడు చెబుతాడు?
మూడు.
అవి ఏమిటి?
వాక్‌శౌచం, కర్మశౌచం, జలశౌచం.
కామ్యక వనంలో ద్రౌపదిని చూసి ఎవరు మోహించారు?
జయద్రథుడు.
జయద్రథునికి ఏ శిక్ష విధించి పాండవులు వదిలివేశారు?
ముండనం.
విరాటరాజు దగ్గర సహదేవుని పేరేమిటి?
అరిష్టనేమి.
పరశురాముని రథసారథి పేరేమిటి?
సుమహుడు.
శివ పంచాక్షరి శతరుద్రీయంలోని ఎన్నో అనువాకములో కనిపిస్తుంది?
ఎనిమిదవ అనువాకం.
ధనుర్విద్య, ఆయుధముల గురించి ఏ పురాణం విపులంగా చెబుతుంది?
అగ్ని పురాణం.
కార్తీక మాసంలోని ఇరవై రెండవ రోజున ఎవరిని పూజిస్తారు?
సూర్యుడు.
వేటిని దానం చేస్తారు?
గోధుమలు, బంగారం, పట్టుబట్టలు.
ఫలితమేమి?
ఆరోగ్యం, తేజస్సు.
కార్తీక మాసంలోని ఇరవై మూడవ రోజు ఎవరిని పూజిస్తారు?
అష్టమాతృకలు.
వేటిని దానం చేస్తారు?
మంగళద్రవ్యాలు
ఫలితమేమి?
మాతృరక్షణము, వశీకరణం
పాండవసేనలో విచిత్ర యుద్ధం చేసిన వీరుని పేరేమి?
చిత్రాయుధుడు.
చిత్రాయుధుడు ఎవరి చేతిలో మరణించాడు?
వికర్ణుడు.
'దీపిక' అనే ఉపనిషత్ వ్యాఖ్యానం ఎవరు రచించారు?
రామతీర్థులు.
ఈ వ్యాఖ్యానం ఏ ఉపనిషత్తు గురించి చెబుతుంది?
మైత్రాయణీయ ఉపనిషత్.
ఏ ఋషుల మధ్య సంవాదాన్ని మైత్రేయఋషి ఈ ఉపనిషత్తులో వినిపిస్తాడు?
వాలఖిల్య ఋషులు.
'హిందోళ' ఉత్సవం ఎవరి పూజలో భాగంగా చేస్తారు?
శ్రీకృష్ణుడు.
దక్షిణ భారతదేశంలో ద్రౌపదికి సంబంధించి జరిపే ఉత్సవం పేరేమిటి?
తిమితి.
పంచ కేదార క్షేత్రాలలో ఒకటైన మధ్యమేశ్వరం శివుని శరీరంలోని ఏ భాగమని ప్రతీతి?
నాభి.
మాండక్యోపనిషత్ ఏ వేదానికి చెందినది?
అధర్వవేదం.
ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన... వీటి గురించి ఏ ఉపనిషత్ వివరిస్తుంది?
ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్.
ప్రాణాగ్నిహోత్ర ఉపనిషత్ ఏ వేదానికి చెందినది?
కృష్ణయజుర్వేదం.
సావిత్రీదేవి విశ్వరూపాన్ని ఏ బ్రాహ్మణం ధ్యానిస్తుంది?
దేనతాధాయ్య బ్రాహ్మణం.
ఏ నాలుగు గకార యుక్త నామాలను స్మరించేవారికి సంసారంలో మరల జన్మ ఉండదని మహాభారతం చెబుతుంది?
గీత, గంగ, గాయత్రి, గోవిందుడు.
సూర్‌దాస్ గురువెవరు?
వల్లభాచార్యుడు.
ఆదిశంకరుడు శివానందలహరి రచించిన స్థలమేది?
శ్రీశైలం.
ఆంధ్రలో జన్మించిన నియమానందుడు ఏ పేరుతో ప్రసిద్ధి చెందాడు?
నింబార్కుడు.
భాగవతంలో కాకుద్మి కుమార్తె ఎవరు?
రేవతి.
కాకుద్మి, రేవతి ఏ లోకానికి వెళ్ళినపుడు భూమి మీద కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి?
బ్రహ్మలోకం.
జైమినీయ ఆర్షేయ బ్రాహ్మణం ఏ వేదానికి చెందినది?
సామవేదం.
మానవ శుల్భ సూత్రం ఏ వేదానికి చెందింది?
కృష్ణ యజుర్వేదం.
ఐరావతాన్ని ధాయిలాండ్‌లో ఏమని పిలుస్తారు?
ఎరవన్.
ఐరావతేశ్వర ఆలయం ఎక్కడుంది?
తంజావూర్ దగ్గర.
బౌద్ధాయన ధర్మసూత్రం ఏ వేదానికి చెందింది?
కృష్ణ యజుర్వేదం.
గోభిల గృహ్యసూత్రం ఏ వేదానికి చెందింది?
సామవేదం.
వైతాన శ్రౌత సూత్రం ఏ వేదానికి చెందింది?
అధర్వ వేదం.
కఠ్ జోరి అనే ఉపనది ఏ నది నుంచి పుట్టింది?
మహానది.
త్రిమూర్తులను పరీక్షించడానికి నియోగించబడిన రుషి భృగుమహర్షి.
విష్ణుమూర్తిపై అలిగి వచ్చిన శ్రీ మహాలక్ష్మి కరవరీపురం క్షేత్రంలో కొలువు దీరింది.
శ్రీ మహావిష్ణువుకు వేంకటాచలంలో ఆశ్రయమిచ్చినది శ్రీ వరాహస్వామివారు.
పుట్టలోవున్న శ్రీమహావిష్ణువుకు తన క్షీరధారలతో ఆకలి తీర్చిన గోమాత పేరు గౌతమీ ధేనువు.
శ్రీనివాసుని పెంపుడు తల్లి వకుళాదేవి, పూర్వజన్మలో వకుళాదేవి యశోద.
తిరుమల క్షేత్రానికి పూర్వనామం ఏమిటి?
ఆదివరాహక్షేత్రం.
తిరుపతికి గల పూర్వనామం ఏమిటి?
గోవిందరాజపురం.
తిరుమలలో శ్రీ స్వామివారికి ఏ ఆగమం ప్రకారం పూజలు చేస్తారు వైఖానస ఆగమం.
తిరుచానూరులో అమ్మవారికి ఏ ఆగమం మేరకు పూజలు నిర్వహిస్తారు?
పాంచరాత్ర ఆగమం
కోణార్క ప్రదేశం గురించి ఏ పురాణం పేర్కొంటుంది?
బ్రహ్మపురాణం
దుర్యోధనుని కొడుకు పేరేమి?
లక్ష్మణుడు
ఏకలవ్యుని తండ్రి పేరేమి?
హిరణ్యధను
మహాభారతం అసలు పేరేమి?
జయసంహిత
లక్క ఇల్లు ఎవరు నిర్మించారు?
పురోచనుడు
రామచరితమానస్ ఎవరు రచించాడు?
తులసీదాస్
పంచభూత లింగములలో శివుడు తేజోలింగంగా ఎక్కడ కనిపిస్తుంది?
అరుణాచలం
సిద్ధ గీత ఏ పుస్తకంలో కనిపిస్తుంది?
యోగ వాశిష్ఠం
అగ్ని పురాణం ప్రకారం కల్కి ఎవరికి పుడతాడు?
విష్ణుయశుడు
దేవపురోహితుడని ఎవరిని అంటారు?
బృహస్పతి
అష్టదిక్పాలకులలో పడమర దిక్కున ఏమంటారు?
వరుణుడు
'ముద్దుగారే యశోద...' అని సాగే కృతి ఎవరు రచించారు?
అన్నమయ్య
కర్మలను త్యజించినంత మాత్రాన సిద్ధి సంభవించదని శ్రీకృష్ణుడు భగవద్గీతలోని ఏ అధ్యాయంలో చెప్పాడు?
తృతీయోధ్యాయం
ప్రధాన సేనాధిపతిగా దృపదుని పేరు ప్రస్తావించిన వారెవరు?
నకులుడు
వాల్మీకి రామాయణం లాగా 24000 శ్లోకాలు గల పురాణం ఏది?
శివపురాణం
చంపకపుష్పం ఉదంతంలో బ్రాహ్మణుని నుంచి శాపవశాత్తు రాక్షసునిగా మారినది ఎవరు?
విరాధుడు
కుశనాభుడు ఎవరి ద్వారా నూరుగురు కుమార్తెలకు జన్మనిచ్చాడు?
ఘృతాచి
'మాగధీ' నది ఈరోజు ఎలా పిలువబడుతున్నది?
సోన్
'కౌశంబి' నగరం ఈరోజు ఎలా పిలువబడుతున్నది?
కనౌజ్
కుశనాభుడు నిర్మించిన నగరం పేరేమిటి?
మహోదయం
వాయువు ఎవరి వందమంది కుమారైలను శపించాడు?
కుశనాభుడు.
వాసాంసి జీర్ణాని 'యధావిహాయ...' శ్లోకం భగవద్గీతలోని ఏ అధ్యాయంలోనిది?
రెండవ అధ్యాయం.
కర్ణుడికి గుడి ఎక్కడ ఉంది?
కర్ణ ప్రయోగ, జోషి మఠం దగ్గర.
'దేవప్రయాగ' లో ఏ రెండు నదుల సంగమం కనిపిస్తుంది?
అలకనంద, భాగీరధి.
'తారక మంత్రము కోరిన దొరికెను...' కీర్తన ఎవరు రచించారు?
భద్రాచల రామదాసు.
'ఇంత తెలిసియుండి ఈ గుణమేలర...' పదం ఎవరి రచన?
క్షేత్రయ్య.
'అనిర్వేద్, శ్రియా మూలం...' - ఏది సాధించాలన్నా అనిర్వేదం ప్రధానమైనదని రామాయణంలో ఎవరు పలికారు?
హనుమంతుడు.
పుష్పక విమానం ఎవరి చేత నిర్మించబడింది?
విశ్వకర్మ.
భిక్షుకోపనిషత్ ఏ వేదానికి చెందినది?
శుక్ల యజుర్వేదం.
ముద్గలోపనిషత్ ఏ వేదానికి చెందినది?
ఋగ్వేదం.
పురుషసూక్తంలోని వివరాన్ని ఏ ఉపనిషత్ చెబుతుంది?
ముద్గలోపనిషత్.
శని ఒక రాశిలో ఎన్ని నెలలుంటాయి?
ముప్పై.
చేది నగరంలోనున్న దమయంతిని గూర్చిన వివరాలను ఎవరు విదర్భ రాజుకు చెప్పారు?
సుదేవుడు.
ఏ వర్షములో ప్రవేశించిన (ద్వీప విభాగము) పురుషుడు స్త్రీగా మారతాడు?
ద్వీప విభాగం.
ఇలావృత వర్షమందు ఏవరు ఎవరిని ఆరాధించారు?
శివుడు సంకర్షణుని.
బలి చక్రవర్తి ఉండే లోకం సుతలము.
పులహాశ్రమం ప్రాంతంలో చక్రనది ఉంది.
ఋషభ దేవుడు ఏ వ్రతంతో సంకర్షణుని ఉపాసించారు?
అజగర వ్రతం.
దక్ష స్మృతి అనుసారం ప్రజాపతి సృష్టి సామర్ధ్యానికై ఈ నామాల్లోని ఏ నామాన్ని జపించారు?
ఓం పద్మనాభాయనమ:
మాధవ తంత్రానుసారం యాజ్ఞవల్క్యుడు విష్ణు సహస్రనామాల్లోని ఏ మంత్రాన్ని జ్ఞాన సిద్ధికై జపించారు?
ఓం ఆదిత్యాయ నమ:.
శివుడు ఏ నదికి ఇచ్చానుసారం ప్రవహించే వరం ఇచ్చాడు?
నర్మద.
వీరి సంప్రదాయం ఏమిటి?
శైవ సంప్రదాయం.
నయనారులు ఎంతమంది?
63.
పెరియ పురాణంలో ప్రకృతి ఖండం ఎవరి గురించి చెబుతుంది?
నయనారులు.
అదే పురాణంలోని ప్రకృతి ఖండం ఎవరి గురించి చెబుతుంది?
దుర్గ, సరస్వతి, సావిత్రి.
జమదగ్ని, పరశురాముడు, కార్తవీర్యుని కధలు అదే పురాణంలోని ఏ ఖండంలో చెప్పారు?
గణేశ ఖండం.
శ్రీకృష్ణజన్మ ఖండం ఏ పురాణంలో కనిపిస్తుంది?
బ్రహ్మ వైవర్త పురాణం.
ఈ ఖండంలో ఎవరి నూరు నామాలను చెప్పారు?
శ్రీరాముడు.
పద్మపురాణంలోని ఉత్తరఖండంలో ఎవరి వేయి నూరు నామాలను శివుడు చెప్పాడు?
విష్ణువు.
సృష్టి ఖండం ఏ పురాణంలో కనిపిస్తుంది?
పద్మపురాణం.
నందగోకులం నుండి ప్రజలు ఎక్కడకు తరలి వెళ్ళారు?
బృందావనం.
భాగవతంలోని శృతిగీతలు దేనిని స్తుతిస్తాయి?
వేదములు.
భాగవతంలో మద్ధిచెట్ల రూపం నుంచి పూర్వరూపాలను పొందిన వారెవరు?
నలకూబరుడు, మణిగ్రీవుడు.
జయద్రధుడు ఏ దేశానికి రాజు?
సింధుదేశం.
దుశ్శల భర్త పేరేమిటి?
జయద్రధుడు.
ఆమె పేరేమిటి?
దుశ్శల.
ధృతరాష్ణునికి ఎందరు కుమార్తెలు?
ఒకరు.
ధృతరాష్ణుని 100వ పుత్రుని పేరేమిటి?
చిత్రకుడు.
జ్ఞానులలో తానెవరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలికాడు?.
జ్ఞానం.
'ఏకం సద్విప్రా: బహుధా వదంతి...' - ఏ వేదంలోనిది?
ఋగ్వేదం.
ఇచ్చిన మాట ప్రకారం ఎవరికి దత్తత ఇచ్చాడు?
కుంతిభోజుడు.
శూరసేనుని తొలి సంతానం ఎవరు?
పృధ.
అభిమన్యుడు 16 సంవత్సరాలే భూమి మీద ఉండాలని కోరుకున్నది ఎవరు?
చంద్రుడు.
అతని పేరేమి?
వర్చుడు.
అభిమన్యుడు గత జన్మలో ఎవరి కుమారుడు?
చంద్రుడు.
చిత్రుడు, ఉపచిత్రుడు, చిత్రాక్షుడు - వీరు ఎవరు?
దుర్యోధనుని సోదరులు.
వసుషేణుడు, వైకర్తణుడు ఏ వీరుడి పేర్లు?
కర్ణుడు.
మహాభారతం ప్రకారం ప్రద్యుమ్నుడు ఎవరి అంశ?
సనత్కుమారుడు.
జాగృతి, స్వప్న, సుషుప్తి - వీటిని ఏ త్రయమంటారు?
అవస్ధాత్రయం.
భగవద్గీతలో పురుషుడు దృక్కు అని చెప్పి ప్రకృతిని ఎలా వర్ణించడం జరిగింది?
దృశ్యం.
ఎనిమిది స్వరూపం ఏది?
ధూమ్రవర్ణ గణపతి.
ఈయన వాహనం ఏది?
శేషుడు.
ఈయన ఏ దేవునితో పోల్చబడతాడు?
విష్ణువు.
ఈయన ఉపాసన వల్ల దేని నుండి ముక్తి లభిస్తుంది?
మమకారం.
ఏడవ స్వరూపం పేరేమిటి?
విఘ్న రాజు.
ఈయన ఉపాసన వల్ల దేని నుంచి మోక్షం లభింస్తుంది?
కామం.
ఈయన వాహనం ఏది?
నెమలి.
ఆరవ స్వరూపం ఏది?
వికట గణపతి.
ఈయన ఉపాసన వల్ల దేని నుండి ముక్తి లభిస్తుంది?
క్రోధం.
ముద్గల పురాణానుసారం గణపతి అయిదవ స్వరూపం ఏది?
లంభోదరుడు.
రతీదేవి ఎవరి రూపంలో ప్రద్యుమ్నుని కాపాడుకుంది?
మాయావతి.
పురిటిలోనే ప్రద్యుమ్నుని మాయచేత ఎవరు అపహరించారు?
శంబరాసురుడు.
ప్రద్యుమ్నుడు పూర్వజన్మలో ఎవరు?
మన్మధుడు.
వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఇవి ఏ అవతారాలు?
వ్యూహావతారములు.
శుక్రాచార్యుడు దానవరాజు అయిన వృషపర్వుడు దగ్గర ఉండేవాడు.
కచుడు బృహస్పతి పుత్రుడు.
శుక్రాచార్యునికి, ఇంద్రుడు కుమార్తె అయిన జయంతికి కలిగిన కుమార్తె దేవయాని.
వృషపర్వుడు కుమర్తె శర్మిష్ఠ.
కచుడు శుక్రాచార్యుని దగ్గర 1000 సంవత్సరాల బ్రహ్మచర్య వ్రతం ఆచరించేందుకు పూనుకొన్నాడు.
దేవయాని కచుడుని ప్రేమిస్తుంది
అసురులు కచుని 3 సార్లు వధించారు.
కచుడు చనిపోయిన ప్రతిసారీ శుక్రాచార్యుని మృత సంజీవిని వలన బ్రతికి వచ్చాడు.
దేవయాని శర్మిష్ఠ ఉద్యానవనంలో ఉన్నప్పుడు ఇంద్రుడు వాయు రూపంలో వచ్చి కన్యల వస్త్రాలను మార్చినాడు.
కచుడు దేవయానిని "ఋషిపుత్రుడు ఎవరూ తనని వివహమాడడని" శపించాడు.
దేవయాని కచుని "సంజీవని విద్య సఫలం కాదని" శపించింది.
సుహుషుడు కుమారుడు యయాతి.
దేవయానిని నూతిలో నుంచి యయాతి బయటకు తీశారు.
యయాతి వల్ల దేవయానికి యదు, తుర్వసుడు అను కుమారులు, శర్మిష్ఠకు ద్రుహ్యుడు, అనువు, పూరుడు కుమారులు కలిగారు.
'అసతోమా సద్గమయ' ఏ ఉపనిషత్తులో కనిపిస్తుంది?
బృహదారణ్యక ఉపనిషత్.
ఎవరి కోసం నుంచి సుగంధం క్రోసు దూరం వరకూ వ్యాపించి ఉంటుంది?
ద్రౌపది.
ధౌమ్యుడు ఎవరి తమ్ముడు?
దేవల మహర్షి.
ధౌమ్యుడు ఏ తీర్ధంలో తపస్సు ఆచరించాడు?
ఉత్కోచకతీర్ధం.
చైత్రరధ పర్వంలో పాండవులు ఎవరిని పురోహితునిగా చేసుకున్నారు?
ధౌమ్యుడు.
పరాశరుడు ఎవరి మాట విని సమస్త రాక్షసజాతిని సంహరించే యత్నాన్ని ఆపేశాడు?
పులస్త్యుడు.
నవనాధులు ఇచ్చిన ఉపదేశాలను నారదుడు ఎవరికి వినిపించాడు?
వసుదేవుడు.
ప్రబుద్ధ , పిప్పలాయన, అవి ర్హోత్ర... వీరెవరు?
నవనాధులలో ముగ్గురు.
నవనాధులు ఏ రాజుకు ఉపదేశించారు?
విదేహుడు.
జీవులపై మాయను ప్రయోగించటాన్ని ఏమంటారు?
ఈశత్వం.
అతి చులకన అయిన రూపాన్ని దాల్చటాన్ని ఏమంటారు?
లఘిమ.
మిక్కిలి బరువు గల రూపాన్ని దాల్చటాన్ని ఏమంటారు?
గరిమ.
అతి పెద్ద పరిమాణం గల రూపాన్ని దాల్చటాన్ని ఏమంటారు?
మహిమ.
అతి స్వల్ప పరిమాణం గల రూపాన్ని దాల్చటాన్ని ఏమంటారు?
అణిమ.
భగవద్గీతలోని విభూతియోగం భాగవతంలోని ఏ అధ్యాయాన్ని పోలి ఉంటుంది?
16వ అధ్యాయం.
హంస రూపంలో భగవంతుడు బ్రహ్మకు చేసిన ఉపదేశాన్ని ఏమంటారు?
హంసోపాఖ్యాం.
శ్రీకృష్ణునికి దేహం ఎలా మాయమయింది?
యోగమాయచే దేవతలకు తెలియని రీతిలో తేజోమయమై అంతర్ధానమైంది.
జర అను కిరాతునికి శ్రీకృష్ణుడు ఏమి ప్రసాదించాడు?
సశరీర స్వర్గం.
ఆ బాణం చివర ఏముంది?
ముసలాన్ని అరగ దీయగా మిగిలిన ముక్క.
బాణం వేసిన కిరాతుని పేరేంటి?
జర.
శ్రీకృష్ణుడు ఏ వృక్షం కింద కూర్చునప్పుడు బొటనవేలికి బాణం తగిలింది?
పిప్పల.
బలరాముడు ఏ విధంగా శరీరం వదిలాడు?
సముద్రం చివర యోగధారణతో.
ఉపదేశాలను పొందిన ఉద్ధవుడు ఏ ఆశ్రమం వైపు వెళ్లిపోయాడు?
బదరికాశ్రమం.
ఏకనాధ భాగవతం అని దేన్ని అంటారు?
ఏకనాధుని.
నవనాధులు చేసిన ఉపదేశాలు ఏ ఉపదేశంగా ప్రసుద్ధికెక్కియి?
ఉద్ధవోపదేశం.
కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, దృమిల, చమస, కరభాజన-వీరెవరు?
నవనాధులు.
ఈమె ఎవరి కుమార్తె?
మురుడు.
స్కంద పురాణం ప్రకారం ఘటోత్కచుని భార్య ఎవరు?
కామకంఠకత.
దేవకుండం ఏ నదిలో భాగం?
కృష్ణవేణి.
దీనికి మరో పేరేమిటి?
జాతిస్మరణ హ్రదం.
పూర్వజన్మ స్మృతులు ఏ కుండంలో స్నానం చేస్తే కలుగుతాయి?
దేవకుండం.
ద్రోణునికి ఇచ్చిన భాగాన్ని ఏమంటారు?
ఉత్తర.
ఎవరిని జయించి ఇచ్చాడు?
ద్రువదుడు.
పాంచాలలో సగభాగం అర్జునుడు ఎవరికి కానుకగా ఇచ్చాడు?
ద్రోణుడు.
గంగానదికి దక్షిణాన చంపావతి వరకు గల ప్రదేశానికి ఏమని పేరు?
పాంచాల.
జరాసంధుడు 99 సార్లు మధురపై గదను విసిరిన ప్రాంతానికి ఏ పేరు వచ్చింది?
గదావసానం.
కశ్మీరమండలం క్షేత్రంలో అమ్మవారి పేరేమిటి?
సరస్వతి.
జరుగుతున్న వైవశ్వత మన్వంతరంలోని మత్స్య పురాణం ప్రకారం సప్తఋషులెవరు?
అత్రి, వశిష్ఠ, కశ్యప, గౌతమ, భరద్వాజ, జమదగ్ని.
చాక్షుష మన్వంతరంలోని దేవతలను ఏమని పిలిచారు?
లేఖలు.
వివశ్వన అను మహర్షి ఏ మన్వంతరంలోని మత్స్య పురాణం ప్రకారం సప్తఋషులెవరు?
చాక్షుష.
అభూతరజసులు ఏ మన్వంతరంలోని సప్తఋషులలో ఒకడు?
రైవత.
తామస మన్వంతరంలోని సప్తఋషులు ఎవరు?
కవి, అకపి, జల్ప, ధీమన.
తామస మన్వంతరంలోని దేవతలను ఏమని పిలిచారు?
సాధ్యులు.
సీత అను మహర్షి ఏ మన్వంతరంలోని సప్తఋషులలో ఒకడు?
ఉత్తమ.
దత్తోలి అను మహర్షి ఏ మన్వంతరంలోని సప్తఋషులలో ఒకడు?
స్వారోచిష.
మత్స్య పురాణం ప్రకారం స్వారోచిష మన్వంతరంలో దేవతలను ఏమన్నారు?
తుషితులు.
నాల్గవ స్వరూపం ఏది?
గజవక్తృడు.
ఈయన ఉపాసన వల్ల్ దేని నుండి ముక్తి లభిస్తుంది?
మోహం.
మూడవ స్వరూపం ఏది?
మహోదరుడు.
ఈయన వాహనం ఏది?
ఎలుక.
ఈయన ఉపాసన వల్ల దేని నుంచి ముక్తి లభిస్తుంది?
మదం.
రెండవ స్వరూపం ఏది?
ఏకదంత గణపతి.
వక్రతుండ గణపతి వాహనం ఏమిటి?
సింహం.
ఈయన ఉపాసన వల్ల దేని నుంచి ముక్తి లభిస్తుంది?
మాత్సర్యం.
మొదట ఏది?
వక్రతుండ, గణపతి.
ముద్గల పురాణం గణేశుని ఎన్ని స్వరూపాలను వర్ణిస్తుంది?
ఎనిమిది.
మహాభారతం వరుణుడి భవనం పేరు ఏమని చెబుతుంది?
సర్వతోభద్రం.
ఇతను ఎవరి చేతిలో మరణించాడు?
దుర్యోధనుడు.
ఘటోత్కచుని స్నేహితుడైన రాక్షసుడు ఒకడు కౌరవులతో యుద్ధంలో పోరాడాడు. అతని పేరేమిటి?
మహారౌద్రుడు.
కైలాసంలో ఉండే శివుని ఉద్యాన వనం పేరేమిటి?
కల్పలం.
ఇది ఏ పర్వతానికి ఉత్తరాన ఉంటుంది?
సుమేరు.
ఆరు ఋతువులు ఒకేసారి కనిపించే వనం పేరేమిటి?
కర్ణికావనం.
గంగ సముద్రంలో కలిసే చోట సముద్రంలో ఉండే ఆశ్రమం పేరేమిటి?
కపిలాశ్రమం.
దక్షుడు యజ్ఞం చేసిన స్ధలం పేరు ఏమిటి?
కనఖలం.
కపిధ్వజుడు అనేది ఎవరికి మరో పేరు?
అర్జునుడు.
అరుణోదయం అనే నది ఏ ద్వీపం నుండి ప్రవహిస్తుంది?
ప్లక్ష ద్వీపం.
ధృతరాష్ట్రుడిని దేనికి ఒప్పించాడు?
మరల పాండవులతో జూదానికి.
ఇలా ఎందుకు చెప్పాడు?
అర్జునుని పట్ల తన భయాన్ని చెప్పాడు.
పాండవులు ఇంద్రప్రస్ధనం వెళ్ళిన తరువాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి ఎవరి పరాక్రమం గురించి చెప్పటం మొదలుపెట్టాడు?
అర్జునుడు.
నకుల సహదేవులలో ఏముందని చెప్పాడు?
శ్రద్ధ గురు సేవాభావం.
భీమునిలో ఏముందని చెప్పాడు?
పరాక్రమం.
అర్జునిలో ఏముందని చెప్పాడు?
ధైర్యం.
ధృతరాష్ణుడు యుధిష్టురుడితో ఏమందని చెప్పాడు?
ధర్మం.
ఎవరితో ఈ మాట చెప్పబడినది?
ధర్మరాజు.
బుద్ది ఉన్నచోట శాంతి ఉన్నదని భారతంలో ద్యూత పర్వంలో ఎవరు పలికారు?
ధృతరాష్ర్టుడు.
దేవలుడు చెప్పిన సంసారంలోని మూడు జ్యోతుల పేర్లు ఏమిటి?
సంతానం, కర్మ, జ్ఞానం.
సప్తసూర్యులు ఎవరి నుంచి వచ్చారని ఆరణ్యకం చెబుతుంది?
కశ్యపుడు.
కశ్యపుడు ఎక్కడుంటాడని చెబుతుంది?
మేరు పర్వతం.
ఎనిమిదవ సూర్యుడెవరని చెబుతుంది?
కశ్యపుడు.
ఈ అరణ్యకంలోని 'సూర్యనమస్కారం' ఎన్ని సూర్యుల పేర్లలను చెబుతుంది?
ఏడు.
త్తెత్తిరీయ ఆరణ్యకం ఏ వేదానికి చెందింది?
కృష్ణయజుర్వేదం.
వేదాధ్యయనంలోని స్వరముల గురించి విశేషంగా ఏ ఉపనిషత్తు చెబుతుంది?
సంహితోపనిషత్తు.
ఐతరేయ ఆరణ్యకంలోని 4, 5, 6, అధ్యాలను కలిపి ఏమంటారు?
ఐతరేయ ఉపనిషత్తు.
ప్రాణం నశ్వరమైన శరీరానికి చలనాన్ని ఇచ్చునది అనుటకు ఏ ఋషి పేరు చెప్పబడుతుంది?
భరద్వాజ.
ప్రాణం పాపముల నుండి రక్షించునది అనుటకు ఏ ఋషి పేరు చెప్పబడినది?
అత్రి.
ఋషుల స్వరూపాలలో ప్రాణాన్ని పూజించడం ఏ ఆరణ్యకంలో కనిపిస్తుంది?
ఐతరేయ ఆరణ్యకం.
ధనుర్మాసంలో జరిగే సహ్రస్రనామార్చనలో తులసికి బదులుగా ఏ దళాలు ఉపయోగిస్తారు?
మారేడు దళాలు.
శ్రీవారి ఆలయంలో వెండివాకిలికి గల మరొకపేరు?
నడిమాపడి వాకిలి.
సంపంగి ప్రదక్షిణంలో దక్షిణాన శ్రీవారి నిత్యకళ్యాణోత్సవాలు నిర్వహించే మండపాన్ని ఏమంటారు?
శ్రీ వేంకటరమణస్వామి కళ్యాణ మండపం.
శ్రీవారి ఆలయంలో పడమటి వైపున ఉన్న సరుకుల నిల్వ ఉంచే గిడ్డంగిని ఏమంటారు?
ఉగ్రాణం.
ఉగ్రాణం ముందున్న చిన్న బావిని ఏమంటారు?
విరజానడి.
సంపంగి ప్రదక్షిణంలో ఉత్తరాన ఉన్న ప్రసాదాలు తయారుచేసే వంటశాలను ఏమంటారు?
పడిపోటు.
స్వామివారికి అవసరమయ్యే పూలమాలలు తయారుచేసే ప్రదేశాలు?
పూల అర లేదా యమునోత్తరై.
పూల అరకు ఎదురుగా ఉన్న చిన్న బావిని ఏమంటారు?
పూల బావి.
పూలబావికి గల మరొక పేరు?
భూతీర్ధం.
సంపంగి ప్రదక్షిణంలో ఈశాన్యాన ప్రసాదాలు నిల్వ ఉంచి భక్తులకు విక్రయించే ప్రదేశాన్ని ఏమంటారు?
వగపడి అర.
వెండి వాకిలి ఉన్న ప్రాకారం ఎత్తు?
30 అడుగులు.
విమాన ప్రదక్షిణంలో ప్రధాన వంటశాలకు సమీపాన ఉన్న బావిని ఏమంటారు?
బంగారు బావి.
విమాన ప్రదక్షిణ మార్గానికి గల మరొక పేరు?
అంగ ప్రదక్షిణ మార్గం.
శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి ముందున్న మండపాన్ని ఏమంటారు?
'ఘంటా మండపం' లేదా 'తారుమహామణి మండపం'.
ఈ మండపాన్ని ఎవరు నిర్మించారు?
చంద్రగిరి వాస్తవ్యుడైన అమాత్యశేఖర మల్లన్న 1417లో నిర్మించారు.
బంగారు వాకిలికి రెండువైపులా వున్న మూర్తులు ఎవరివి?
జయ విజయులు.
బంగారు వాకిలి దాటాక వచ్చే మండపం?
స్తపనమండపం.
ఈ మండపం దాటాక వచ్చే మండపం?
రాములవారి మేడ.
రాములవారి మేడ దాటాక వచ్చే మండపం?
శయన మండపం.
ఘంటామండపంలో తూర్పువైపున గరుత్మంతుడు నెలకొని ఉన్న మండపం పేరు?
గరుడ మండపం.
ఘంటా మండపంలో ఉన్న గంటలను మ్రోగించేవారిని ఏమంటారు?
ఘంటాపాణి.
భూమట్టం నుండి ఆనందనిలయం విమానం పైవరకుగల ఎత్తు ఎంత?
65 అడుగులు.
జ్యోతిరసి విశ్వరూపం భగవన్ నీవే విశ్వరూప జ్యోతివి అనే మాట ఏ వేదంలోనిది?
యజుర్వేదం.
వినాయకుని విశ్వరూపాన్ని ఏ పురాణం వర్ణిస్తుంది?
గణేశ పురాణం.
సర్వసారోపనిషత్ ఏ వేదానికి చెందింది?
కృష్ణ యజుర్వేదం.
అర్జునుడు బ్రహ్మచర్యంలో ఉన్నప్పటికీ ఉలూచితో సమాగమం ఎందుకు చేయవలసివచ్చింది?
ఉలూచి అది ప్రాణదానమని పేర్కొన్నది.
ఉలూచి ఇచ్చిన మరో వరం ఏమిటి?
సమస్త జలచరులు అతని వశంలో ఉండేటట్లు.
ఉలూచికి కలిగిన కుమారుని పేరేమిటి?
ఇరావాన్.
నైమిశారణ్య తీర్ధంలో ప్రహించే నది పేరేమిటి?
ఉత్పలిని.
చిత్రాంగద తండ్రి ఎవరు?
చిత్రవాహనుడు.
చిత్రవాహనుడు ఏ దేశానికి రాజు?
మణిపురం.
ఒక తండ్రి కుమార్తెకు కలిగిన మొదటి పుత్రుడు ఏ విధి వలన ఆ తండ్రికి పుత్రుడు అనిపించుకుంటాడు?
హేతువిధి.
విశ్వామిత్రుడు శ్రీరామునికి ఉపదేశించిన 'బల', 'అతిబల' మంత్రాలు ఏ మహామంత్రం యొక్క స్వరూపాలు?
గాయత్రి.
ఈ విషయం ఏ ఉపనిషత్తు చెబుతున్నది?
సావిత్రి ఉపనిషత్.
దశరధుని తండ్రి ఎవరు?
అజుడు.
అర్జునుడు సుభద్రను ఎక్కడ చూసి ఆసక్తుడైనాడు?
రైవతక పర్వతం.
ధనుర్వేదంలో ఆదాన మనగా ఏంటి?
బాణం తీయుట.
ధనువు మీద పెట్టటాన్ని ఎమంటారు?
సంధానం.
లక్ష్యం మీదకి వదలటాన్ని ఏమంటారు?
మోక్షణము.
వినివర్తనం అనగా ఏమిటి?
అస్త్రాన్ని వెనక్కి తీసుకొనుట.
ప్రత్యంచకు, ధనువుకు గల మధ్య ప్రదేశాన్ని ఏమంటారు?
స్ధానం.
మూడు లేదా నాలుగు అంగుళీయ సహయోగాన్ని ఏమంటారు?
ముష్టి.
సుందోసుందులు ఎవరి వల్ల మోహితులైనారు?
తిలోత్తమ.
వారిరువురు ఏ విధంగా మరణించారు?
తిలోత్తమ కోసం ఒకరినొకరు చంపుకున్నారు.
తిలోత్తమకు బ్రహ్మ ఏ వరం ఇచ్చాడు?
అన్ని లోకాలలో స్వేచ్చ్హగా విహరించే వరం.
తిలోత్తమకు ఎటువంటి తేజస్సు ఉండగలదని ఆయన వరమిచ్చెను?
కనులు తెరచి పూర్తిగా ఎవరూ తిలోత్తమను చూడలేరు.
సుందోపసుందుల మరణం తరువాత త్రిలోక రక్షణ భారాన్ని బ్రహ్మ ఎవరికి అప్పగించాడు?
ఇంద్రుడు.
పాండవుల నియమం ప్రకారం ద్రౌపది ఒక్కక్కరి ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉండాలి?
ఒక ఏడాది.
ఒకవేళ ఏకాంతంగా ఒక సోదరుడు ద్రౌపదితో ఉన్నప్పుడు మరో సోదరుడు చూచిన పర్యవసానం ఏమిటి?
చూచిన వాడు 12ఏళ్ళు బ్రహ్మచర్యంతో వనంలో ఉండాలి.
ఈ నియమం పాండవులు ఎవరి సమక్షంలో చేశారు?
నారదుడు.
సుందోపసుందుల వృత్తాంతం జనమేజయునికి ఎవరు వినిపించారు?
వైశంపాయనుడు.
ద్రౌపది విషయంలో ఎందుకు చెప్పాడు?
పాండవులు పరస్పరం ఒకరినొకరు విరోధించుకోకుండా ఎలా ఉన్నారో చెప్పడానికి.
సోదరుల శపధాన్ని పాండవులలో ఎవరు ఉల్లంఘించారు?
అర్జునుడు.
ఏ విధంగా ఉల్లంఘించాడు?
ధర్మరాజు ద్రౌపదితో ఒంటరిగా ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించాడు.
అలా ఎందుకు ప్రవేశించాడు?
ఒక బ్రాహ్మణుని గోవులను రక్షించుటకు ఆయుధాలు అవసరమైనాయి.
అర్జునుడు అలా చేసినందుకు వనవాసానికి వెళ్లక్కర్లేదని ధర్మజుడు ఎందుకు చెప్పాడు?
అర్జునుడు తమ్ముడు కాబట్టి దోషం లేదన్నాడు.
అయినా అర్జునుడు ఒప్పందం ప్రకారం వనవాసానికి వెళ్లి తొలుత ఎక్కడ బస చేశాడు?
గంగాద్వారం.
గంగలో స్నానమాచరించినపుడు ఎవరు అర్జునుని లోపలికి లాగారు?
ఉలూచి.
ఉలూచి ఎవరి కుమార్తె?
నాగరాజు.
ఉలూచి తండ్రి పేరు ఏమిటి?
కౌరవ్యుడు.
అతను ఏ నాగవంశం వాడు?
ఐరావత నాగవంశం.
జలంలో ఎల్లప్పుడు అర్జునుడు అజేయునిగా ఉండగలడని ఎవరు వరమిచ్చారు?
ఉలూచి.
అశ్వమేధ ఫలాన్ని ఇచ్చే ఏ తీర్ధాన్ని అర్జునుడు సందర్శించాడు?
కారంధమ తీర్ధం.
అర్జునుడు చూసిన అయిదు తీర్ధాల్నుంచి మునులు ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు?
మొసళ్ల బాధ వల్ల.
మొసలి రూపంలో ఏ అప్సరస అర్జునుని కాలు పట్టుకుని లాగింది?
వర్గ.
ఈ అప్సరస ఏ వనంలో ఉండేది?
నందనవనం.
ఈమె ఎవరికి ప్రియురాలు?
కుబేరుడు.
ఒక బ్రాహ్మణుని శాపం వల్ల వర్గ ఎన్ని సంవత్సరాలు నీటిలో ఉండవలిసి వచ్చింది?
వంద.
సౌరభేయి, సమీచి, బుద్దుదాలత - వీరెవరు?
అప్సరసలు.
శాప విమోచనానికి బ్రాహ్మణుడు ఏ దారి ఆ చెప్పాడు?
శ్రేష్ఠ పురుషుడు ఒకడు నీటిలోంచి లాగినప్పుడు.
ధనంజయుడు శాపవిమోచనం చేయగలడని అప్సరసలకు ఎవరు చెప్పారు?
నారదుడు.
శాపవిమోచనం తరువాత వీరు సంచరించిన అయిదు తీర్ధాలకు ఏ పేరు వచ్చింది?
నారీ తీర్ధాలు.
సనక సనందనాది రుషులచే సేవింపబడిన దేవుడెవరు?
శ్రీరాముడు.
భీష్ముడికి ధనుర్విద్య నేర్పిన గురువు ఎవరు?
పరశురాముడు.
సర్పయాగం చేసిన రాజుపేరేమిటి?
జనమేజయుడు.
ఉప పాండవులను ఎవరు వధించారు?
అశ్వత్దామ.
దిలీప మహారాజు ఏ వంశానికి చెందిన వాడు?
సూర్యవంశం.
'వాల్మీకి' కి ఆ పేరు పెట్టిందెవరు?
బ్రహ్మదేవుడు.
పామువు కమ్మని నహుషుని శపించిన వారెవరు?
అగస్త్యుడు.
పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించినదెవరు?
పరమశివుడు.
జాతవేముడని ఎవరిని పిలుస్తారు?
అగ్నిదేవుణ్ణి.
శబరి ఎవరి ఆశ్రమంలో ఉండేవి?
మతంగ మహాముని.
శ్రీవారి నిలయంలో ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో నిర్వహించే 'డొలత్సవం' ఎక్కడ జరుగుతుంది?
అద్దాలమండపం లేదా ఆయినా మహల్.
అద్దాల మండపానికి ఎదురుగా ఉన్న ఎత్తయిన మండపం?
రంగనాయక మండపం.
దేశాధిపతులు, రాష్ట్రాధిపతులు, వచ్చినప్పుడు వారికి ఆశీస్సులను ప్రసాదాలను ఏ మండపంలో అందజేస్తారు?
రంగనాయక మండపంలో.
ఈ మండపం పక్కన ఉన్న మండపం పేరు?
తిరుమలరాయ మండపం.
తిరుమలరాయ మండపంలో ఉన్న విగ్రహం ఏ రాజుది?
రాజా తోడరమల్లు.
వెండివాకిలి ఎదురుగా తుర్పున ఉన్న మండపం పేరు?
ధ్వజస్తంభ మండపం.
ప్రస్తుతమున్న ధ్వజస్తంభం ఏ సంవత్సరంలో పున:ప్రతిష్టించింది?
1982లో.
ధ్వజస్ధంభాన్ని ఆనుకొని ఉన్న ఎత్తయిన పీఠాన్ని ఏమంటారు?
బలిపీఠం.
బలిపీఠానికి ఈశాన్యమూలాన ఉన్న శిలాపీఠాన్ని ఏమంటారు?
క్షేత్రపాలకశిల.
సంపంగి ప్రదక్షిణంలో నాలుగు మూలల్లో ఉన్న నాలుగుకాళ్ళ మండపాలను ఎవరు నిర్మించారు?
సాళువ నరసింహరాయలు. తాను తన భార్య ఇద్దరు కుమారుల పేరిట 1470లో నిర్మించారు.
సామీప్య ముక్తి అనగా ఏమిటి
భగవంతుని సమీపంగా నివాసం.
సాయుజ్య ముక్తి అనగా ఏమిటి?
భగవంతునితో ఏకమైపోవుట.
సారూప్యంతో కలుపుకుని మోక్షం ఎన్ని విధాలు?
ఐదు.
'ఏమిత్యేదక్షరమిదం సర్వమ్' - ఇది ఏ ఉపనిషత్తులో కనిపిస్తుంది?
మాండక్యోపనిషత్.
'ఏమితి బ్రహ్మా! ఏమితేదం సర్వత్' - ఇది ఏ ఉపనిషత్తులోనిది?
తైత్తరీయ.
'సర్వం ఖల్విదం బ్రహ్మ' - ఏ ఉపనిషత్తులోనిది?
చాందోగ్యోపనిషత్.
'యోగ: కర్మసు కౌశల్యం' - ఎందులోనిది?
భగవద్గీత.
భగవద్గీతలోని 13వ అధ్యాయంలో జ్ఞానగుణాలు ఎన్నని చెప్పారు?
ఇరవై.
'సత్యం భుయాత్ - ప్రియం భుయాత్ - ఇది ఎందులోనిది?
మనుస్మృతి.
దానాలకు ఎన్ని గుణాలని పురాణాలు చెబుతున్నాయి?
ఆరు.
దానాలు ఎన్ని రకాలని పురాణాలు తెలుపుతున్నాయి?
నాలుగు.
బావులు, చెరువులు తవ్వించడం ఎటువంటి దానం?
ధృవదానం.
ప్రతిదినం ఏదో ఒకటి దానం చేస్తూ పవిత్ర మనస్కులుగా ఉండటం ఏ రకమైన దానం?
త్రికము.
సర్పయాగం చేయించిన మహారాజు ఎవరు?
జనమేజయుడు.
పరీక్షిత్తు ఎవరి కుమారుడు?
అభిమన్యుడు.
మహాభారతంలోని ఏ పర్వంలో భగవద్గీత పొందుపరచబడి ఉంది?
భీష్మపర్వం.
గంగానదిని భువికి తీసుకొచ్చిన మహారాజు ఎవరు?
భగీరధుడు.
గంగను ఔపోసన పట్టిన ముని పేరేమిటి?
జహ్నుమహర్షి.
అనంగుడని ఎవరిని పిలుస్తారు?
మన్మధుని.
బలిచక్రవర్తి గురువు ఎవరు?
శుక్రాచార్యుడు.
యశోదకు పుట్టిన ఆడశిశువు పేరేమిటి?
యోగమాయ.
కుచేలుడు ఎవరు?
శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు.
జయవారమని దేనికి పేరు?
మంగళవారానికి.
పండరిపురం ఏ నది ఒడ్డున ఉన్నది?
భీమ.
పాండవుల పక్షాన యుద్ధం తొలిరోజున ఎవరు చనిపోయారు?
ఉత్తర్వుడు.
పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఏపక్షం?
కృష్ణ పక్షం.
శివునికి మూడవకన్ను ఎప్పుడు వచ్చింది?
పార్వతి ఆటలో రెండు కనులు మూసినపుడు.
ఆంజనేయుని వాహనమేది?
ఒంటె.
ఋషులలో సర్వోత్తముడు ఎవరు?
బ్రహ్మర్షి.
దుర్యోధనుని ఏ అంగం దెబ్బకు ప్రభావం చూపేది కాదు?
తొడ.
బ్రహ్మ వాహనం ఏది?
హంస.
శ్రీరాముడు ఏ యుగానికి చెందినవాడు?
త్రేతాయుగం.
'పార్ధుడు' ఎవరికి మరో పేరు?
అర్జునుడు.
'భద్రం కర్ణేభి: శృణుయామ దేవా:' అను మంత్రం ఏ వేదంలోనిది?
అధర్వవేదం.
పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఏ పక్షం?
శుక్ల పక్షం.
సంగీతానికి మూల గ్రంధమేది?
స్వరార్ణవము.
ఋగ్వేదంలోని మహావాక్యం ఏది?
ప్రజ్ఞానం బ్రహ్మ.
తల్లిదండ్రులూ, బాంధవ్యాలు అన్నీ మిధ్యలని చెప్పి శ్రీరాముని అయోధ్యకు తిరిగి వెళ్లమని ఎవరు పలికారు?
జాబాలి.
తమిళనాడులోని శ్రీరంగ క్షేత్రం ఏ నది ఒడ్డున ఉన్నది?
కావేరి.
జటాయువు సోదరుడు ఎవరు?
సంపాతి.
సామవేదంలోని ఏ గాన పద్ధతిని సార్వత్రికముగా పాడవచ్చును?
గ్రామ గేయం.
పాండవులు ద్రోణునికి గురుదక్షిణగా ఇచ్చిన ఊరు ఈరోజు ఎలా పిలువబడుతున్నది?
గుర్గావ్.
కార్తికేయుని ఆరు క్షేత్రములలో తిరుపతికి సమీపంలో ఉన్నది ఏది?
తిరుత్తణి.
'నాధ ద్వార' గుడి ఏ దేవునిది?
కృష్ణుడు.
కర్ణుడు యుద్ధంలో ఎన్నో రోజు హతమైనాడు?
16వ రోజు.
జరిగినదాని గురించి, జరగనిదాని గురించి ఎవరు బాధపడరని శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పెను?
పండితులు.
ఇంద్రలోకం వెళ్ళినప్పుడు తనని వివాహమాడమని అర్జునుని కోరిన అప్సరస ఎవరు?
ఊర్వశి.
లక్ష్మీదేవి వాహనం ఏది?
ఉలూకము.
కుంభమేళా ఎక్కడెక్కడ జరుగుతుంది?
హరిద్వారం, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్.
వసువులు ఎంతమంది?
8 మంది.
రావణుని కొలువులోనున్న అతని తాత ఎవరు?
మాల్యవంతుడు.
యముని దగ్గర నచికేతుడు ఎన్ని రోజులున్నాడు?
3 రోజులు.
కుంభసంభవుడు అని ఎవరికి పేరు?
అగస్త్యుడు, ద్రోణుడు.
ఇంద్రుని భార్య ఎవరు?
ఇంద్రాణి.
యజ్ఞానికి వేదికను తయారు చేసే ప్రక్రియను ఏమంటారు?
అగ్నిచయనము.
రాజులు దుష్టులై రాజ్యపాలన సరిగా చేయనప్పుడు ప్రజలు, అధికారులు కలిసి వారిని సింహాసనం నుంచి దింపేసేవారని ఏ బ్రాహ్మణం చెబుతుంది?
శతపధ బ్రాహ్మణం.
బాణంలోని పదునైన భాగాన్ని ఏమంటారు?
శల్యము.
వైదిక కాలంలో జూదం ఆడేవారి మీద ఒక అధికారి ఉండేవాడు. అతనిని ఏమనేవారు?
అక్షావాపుడు.
శ్రీరామునితో సంధి చేసుకుని సీతను పంపివేయమని రావణుడికి హితవు చెప్పిన తాత ఎవరు?
మాల్యవంతుడు.
రామాయణంలో విద్యున్మాలి అనే రాక్షసుడిని ఎవరు సంహరించారు?
నీలుడు.
వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని ఎవరు సంహరించారు?
అంగదుడు.
నాలుగు కుండముల మధ్య భాగమైన శమంతపంచకమనే ప్రదేశానికి మరో పేరేంటి?
కురుక్షేత్రం.
భీముని చేతిలో దుర్యోధనుని అంతం జరుగునని శపించిన మహర్షి ఎవరు?
మైత్రేయ.
నందిసేనుడు, లోహితాక్షుడు, ఘంటాకర్ణుడు, కుముదమాలి ఎవరి అనుచరులు?
కార్తికేయుడు.
ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం పట్టాభిషేకం కాగానే రాజుకు ఏ ఉపాఖ్యానాన్ని వినిపించాలి?
హరిశ్చంద్రోపాఖ్యానం.
ఋగ్వేదంలోని ఐలోపాఖ్యానాన్ని ఆధారంగా చేసుకుని కాళిదాసు రచించిన కావ్యం ఏది?
విక్రమోర్వశీయం.
తైత్తరీయ బ్రాహ్మణం ప్రకారం ఏ విద్య తెలిసినవాడు మరణం, పునర్మరణం అనే చక్రాన్ని దాటగలడు?
సావిత్ర విద్య.
వైదిక కాలంలో 'తక్షుడు' అనగా ఎవరు?
వడ్రంగి.
రావణుడు సీతను 'వింద' నామకమను ముహూర్తమున అపహరించినందుకు ఎరతగిలించు కొక్కెము పట్టుకొనిన మత్స్యంవలె నశించునని ఎవరు పలికెను?
జటాయువు.
వాలి భార్య పేరు తార. వాలి గోలభుడు అను గంధర్వునితో 15 సంవత్సరాలు యుద్ధం చేసి వధించినాడు.
.
మహాభారత యుద్ధంలో అర్జునుని మీద అనేక మాయలు ప్రయోగం చేసిన వారెవరు?
శకుని.
శకుని తండ్రి ఎవరు?
సుబలుడు.
సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవేరి పేరేమి?
సింహవల్లి తాయారు.
'పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు...' అని సాగే మంగళ హారతి ఎవరు రచించారు?
త్యాగరాజు.
దేవహూతి భర్త ఎవరు?
కర్దముడు.
సగం మనిషి సగం గుర్రం ఆకారంలో ఉంటూ కుబేరునితో ఉండే వారిని ఏమందురు?
కింపురుషులు.
శివుని వాహనం పేరుతో మన రాష్ట్రంలో ఉన్న క్షేత్రం ఏది?
మహానంది.
స్వాయంభువ మనువుకు శతరూపకు కలిగిన ఆడ మగ పిల్లలు ఎంతమంది?
3+2.
ధ్రువుని తల్లి పేరేమి?
సునీతి.
రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు ఏ గ్రహం అధిపతి?
చంద్రుడు.
'దగ్గర కూర్చోవడం' అనే మాట మనకు ఏవిధంగా అతి ముఖ్యమైనది?
ఉపనిషత్ తాత్పర్యమది.
కుబేరుని రాజధాని ఏది?
అలకాపురి.
భరతుడు శ్రీరాముని పాదుకలను ఎక్కడ స్ధాపించెను?
నందిగ్రామం.
అరువది సంవత్సరముల నామములలో 60వ సంవత్సరం ఏది?
అక్షయ.
తర్జని లేదా మధ్యమ వేలుతో బాణాన్ని వదలటాన్ని ఏమంటారు?
ప్రయోగం.
ఒకేసారి అనేక లక్ష్యముల వైపు బాణాన్ని ప్రయోగించటం, శబ్దభేది ప్రయోగించటం ఇలాంటి వాటిని ఏమని పిలుస్తారు?
రహస్యం.
ధర్మరాజు కుమారుడు ప్రతివింధ్యుడు(తల్లి ద్రౌపది).
అర్జునుడు కుమారుడు శృతకర్మ (తల్లి ద్రౌపది).
భీముడు కుమారుడు సుతసోముడు (తల్లి ద్రౌపది).
నకులుని భార్య పేరు కరేణుమతి. నకులుని కొడుకు నిరామిత్రుడు, శతానీకుడు(తల్లి ద్రౌపది).
సహదేవుడి భార్య పేరు విజయ. సహదేవుని కుమారుడెవరు శృతసేనుడు(తల్లి ద్రౌపది).
భీమసేనునికి ఏ యాగం తరువాత సుతసోముడు జన్మించాడు?
సహస్ర సోమయాగం.
శృతసేనుడు అనే పేరు దేనికి పేరు?
అగ్నిదేవుడు.
మహాధేనువని ఎవరిని పిలుస్తారు?
జగన్మాతను.
అన్నివేళలయందు సిద్ధించి మనకు సత్ఫలితాలనిచ్చేదేమిటి?
భగవన్నామ సంకీర్తనం.
.
ఆరోగ్యభాగ్యం కలుగుట కొరకు ఏ దేవుని పూజించాలి?
సూర్యభగవానుణ్ణి.
ముల్లోకాల్లోనూ పూజా పురస్కారములుండవని బ్రహ్మను శపించిందెవరు?
భృగుమహర్షి.
దైవబలముకన్నా మహిమాన్వితమైనది ఏది?
పాతివ్రత్యం.
త్రిమూర్తులు ప్రయాణిస్తున్న వాహనాలు కదలకుండా నిలిచిపోయిందెక్కడ?
అత్రిమహాముని ఆశ్రమం వద్ద.
నారదుడికి ఇనుప గుగ్గిళ్లను ఉడికించి పెట్టినదెవరు?
సతీ అనసూయ.
భగవద్గీతయందు అత్యంత మహిమకలిగిన పదునైన అధ్యాయం పేరేమిటి?
పురుషోత్తమ ప్రాప్తియోగం.
వైమానిక శాస్త్రాన్ని రచించిన మహర్షి ఎవరు?
భరద్వాజుడు.
అర్జునుడు మళ్లీ మణిపురం వెళ్ళినప్పుడు చిత్రాంగదకు, తనకు కలిగిన కుమారుని పేరు ఏమని మార్చారు?
బభ్రువాహనుడు.
బభ్రువాహనుని అర్జునుడు అనుకున్న ప్రకారం ఎవరికి పుత్రునిగా సమర్పించాడు?
చిత్రవాహనుడు.
ఈ యాత్రలో అర్జునుడు శ్రీకృష్ణుని ఏ క్షేత్రంలో కలుసుకున్నాడు?
ప్రభాస క్షేత్రం.
వారిరువురు ఏ పర్వతం మీద కొద్ది రోజులు ఉన్నారు?
రైవతక పర్వతం.
ఆ పర్వతం మీద ఏ వంశం వారు ఉత్సవం జరుపుకున్నారు?
వృష్ణి, అంధక, భోజ.
అక్రూరుడు, సారణుడు, గదుడు... వీరు ఏ వంశం వారు?
యదు వంశం.
సూర్యనారాయణ అవతారంలో లక్ష్మి - విష్ణువును ఏ పేరుతో అనుసరించి ఉంటుంది?
పద్మ.
వామనుని దగ్గర లక్ష్మి ఎక్కడ ఆశ్రయించి ఉంటుంది?
అజినము.
మత్స్యావతారంలో లక్ష్మి ఏ భాగాన్ని ఆశ్రయించి ఉంటుంది?
నేత్రాలు.
కూర్మావతారంలో ఏ భాగాన్ని ఆశ్రయించి ఉంటుంది?
వీపు.
ఒక 'గుల్మం' ఎన్ని సేనాముఖాలు?
మూడు.
మూడు గుల్మములు కలిస్తే ఏమవుతుంది?
ఒక గణం.
ఒక 'వాహిని'లో ఎన్ని గణాలుంటాయి?
మూడు.
మూడు వాహినులు కలిస్తే ఏమవుతుంది?
ఒక పృతన.
మూడు పృతనాలు ఒక 'చము' అయితే మూడు చమువులు కలిస్తే ఏమంటారు?
ఒక అనీకిని.
పది అనీకినులు కలిస్తే ఏమని పేరు?
ఒక అక్షౌహిణి.
ఒక అక్షౌహిణిలో ఎన్ని ఏనుగులు, రధాలు ఉంటాయి?
21,870.
ఒక అక్షౌహిణిలో ఎంతమంది సైనికులుంటారు?
1,09,350.
భగవద్రామానుజులు వారు జీవితకాలంలో ఎన్ని సార్లు తిరుమల యాత్ర చేశారు?
మూడు సార్లు.
శ్రీకృష్ణదేవరాయలు ఎన్ని సార్లు చేశారు?
ఏడు సార్లు.
శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఏమంటారు?
కోయల్ ఆళ్వార్ తిరుమంజనం.
ఏడాదిలో ఆలయాన్ని ఎన్నిసార్లు తిరుమంజనం చేస్తారు?
నాలుగు సార్లు.
శ్రీస్వామి వారిని పుష్కరిణిలో చక్రస్నానం ఏడాదికి ఎన్ని సార్లు చేయిస్తారు?
నాలుగు సార్లు.
విష్ణు సహస్రనామాలలో "శ్రీనివాస:" అనే నామం ఎన్ని సార్లు కనిపిస్తుంది?
రెండు సార్లు.
మూడేళ్లకోమారు అధికమాసం వచ్చినప్పుడు ఏడాదికి తిరుమలేశునికి బ్రహ్మోత్సవాలు ఎన్ని సార్లు నిర్వహిస్తారు?
రెండు సార్లు.
శ్రీవారికి ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవలో ఎన్ని బంగారు పుష్పాలు ఉపయోగిస్తారు?
108.
భగవద్గీతలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి?
700.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి?
70.
శ్రీవారిని ఆలయంలోనికి తీసుకెళ్లే, వెలుపలికి తీసుకొచ్చే ప్రక్రియను ఆలయ పరిభాషలో ఏమంటారు?
వేంచేపు.
వైష్ణవ స్వాములు, ఇతర అర్చకులు తమిళ దివ్య ప్రబంధ పాసురాలను గానం చేస్తూ శ్రీవారిని కీర్తించడాన్ని ఏమంటారు?
శాక్తుమొర.
శ్రీవారి ఆలయంలో సూర్యోదయ వేళలో వినిపించే మంగళప్రదమైన కొలువు మేళాన్ని ఏమంటారు?
హరికొలువు.
సాయంకాలం పూట వినిపించే మేళాన్ని ఏమంటారు?
సందెకొలువు.
మూలమూర్తికి ఆభరణాలు అలంకరించే కార్యక్రమాన్ని ఏమంటారు?
సమర్పణ.
స్వామివారికి ప్రతిరోజూ యధావిధిగా ఆభరణాలను అలంకరించడాన్ని ఏమంటారు?
సదాసమర్పణ.
విశేష సమయాలలో ప్రత్యేక ఆభరణాలను అలంకరించడాన్ని ఏమంటారు?
విశేష సమర్పణ.
ఆభరణాలను తొలగించడం లేదానుదుట గల నామాన్ని తగ్గించే ప్రక్రియనేమంటారు?
సడలింపు లేదా సళ్ళింపు.
ప్రసాదాలు సమర్పించడాన్ని ఏమంటారు?
నివేదన.
స్వామివారిపై గల వాడిన పూలను, నిర్మాల్యాలను తొలగించే ప్రక్రియను ఏమంటారు?
నిర్మాల్య శోధన.
భాగవతంలో యాదవునకు ఉపదేశం ఎవరు చేసినట్టు తెలుస్తుంది?
అవధూత.
అవధూత ఎవరని ప్రసిద్ధి?
దత్తాత్రేయుడు.
అవధూత తాను ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నానని చెప్పాడు?
ఇరవైనాలుగు.
భూమి నుంచి ఏమి నేర్చుకున్నాడు?
క్షమ.
సర్వస్వం పరుల కొరకు ధారపోయడం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?
పర్వతం, వృక్షం.
జలం దగ్గర ఏమి నేర్చుకున్నాడు?
స్వచ్ఛత.
పవిత్రత ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?
అగ్ని.
విషయ స్పర్శ లేకపోవడం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?
సూర్యుడు.
వడ్రంగి దగ్గర ఏమి నేర్చుకున్నాడు?
ఏకాగ్రత.
స్వగృహం లేకపోవడం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?
సర్పం.
ఏ సప్త నదులలోని జలం తాగితే పాపాలు నశిస్తాయి?
గంగ, యమున, సరస్వతి, రధస్తా, సరయు, గోమతి, గండకి.
అంగారపర్ణుడనే గంధర్వుడు తన పేరును ఎందుకు త్యజించాడు?
అర్జునుని చేతిలో ఓడిపోయినందుకు.
ఏ పేరు పెట్టుకున్నాడు?
దగ్ధరధుడు.
చాక్షుషీ విద్య తొలుత ఎవరి దగ్గర ఉండేది?
మను.
మను ఎవరికి ఇచ్చాడు?
సోముడు.
సోముడు ఎవరికి ఇచ్చాడు?
విశ్వావసుడు.
విశ్వావసువు ఎవరికి ఇచ్చాడు?
చిత్రరధుడు.
చాక్షుషీ విద్య గొప్పతనం ఏమిటి?
ముల్లోకాలలోని ఏ వస్తువునైనా చూడాలనుకున్న వారికి అది కనపడుతుంది.
సంవరణుడు ఎవరి కుమారుడు?
ఋక్షుడు.
సంవరణుడు ఎవరి ఉపాసన చేసేవాడు?
సూర్యోపాసన.
లోకంలో ఉత్కృష్టమైన ధనం, యశం దేనితో సమానమని మహాభారతం చెబుతోంది?
వజ్రం.
బ్రాహ్మణుని శరీరంలో ఏ భాగాన్ని వజ్రమని అన్నారు
కుడిచేయి.
ఎందువల్ల?
అగ్నిలో ఆహుతులు వేయడం వల్ల.
రధము ఎవరికి వజ్రము?
క్షత్రియుడు.
ఏ దేశపు గుర్రాలు ఇచ్ఛానుసారం రంగు మార్చగలవని భారతం చెబుతోంది?
గంధర్వదేశం.
చిత్రరధుడనే గంధర్వునితో పాండవులకు ఏ తీర్ధంలో యుద్ధం జరిగింది?
సోమాశ్రయాయణ తీర్ధం.
ఈ తీర్ధంలో ఏ నదిలో ఆ గంధర్వుడు జలక్రీడలు చేస్తున్నాడు?
గంగ.
చిత్రరధుని మరో పేరేమిటి?
అంగారపర్ణుడు.
శ్రీధరస్వామి రచించిన 'శ్రీధరీయం' దేనిమీద ప్రామాణికమైన వ్యాఖ్య?
భాగవతం.
'అన్వితార్ధ ప్రకాశిక' అనే వ్యాఖ్య ఎవరిది?
గంగా సహాయుడు.
శ్రీకృష్ణావతారంలో సమష్ఠిగా ఎన్ని అవతారాలున్నాయి?
అయిదు.
మొదటిదేది?
గోలోకవాసిగా రాధాకృష్ణుడు.
రెండవది ఏది?
బలరామ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధులు.
మూడవది ఏది?
నరనారాయణులు.
నాల్గవది ఏది?
పృశ్నిగర్భ, వామన.
అయిదవది ఏది?
నసిణ, శ్రీరం, శ్రీకృష్ణులు.
భాగవతంలోని ఏ స్కంధం చదివితే తేలికగా ముక్తి పొందగలరు?
దశమ స్కంధం.
అవతార సమాప్తి సమయానికి శ్రీకృష్ణుని వయసు ఎంత?
125 సంవత్సరాలకు.
ముసలం ఎవరికి పుట్టింది?
సాంబునకు.
ఏకాదశ స్కంధంలో శ్రీకృష్ణుడు భాగవతులలో తానెవరని చెప్పాడు?
ఉద్గవుడు.
తొలి తెలుగు వాగ్గేయకారుడెవరు?
అన్నమయ్య.
అన్నమయ్య పూర్తిపేరు?
తాళ్లపాక అన్నమాచార్యులు.
అన్నమయ్య జన్మదినం?
వైశాఖ శుద్ధ పూర్ణిమనాడు, విశాఖ నక్షత్రం, 09-05-1408.
అన్నమయ్య తల్లిదండ్రులెవరు?
లక్కమాంబ, నారాయణసూరి.
అన్నమయ్య భార్యలపేర్లు ఏమిటి?
తిమ్మమాంబ, అక్కమాంబ.
అన్నమయ్యకు గల బిరుదులు ఏవి?
హరిసంకీర్తనాచార్యులు, పదకవితా పితామహుడు, పంచమాగమ సార్వభౌముడు.
అన్నమయ్య రచించిన మొత్తం కీర్తనలు ఎన్ని?
దాదాపు ముప్పది రెండువేలు.
తిరుమల ఆలయంలో శ్రీవారి ముఖ్యకళ్యాణోత్సవాన్ని తొలుతగా నిర్వహించినదెవరు?
అన్నమయ్య.
అన్నమయ్య ఏ రాజు ఆస్దానకవిగా ఉండి, అతని అహంకారాన్ని అణచాడు?
పెనుగొండ ప్రభువైన సాళువ నరిసింహరాయలు.
అన్నమయ్య అవతార సమాప్తి జరిగిన సంవత్సరమేది?
క్రీ.శ. 1503, దుందుభి నామ సంవత్సరం, ఫాల్గుణ బహుళ ద్వాదశి.
కూర్మ పురాణాన్ని తొలుత ఎవరు వినిపించారు?
నారాయణుడు.
ఎవరికి వినిపించారు?
నారదునికి.
ఇందులో ఎన్ని భాగాలున్నాయి?
నాలుగు.
మొదటి భాగం పేరేమిటి?
బ్రాహ్మి సంహిత.
రెండవ భాగం పేరేమిటి?
భగవతి సంహిత.
మూడవ భాగం పేరేమిటి?
గౌరీ సంహిత.
నాల్గవ భాగం పేరేమిటి?
వైష్ణవి సంహిత.
ఏ సంహిత లభ్యమవుతుంది?
బ్రాహ్మి సంహిత.
అవ్యక్త జ్ఞానం గురించి బ్రాహ్మీ సంహితలోని ఏ భాగం చెబుతుంది?
ఉత్తరభాగం.
కల్పాంతం తరువాత ప్రారంభమయ్యే సృష్టికి ఏమని పేరు?
ప్రతిసర్గ.
అద్వైత బ్రహ్మజ్ఞానం గురించి ఏ పురాణంలో స్పష్టంగా కనిపిస్తుంది?
అగ్ని పురాణం.
అగ్ని పురాణం వినాలనే కోరిక ఎందుకు శుభప్రదం?
ఒక రోజులో కలిగే పాపాలు నశిస్తాయి.
సుమేరు పర్వతం మీద ప్రవహించే గంగకు ఏమనిపేరు?
సీత.
లవణ, ఇక్షు, సుర, సర్పి, దధి, దుగ్ధ, జల... ఇవేమిటి?
నారద పురాణం చెప్పిన సప్త సముద్రాలు.
మ్రుకండు ఏ క్షేత్రంలో తపస్సు ఆచరించారు?
సాలగ్రామ క్షేత్రం.
ఒక కాష్ఠలో ఎన్ని నిమేషములు?
పదిహేను.
ముప్పై కాష్ఠలను కలిపి ఏమంటారు?
కల.
ఒక క్షణాలను కలిపి ఏమంటారు?
ముప్పై.
ఆరు క్షణాలను కలిపి ఏమంటారు?
దండ.
ఒక ముహూర్తంలో రెండు దండలుంటే ఒక రోజులో ఎన్ని ముహూర్తాలుంటాయి?
ముప్పై.
బ్రహ్మ వైవర్త పురాణంలో ఎన్ని భాగాలున్నాయి?
నాలుగు.
మొదటి భాగం పేరేమిటి?
బ్రహ్మ ఖండం.
రెండవభాగం పేరేమిటి?
ప్రకృతి ఖండం.
మూడవభాగం పేరేమిటి?
గణేశ ఖండం.
నాల్గవభాగం పేరేమిటి?
శ్రీకృష్ణ ఖండం.
సూర్యుడు ఎవరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు?
విశ్వకర్మ.
ఆమె తన ఏ స్వరూపాన్ని వదిలి వెళ్ళిపోయింది?
ఛాయ.
ఛాయకు సూర్యుని ద్వారా ఎవరు జన్మించారు?
సావర్ణి మనువు.
సూర్యుడు సంజ్ఞ ద్వారా ఎవరిని కన్నాడు?
వైవశ్వత మనువు, యముడు.
యమునికి సోదరి (కవల) ఎవరు?
యమున.
శ్రీవారిని మట్టిపుష్పాలతో అర్పించిన భక్తుడెవరు?
కురువరచి నంబి.
శ్రీవారిని బంగారుపూవులతో పూజించినదెవరు?
తొండమాన్ చక్రవర్తి.
తొండమానుడు పూర్వజన్మలో ఎవరు?
రంగదాసుడు.
తొండమానుని అన్న ఎవరు?
ఆకాశరాజు.
తొండమానునకు బ్రహ్మహత్యాపాతకం ఎవరి వలన సంక్రమించింది?
కూర్ముడు అనే బ్రాహ్మణుని వల్ల.
పద్మావతి అమ్మవారు పూర్వజన్మలో ఎవరు?
వేదవతి.
ఎవరి పక్షాన నిలచి శ్రీవారు తొండమానునితో యుద్ధానికి తలపడ్డారు?
వసుదాసుడు.
శ్రీవారికి ప్రస్తుతం ఉన్న శంఖు-చక్రాలు ఎవరు ఏర్పాటు చేశారు?
భగవద్రామానుజులవారు.
ప్రతిరోజూ కొత్త కుండపెంకులో ప్రసాదం స్వీకరించడం వల్ల స్వామి వారికి ఏమని పేరొచ్చింది?
తోమని పళ్ళాలవాడు.
అలంఋష, మిత్రకేశీ, విద్యుత్పర్ణ - వీరెవరు?
అప్సరసలు.
ప్రహ్లాదుని సోదరులు ఎంతమంది?
నలుగురు.
సంహ్రాదుడు, అనుహ్రాదుడు, శిబి, వాష్కలుడు ఎవరు?
ప్రహ్లాదుని సోదరులు.
సాత్యకి ఎవరి అంశలో ఉత్పన్నమయ్యాడు?
మరుత్ - దేవతల అంశ.
అలోలుపుడు, అభయుడు, రౌద్రకర్ముడు - వీరెవరి సోదరులు?
దుర్యోధనుడు.
బలరామకృష్ణుల దగ్గర నుంచి గోపస్త్రీలను లాక్కొని పోయినదెవరు?
శంఖచూడుడు.
శంఖచూడుడు ఎవరు?
యక్షుడు.
ఇతనిని ఎవరు హతమార్చారు?
శ్రీకృష్ణుడు.
శంఖచూడుని శిరస్సు మీద ఉన్న చూడామణిని శ్రీకృష్ణుడు ఎవరికి కానుకగా ఇచ్చాడు?
బలరాముడికి.
గుర్రం ఆకారంలో ఉండే ఓ రాక్షసుడిని కంసుడు చిన్ని కృష్ణుడిపై ప్రయోగించాడు. ఆ రాక్షసుడి పేరేమిటి?
కేశి.
'తారకమంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా...' - ఈ పలుకులెవరివి?
భక్త రామదాసు.
'మానిషాద...' అను శ్లోకం వాల్మీకి రామాయణంలో ఎక్కడ కనిపిస్తుంది?
బాలకాండలోని రెండవ సర్గలో.
వాల్మీకి రామాయణంలో 24వేల శ్లోకాలు, ఆరు కాండలతో పాటు ఉత్తర కాండ కూడా ఉందని ఎక్కడ చెప్పారు?
బాలకాండ నాల్గవ సర్గ.
జనకుని సోదరుడైన కుశధ్వజుడు ఏ నగరంలో ఉండేవాడు?
సాంకాశ్య.
క్రౌర్యం లేకపోవడం, దయ, విద్య, శీలం, ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం - ఈ ఆరు ఎవరి గుణాలు?
శ్రీరాముడు.
'తండ్రి, సోదరుడు, పుత్రుడు - వీరు ఇచ్చునది పరిమితమే! అపరిమితంగా ఇచ్చునది కేవలం పతియే!' - ఇలా ఎవరు పలికారు?
సీత.
వివాహం అనంతరం సీతరాములు అయోధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు?
పన్నెండు.
జంబుమాలినిని ఎవరు వధించారు?
హనుమంతుడు.
'గతంలో ఇంద్రియములను వశపరుచుకుని ముల్లోకాలను జయించినావు. అవే ఈ రోజు నిన్ను జయించినవి' - ఇది ఎవరు ఎవరి గురించి పలికినది?
మండోదరి రావణుని గురించి.
రామాయణం గాయత్రీ స్వరూపమని ఎక్కడ చెప్పబడింది?
ఉత్తరకాండ చివరి సర్గలోని 18వ శ్లోకం.
తిరుమలేశుని గర్భాలయాన్ని ఏమంటారు?
ఆనందనిలయం.
ఆనందనిలయం పై భాగాన విరాజిల్లుతున్న బంగారు శిఖరాన్ని ఏమంటారు?
ఆనందనిలయ విమానం.
విమానం పై భాగాన రెండవ అంతస్తులో ఉత్తరాభిముఖంగా పతిష్టించిన మూర్తిని ఏమంటారు?
విమాన వెంకటేశ్వరుడు.
ఆనందనిలయంలోని మూల విరాట్టుకు గల ఇతర పేర్లేమి?
ధ్రువబేరం లేదా స్థానిక మూర్తి (బేరం అంటే విగ్రహం).
ఆనందనిలయంలోని శ్రీహరితోపాటు ఉన్న ఇతర మూర్తులు?
భోగ, కొలువు, ఉగ్ర, ఉత్సవ శ్రీనివాసమూర్తులు.
భోగ శ్రీనివాసమూర్తికి గల ఇతర పేర్లేమి?
కౌతుకబేరం, పురుష బేరం.
కొలువు శ్రీనివాసమూర్తికి గల ఇతర పేర్లు?
బలిబేరం లేదా దర్బార్ శ్రీనివాసమూర్తి.
ఉగ్ర శ్రీనివాసమూర్తికి గల మరో పేరు?
స్నపన బేరం.
ఉత్సవ శ్రీనివాసమూర్తికి గల మరో పేరు?
ఉత్సవ బేరం.
ఆనంద నిలయం చుట్టూ చేసే ప్రదక్షిణాన్ని ఏమంటారు?
విమాన ప్రదక్షిణం.
సుందరార్, నండనార్, తిరునవుక్కరసార్ - వీరెవరు?
నయన్మారులు.
చాణూరుడు ఏ ప్రాంతం వాడు?
ఆంధ్ర.
బలరామకృష్ణులను తన దగ్గరకు రప్పించడానికి కంసుడు ఎవరిని పురమాయించాడు?
అక్రూరుడు.
వారిని ఏ యాగానికి పిలిపించారు?
ధనుర్యాగము.
రధాన్ని ఆపి అక్రూరుడు యమునలో మునిగినప్పుడు అతనికి ఎవరు కనిపించారు?
శేషతల్పశాయి అయిన మహావిష్ణువు.
బలరామకృష్ణులు ఎలా కనిపించారు?
బలరాముడు శేషునిగాను, శ్రీకృష్ణుడు మహావిష్ణువుగాను.
బలరామకృష్ణులు మధురలోకి ప్రవేశించినపుడు ఎవరు కంటపడ్డారు?
కుబ్జ.
కుబ్జతోపాటు మరెవరికి మంచి రూపాన్ని శ్రీకృష్ణుడు ప్రసాదించాడు?
వాయకుడు.
వాయకుడు ఎవరు?
రంగులు పూయువాడు.
కుబ్జ శ్రీకృష్ణుని ఏ వరం కోరింది?
ఒకరోజు సహవాసం.
కుంతి ఏ దేవి స్వరూపమని భారతం చెబుతుంది?
సిద్ధిదేవి.
మాద్రి ఏ దేవి స్వరూపమని భారతం చెబుతుంది?
ధృతిదేవి.
గాంధారి ఏ దేవి స్వరూపమని భారతం చెబుతుంది?
మతిదేవి.
దుష్యంతుడు ఏ వంశం వాడు?
పురు.
శకుంతలను నిర్జనవనంలో ఏ పక్షులు రక్షించాయి?
శకుంత పక్షులు.
ఆ తరువాత ఎవరి ఆశ్రమంలో శకుంతల పెరిగింది?
కణ్వుడు.
దుష్యంతుడు, శకుంతల ఏరకమైన వివాహం చేసుకున్నారు?
గాంధర్వ వివాహం.
మనుష్యుల అన్ని కర్మలను ఎవరు తెలుసుకుని ఉంటారు?
సూర్యచంద్రులు, వాయు, అగ్ని, అంతరిక్షం, పృధ్వి, జలము, యముడు, పగలు, రాత్రులు, రెండు సంధ్యలు, ధర్మము.
వందమంది పుత్రులను కనడానికంటే ఏది ఉత్తమమని భారతం చెబుతుంది?
సత్యపాలనం.
దుష్యంతుని తల్లి ఎవరు?
రధంతర్వా.
జరాసంధుని తండ్రి పేరు?
బృహద్రధుడు.
సోమాన్ని పిండి రసం చేసి హోమం చేసే రోజును యజ్ఞంలో ఏమంటారు?
సుత్యా.
వేద కాలంలో సరస్వతీ నదికి ఉన్న ప్రాధాన్యత బ్రాహ్మముల కాలానికి ఏ నదికి వచ్చింది?
గంగ.
మనసుకు, మాటకు గల సంబంధం ఎవరి మధ్య ఉండాలని వేదం చెబుతుంది?
భార్యాభర్తలు.
విద్యలను గురువులు ఏ శుల్కమూ తీసుకొనకుండా చెప్పేవారిని ఏ బ్రాహ్మణం చెబుతుంది?
శతపధ బ్రాహ్మణం.
చంద్రుని కిరణాలను గ్రహించి మరల ప్రతిబింబింప చేసే మణిని ఏమంటారు?
చంద్రకాంత.
షట్‌దర్శనాలలో చివరిది ఏది?
ఉత్తర మీమాంస.
గాంధారి తండ్రి పేరేమి?
సుబలుడు.
ఉజ్జెన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
క్షిప్ర.
ప్రఘాసుడనే రాక్షసుని ఎవరు సంహరించారు?
హనుమంతుడు.
'యోగ' ఉపనిషత్తులు ఎన్నని ముక్తికోపనిషత్ పేర్కొంటుంది?
పదిహేడు.
రాజసూయ యాగంలో ప్రధాన దేవత ఎవరు?
వరుణుడు.
'భృగువల్లి' ఏ ఉపనిషత్‌లోనిది?
తైత్తరీయోపనిషత్.
వాల్మీకి రామాయణంలో వంద సహస్రకోటి సంఖ్యను ఏమని చెప్పారు?
శంకు.
శ్రీరామదండులో గవయుడనే వానర వీరుడి వెనుక ఎందరు వానరులు యుద్ధం చేశారు?
70లక్షలు.
వాల్మీకి రామాయణంలో లక్ష శంకుని ఏమన్నారు?
మహాశంకు.
వృందము అనగా ఎన్ని మహాశంకులు?
లక్ష.
ఈ సంఖ్యలను వాల్మీకి రామాయణంలో మహర్షి దేనికి ఉపయోగించారు?
శ్రీరాముని సైన్యం గురించి చెప్పడానికి.
విద్యలలో తాను ఏ విద్యయని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు?
ఆధ్యాత్మ విద్య.
పరశురామునికి భీష్ముడికి యుద్ధం ఎవరి వలన జరిగింది?
అంబ.
చిదంబరంలోని శివాలయం యొక్క గర్భాలయం పేరేమి?
చిత్సభ.
చిత్సభ పైకప్పు మీద విశేషంగా ఎన్ని పెంకులు ఉంటాయి?
26,000.
ఈ సంఖ్యకు ప్రాముఖ్యత ఏమిటి?
ఒకరోజులో మానవుడు జరిపే శ్వాస నిశ్వాసల సంఖ్య.
ఈ పెంకులకు ఎన్ని మేకులని చెబుతారు?
72,000.
ఈ సంఖ్యకు ప్రాముఖ్యత ఏమిటి?
నాడులు.
యుద్ధంలో గతించిన వానర వీరులను పునరుజ్జీవితులుగాను, అంగములను పోగొట్టుకున్నవారు మరల పోందే విధముగానూ చేయమని శ్రీరాముడు ఎవరిని వరమడిగాడు?
ఇంద్రుడు.
వానరుల విషయంలో శ్రీరాముడు అడిగిన రెండవ వరం ఏది?
వానరులు ఎక్కడున్నా పూలు, పండ్లు, నదీ జలములు అన్ని కాలములలో ఉండునట్లు.
దుర్యోధనునికి తగిలిన బాణాలను తేలిగ్గా తీసివేసేందుకు భీష్ముడు ఏ ఔషధినిచ్చెను?
విశల్యకరణి.
ఒక రోజులో ఎనిమిదో భాగాన్ని శాస్త్రాలు ఏమని చెబుతాయి?
కుతపం.
దేవాపి, వాహ్నీకుడు ఎవరి సోదరులు?
శాంతను.
ఎవరు తాకితే వృద్ధులు కూడా యౌవనాన్ని పొందేవారు?
శాంతను.
విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు - వీరిలో ఎవరు రాజు అయ్యారు?
విచిత్రవీర్యుడు.
'ఆపవుడు' అను పేరు ఏ మహర్షికి ఉంది?
వశిష్ఠుడు.
'నారాయణీయం' లో శ్రీకృష్ణునికి కుబ్జకు కలిగిన పుత్రుని పేరు ఏంటి?
ఉపశ్లోకుడు.
నారాయణీయం ఎవరు రచించారు?
నారయణ భట్టాద్రి.
ఇందులో ఎన్ని దశకాలు ఉన్నాయి?
వంద.
చాణూరునితో ఎవరు తలపడ్డారు?
శ్రీకృష్ణుడు.
బలరాముడు ఎవరితో తలపడ్డాడు?
ముష్టికుడు.
శస్త్ర శాస్త్రం ఏ వేదానికి చెందింది?
అధర్వవేదం.
స్ధాపత్య శాస్త్రం దేనికి సంబంధించింది?
శిల్పకళ.
కాత్యాయన శ్రౌత సూత్రం ఏ వేదానికి చెందింది?
కృష్ణయజుర్వేదం.
కంసుని వధ తరవాత రాజ్యాధికారం ఎవరికి వచ్చింది?
ఉగ్రసేనుడు.
ఉగ్రసేనుడు శ్రీకృష్ణునికి ఏమవుతాడు?
మాతామహుడు.
బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారం ఎవరు చేయించారు?
గర్గాచార్యులు.
బలరామకృష్ణులు ఎవరి దగ్గర విద్య అభ్యసించారు?
సాందీపుని.
ఇది ఏ ప్రాంతంలో జరిగింది?
ఉజ్జయిని.
సాందీపునికి గురుదక్షిణగా ఏమిచ్చారు?
గతంలో చనిపోయిన ఆయన పుత్రుని జీవింప చేశారు.
పాంచజన్యం అనే శంఖం ఎవరి కడుపులో దాగి ఉంది?
పంచజనుడు అనే రాక్షసుడు.
తిరుమల ఆలయంలో ప్రతిరోజూ రాత్రి నిర్వహించే ఏకాంతసేవ ఏ మూర్తికి జరుగుతుంది?
భోగశ్రీనివాస మూర్తికి.
ప్రతిరోజూ భోగశ్రీనివాసమూర్తికి జరిగే నిత్యాభిషేకం దేనితో జరుగుతుంది?
ఆకాశగంగా జలాలతో.
కొలువు శ్రీనివాసమూర్తికి ప్రతిరోజూ అర్చకులు ఏ వివరాలు నివేదిస్తారు?
శ్రీవారి ఆదాయ వివరాలను, హుండీరాబడులను.
మలయప్ప స్వామికి పూర్వం ఉత్సవాలలో ఏ మూర్తిని ఉపయోగించేవారు?
ఉగ్ర శ్రీనివాసమూర్తిని.
ప్రతిరోజూ తిధి, వార నక్షత్రాలతో కూడిన పంచాంగ వివరాలను ఏ మూర్తికి తెలియజేస్తారు?
కొలువు శ్రీనివాసమూర్తికి.
ఉగ్రశ్రీనివాసమూర్తిని సంవత్సరంలో ఏ రోజు ఆలయం బయటకు తీసుకు వస్తారు?
కార్తీక ద్వాదశి లేదా కైశిక ద్వాదశి.
స్వామివారి నిత్యకల్యాణోత్సవాలలో పాల్గొనే మూర్తి ఎవరు?
మలయప్పస్వామి.
ఆనంద నిలయం వెలుపల జరిగే అన్ని ఉత్సవాలలోనూ పాల్గొనే మూర్తి ఎవరు?
ఉత్సవ బేరం లేదా మలయప్పస్వామి.
ఆనంద నిలయంలోని ఇతర దేవతా మూర్తులు ఎవరు?
శ్రీసీతారామలక్ష్మణులు, రుక్మిణీ కృష్ణులు.
ఆనంద నిలయంలో బ్రహ్మదేవుడు వెలిగించినట్లుగా పేర్కొంటున్న దీపాలను ఏమంటారు?
బ్రహ్మ అఖండం.
వేదవ్యాసుడు మహాభారతాన్ని ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేశారని భారతం చెబుతుంది?
మూడు.
ఉపరిచర రాజుకు ఆ పేరు ఎలా వచ్చింది?
స్ఫటిక విమానంలో పైనే తిరగడం వల్ల.
యమునలోని ద్వీపంలో వదిలినందుకు వ్యాసునికి ఏ పేరు వచ్చింది?
ద్వైపాయనుడు.
గంగ, శంతనులకు ఎన్నో అంశంతో భీష్ముడు జన్మించాడు?
ఎనిమిది.
గాంధారి, శకుని ఏ శాస్త్రంలో నిపుణులు?
అర్ధశాస్త్రం.
నగ్నజిత్తు అనే రాజు శకుని తండ్రి అయిన ఏ రాజుగా జన్మించాడు?
సుబలుడు.
నగ్నజిత్తు పూర్వం ఎవరి శిష్యుడు?
ప్రహ్లాదుడు.
ఉద్ధవుడు ఎవరి శిష్యుడు?
బృహస్పతి.
గోపిక గీతానికి మరో పేరేమిటి?
భ్రమరగీతం.
జరాసంధుడు, కీచకుడు, దుర్యోధనుడు ఎవరి చేతిలో్ హతమయ్యారు?
భీముడి చేతిలో.
'అసతోమా సద్గమయ...' ఏ ఉపనిషత్‌లోనిది?
బృహదారణ్యక ఉపనిషత్.
మహర్షులలో తానెవరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలికాడు?
భృగు.
గంధర్వులలో తానెవరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పలికాడు?
చిత్రరధుడు.
శ్రీశైలానికి నాలుగు దిక్కులలో ద్వారములనబడే క్షేత్రాలు ఉన్నాయి. తూర్పున ఉన్న ద్వారం ఏ క్షేత్రం?
త్రిపురాంతకం.
'వేదార్ధ సంగ్రహం' ఎవరు రాశారు?
రామానుజులు.
దేవతలనుద్దేశించి త్యాగం చేసే ద్రవ్యాన్ని ఏమంటారు?
హవిస్సు.
వేదాలలో(సంహితలలో) ఋగ్వేదానికున్న స్థానం బ్రాహ్మములలో దేనికున్నది?
శతపధ.
ధేనుకాసురుని ఎవరు సంహరించారు?
బలరాముడు.
బలరామకృష్ణులను సంహరించేందుకు కంసుడు నియమించిన ఏనుగు పేరేమి?
కువలయాపీడం.
ఇంద్రుని రధసారధి ఎవరు?
మాతలి.
సోమయజ్ఞంలోని ఒకరోజును ఏమంటారు?
ఏకాహం.
వాల్మీకి రామాయణం ప్రకారం స్త్రీని బలాత్కరించిన రావణుని తల 7 చెక్కలగునని శపించినది నలకూబరుడు.
సుగ్రీవుని భార్య రుమ.
శిఖండి భార్య దశార్న.
శివుడు సృజించిన 'పంచకోశి' నగరం ఏమని పిలువబడుతున్నది?
కాశి(వారణాసి).
భరణి, పూర్వ ఫల్గుణి(పుబ్బ), పూర్వాషాఢ నక్షత్రాలు ఏ గ్రహానికి చెందినవి?
శుక్రుడు.
శుక్రుడు అనగా ఎవరు?
ఇంద్రుడు.
యజ్ఞకు, దక్షిణకు పుట్టిన 12 మంది కుమారుల్ని ఏమని పిలుస్తారు?
తుషిత దేవతలు.
రావణుని తండ్రి విశ్రపుడు.
జమదగ్ని భార్య పేరేమి?
రేణుక.
భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి జరుపుకుంటాము.
మనం ఏ మన్వంతరంలో ఉన్నాము?
వైవశ్వత.
బలిచక్రవర్తి వామనుడికి దానమిచ్చునపుడు ఎవరు అడ్డుపడ్డారు?
శుక్రాచార్యుడు.
నాలుగు పక్షులు జైమిని మహర్షికి బోధించుట ఏ పురాణంలో కనిపిస్తుంది?
మార్కండేయ.
కృష్ణద్వైపాయనుడికి ఆ పేరెందుకు వచ్చింది?
కృష్ణ - నల్లనివాడు, ద్వైపాయనుడు - ద్వీపం మీద జన్మించాడు.
శతానీకుడికి, సుమంతుడికి మధ్య సంవాదం ఏ పురాణంగా మనకు తెలుసును?
భవిష్యత్ పురాణం.
అశ్వనీకుమారులెంతమంది?
ఇద్దరు.
అశ్వని, మఖ, మూల నక్షత్రాలకు ఏ గ్రహం అధిపతి?
కేతువు.
శ్రావణ శుద్ధ పంచమి ఏ పంచమిగా ప్రసిద్ధి?
నాగపంచమి.
గుజరాత్ రాష్ట్రంలో ఉన్న జోతిర్లింగ క్షేత్రం ఏది?
సోమనాధ్.
ప్రధమ గురువు, పరమగురువు 'బ్రహ్మ' అని ఏ బ్రాహ్మణం చెబుతుంది?
వంశ బ్రాహ్మణం.
'నీలి' అనే ఔషధి తెల్ల బొల్లి మచ్చలకు, జుట్టు నెరవటానికి మందు అని ఏ బ్రాహ్మణం చెబుతుంది?
తైత్తరీయ బ్రాహ్మణం.
ఉద్దాలకునికి,శౌనకునికి మధ్య సంవాదం ఏ బ్రాహ్మణంలో కనిపిస్తుంది?
గోపధ బ్రాహ్మణం.
వరుణుడి పైన ఎక్కు పెట్టిన బాణాన్ని శ్రీరాముడు ఏ ప్రదేశం వైపు వదిలాడు?
దృమకుల్య.
ధ్యానంలో కూర్చుని ఊర్ధ్వలోకాలకు చేరిపోయిన ద్రోణుని పార్ధివ శరీరం నుంచి తలను నరికిన వారెవరు?
ధృష్టద్యుమ్నుడు.
శ్రీరాముని వృత్తాంతం భారతంలో ద్రణ పర్వంలోని అభిమన్యువధ పర్వంలో కనిపిస్తుంది.
తపతి' నది ఎవరికి కుమార్తెగా జన్మించింది?
సూర్యునికి, ఛాయాదేవికి.
యాజ్ఞవల్క్య మహర్షి భార్య పేరేమి?
మైత్రేయి.
నకుల సహదేవులు ఎవరి వరపుత్రులు?
అశ్వనీకుమారులు.
వరాహావతారంలో విష్ణువు ఎవరిని సంహరించెను?
హిరణ్యాక్షుడు.
ఏరోజు ఉపవాసం చేస్తే 1000 అశ్వమేధాల ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతాయి?
ఏకాదశి.
'కర్మసాక్షి' అంటే ఎవరు?
సూర్యుడు.
అగ్నిని వివాహమాడిన దక్షప్రజాపతి కుమార్తె ఎవరు?
స్వాహాదేవి.
రవి నుంచి ధ్రువ నక్షత్రం వరకు ఉన్న లోకం పేరేమిటి?
సువర్లోకం.
మాఘ చతుర్ధి ఏ చతుర్ధిగా ప్రసిద్ధి?
వరద చతుర్ధి.
సుందోపసుందుల వినాశంతో ముడిపడిన అప్సరస ఎవరు?
తిలోత్తమ.
యజ్ఞములలోని ప్రక్రియల వివరణము ఏ వేదభాగములో కనిపిస్తుంది?
బ్రాహ్మణములు.
సృష్టిలోని నీటిని యావత్తూ తనలో పెట్టుకుని ఆందోళన సృష్టించిన దైత్యుడు ఎవరు?
వృత్తాసురుడు.
సాంఖ్యశాస్త్రాన్ని మనకి ఎవరిచ్చారు?
కపిలుడు.
స్వామిమలై ఎవరి క్షేత్రము?
సుబ్రహ్మణ్య స్వామి.
పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు ఏ గ్రహం అధిపతి?
గురువు.
'సాధు, సత్యపరాక్రముడు' అను మాటలు ఎవరి గురించి మనం వింటాం?
శ్రీరాముడు.
'కిరీటి' ఎవరికి మరో పేరు?
అర్జునుడు.
తరాజు చిహ్నంతో కనిపించు రాశి ఏది?
తులారాశి.
బాణం ఆకారంలో ఉండే 3 నక్షత్రాలని మనం ఏమని పిలుస్తాము?
శ్రవణం.
కాశీలోని పంచగంగ ఘాట్‌లో ఏ అయిదు నదులు కలుస్తాయని ప్రతీతి?
గంగ, యమున, సరస్వతి, కిరణ, ధూరపాప.
అర్జునుని తప్ప పాండవులని ఒక్కరోజు యుద్ధంలో ముందుకు వెళ్ళకుండా ఆపగలిగే వరం శివుడు ఎవరికిచ్చాడు?
జయద్రధుడు (సైంధవుడు).
దృష్టద్యుమ్నుని వధించకుండా కవచాన్ని తీయనని ఎవరు ప్రతిజ్ఞ చేశారు?
అశ్వత్ధామ.
జరాసంధుడు మధురపై యవనునికి ముందు ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు?
17.
యవనుడు ఎవరివల్ల భస్మమయ్యాడు?
ముచికుందుడు.
ముచికుందుడు ఎవరి కుమారుడు?
మాంధాత.
రుక్మిణి తండ్రి ఎవరు?
భీష్మకుడు.
శ్రౌత సూత్రాలు, స్మార్త సూత్రాలను కలిపి ఏ సూత్రాలు అంటారు?
కల్పసూత్రాలు.
గృహ్యసూత్రాలు, ధర్మసూత్రాలను కలిపి ఏమంటారు?
స్మార్త సూత్రాలు.
ద్రాహ్యాయన గృహ్యసూత్రం ఏ వేదానికి చెందింది?
సామవేదం.
మానవ శుల్భసూత్రం ఏ వేదానికి చెందింది?
కృష్ణయజుర్వేదం.
భార్గవరార్ అనేది ఏ అళ్వారు మరో పేరు?
తిరుమలి సాయి అళ్వారు.
నమ్మాళ్వారు చిహ్నం ఏమిటి?
విష్వక్సేనుడు.
పట్టనాధన్ అని ఏ అళ్వారును పిలుస్తారు?
పెరియాళ్వారు.
శ్రీకాళహస్తి క్షేత్రంలో ప్రసిద్ధి చెందిన నయనారు ఎవరు?
కన్నప్ప నయనార్.
ఈయన మరో పేరు ఏమిటి?
ధీరన్.
పెరియ పురాణం మొదలు, చివర ఏ నయనారు గురించి చెబుతుంది?
సుందరమూర్తి నయనార్.
దర్శపూర్ణ మాస యాగాలు ఏ తిధులలో చేస్తారు?
అమావాస్య, పౌర్ణమి.
దక్షయజ్ఞ ధ్వంసం గురించి ఏ బ్రాహ్మణం పేర్కొంటుంది?
గోవధ బ్రాహ్మణం.
వనవాసమునకు పోవు ముందు సీతారాములు అయోధ్యలో ఎన్ని సంవత్సరములు కలిసి ఉన్నారు?
పన్నెండు.
సంపాతి, జటాయువు ఎవరి సంతానం?
అనూరుడు.
ఆంధ్రదేశం గురించి భీష్మునికి, కర్ణుడికి జరిగిన సంవాదం ద్వారా భారతంలోని ఏ పర్వంలో కనిపిస్తుంది?
ద్రోణపర్వం.
భగదత్తుడు ప్రయోగించిన వైష్ణవాస్త్రం శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి ఎలా మారినది?
వైజయంతిమాల.
రాక్షసరాజు అలంబషుని మహాభారత యుద్ధంలో ఎవరు సంహరించారు?
ఘటోత్కచుడు.
సేద్యం గురించి వేదాలలో ఎక్కడ వివరించారు?
తైత్తరీయ సంహిత.
విజ్ఞానాన్ని సంపాదించిన వారెవరైనా బ్రాహ్మణతుల్యునిగా గౌరవించుట గురించి చెప్పిన కవశోపాఖ్యానం ఏ బ్రాహ్మణంలో కనిపిస్తుంది?
ఐతరేయ బ్రాహ్మణం.
'ధీర సమీరే, యమునా తీరే...' అని సాగే అష్టపది ఎవరు రచించారు?
జయదేవుడు.
'శ్రీకర భాష్యం' రచించిన వారెవరు?
శ్రీపతి.
యజ్ఞయాగాలు చేసిన వారు ఏ మార్గంలో చంద్రమండలం చేరగలరని ఉపనిషత్తులు చెబుతున్నాయి?
దక్షిణమార్గం.
ఒక బలమైన గుఱ్ఱం ఒక పగలంతా పరుగెత్తితే ఎన్ని యోజనాలు వెళుతుందో ఆ దూరానికి వైదిక విధిలో ఏమని పేరు?
అశ్వీనం.
ఐతరేయ బ్రాహ్మణం ద్రవ్య యజ్ఞంతో ప్రారంభమయి ఏ యజ్ఞంతో పరిసమాప్తమవుతుంది?
జ్ఞానయజ్ఞం.
సకల కర్మలు జ్ఞానంతో పరిసమాప్తి పొందుతాయి అని ఎక్కడ చెప్పబడినది?
భగవద్గీత.
స్వామివారికి ప్రీతిపాత్రమైన వాహనం ఏమిటి?
గరుడ వాహనం.
శివుడు నివాసం ఉండేది ఎక్కడ?
కైలాస పర్వతం మీద
వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు ఎవరు?
జయ, విజయములు
యమలోకంలో పాప, పుణ్యాలు లెక్కబెట్టేవాని పేరేమిటి?
చిత్రగుప్తుడు
కోరిన కోరికలు తీర్చే దివ్య శక్తులు గల గోవు పేరేమిటి?
కామధేనువు
హాలాహలం తర్వాత క్షీరసాగర మధనం సమయంలో వెలువడినది ఏది?
కల్పవృక్షం
తూర్పు దిక్కును పాలించేది ఎవరు?
ఇంద్రుడు
సూర్యుని కుమార్తె పేరేమిటి?
తపతి
గరుడ పురాణాన్ని ఎవరు ఎవరకి ఉపదేశించారు?
శ్రీ మహావిష్ణువు గరుత్మంతునకు ఉపదేశించారు
త్రిలోకములు అంటే ఏమిటి?
స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళము లను త్రిలోకములు అంటారు
అర్జునుని ధనుస్సు పేరేమిటి?
గాండీవం
త్రిమూర్తులను పసి పాపలుగా మార్చిన పతివ్రత ఎవరు?
అనసూయ
కోరిన కోరికలు తీర్చే చెట్టు పేరేమిటి?
కల్పవృక్షం
రావాణాసురుడు తనను అపహరించి తీసుకుని వెడుతున్నప్పుడు సీతాదేవి తన నగలను ఎక్కడ జారవిడిచింది?
ఋష్యమూకం అనే పర్వతం మీద
భౌతిక విజ్ఞానాన్ని తెలిపే శాస్త్రం ఏ వేదంలో ఉంది?
అధర్వణ వేదం
కైకేయి దగ్గర ఉండే ప్రధాన దాసి పేరేమిటి?
వంధర
ఏక చక్రరధారూఢుడు అని ఎవరిని అంటారు?
సూర్యుడిని
యమునా నదికి మరోపేరు ఏమిటి?
కాళింద కన్య
శమిచెట్టు అని దేనిని అంటారు?
జమ్మిచెట్టు
సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి చేరడాన్ని ఏమని పిలుస్తారు?
సంక్రమణం
రధ సప్తమి ఏ రోజు జరుపుకుంటారు?
మాఘ శుద్దసప్తమినాడు
పురుషార్ధములు ఎన్ని? అవి ఏవి?
పురుషార్ధములు 4. అవి 1.ధర్మము 2. అర్ధము 3. కామము 4. మోక్షము
యుధిష్టరుడు అంటే ఎవరు?
ధర్మరాజు
ఉపనిషత్తులు ఎన్ని?
108
మహాభారత యుద్ధంలో ఎన్ని అక్షౌహిణుల సైన్యం పాల్గొంది?
18 అక్షౌహిణులు
పాండవ మధ్యముడు ఎవరు?
అర్జునుడు
ఉపరిచర రాజుకు ఆ పేరు ఎలా వచ్చింది?
స్ఫటిక విమానంలో పైనే తిరగడం వల్ల.
యమునలోని ద్వీపంలో వదిలినందుకు వ్యాసునికి ఏ పేరు వచ్చింది?
ద్వైపాయనుడు.
గంగ, శంతనులకు ఎన్నో అంశంతో భీష్ముడు జన్మించాడు?
ఎనిమిది.
గాంధారి, శకుని ఏ శాస్త్రంలో నిపుణులు?
అర్ధశాస్త్రం.
నగ్నజిత్తు అనే రాజు శకుని తండ్రి అయిన ఏ రాజుగా జన్మించాడు?
సుబలుడు.
సవ్యసాచి అని ఎవరిని పిలుస్తారు?
అర్జునుడిని
బాణాసురుని కూతురు పేరేమిటి?
ఉష
అగ్నిదేవుని భార్య ఎవరు?
స్వాహాదేవి
అష్టావకృని తల్లి పేరేమిటి?
సుజాత
శ్రీ రాముని నమ్మిన బంటు ఎవరు?
ఆంజనేయుడు
తక్షకుడు ఎవరు?
సర్పరాజు
ద్వివిధ అక్షరాలు అని వేనిని అంటారు?
అచ్చులు, హల్లులు
త్రివిధ సుందర పురములు ఏవి?
1. బ్రహ్మపురము 2. విష్ణుపురము 3. శివపురము
చతుర్విధ స్వభావములు ఏవి?
1. బ్రాహ్మణ స్వభావము 2. క్షత్రియ స్వభావము 3. వైశ్య స్వభావము 4. శూద్ర స్వభావము
మత్స్యపురాణాంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
14,000 శ్లోకాలు
పరీక్షిత్తుని కొడుకు?
జనమేజయుడు.
శమీక ముని కుమారుడు?
శృంగి.
ధృవుని భార్యలు?
భ్రమ మరియు ఇల.
కురుక్షేత్రము అనగా?
కురురాజు దున్నిన ప్రాంతము.
హిరణ్యకశిపుని భార్య?
లీలావతి.
పరశు రాముని తల్లితండ్రులు?
జమదగ్ని, రేణుక
భీష్ముని తండ్రి?
శంతన మహారాజు
ద్రోణుని సంహరించినవాడు?
దృష్టద్యుమ్నుడు
విరాటుని కొలువులో ఏ పేరుతో ధర్మరాజు ఆశ్రయం పొందాడు?
కంకుభట్టు
బలి చక్రవర్తి భార్య?
వింధ్యావళి
ద్రోణుడి తండ్రి పేరు?
భరద్వాజుడు
అర్జునుని శంఖం పేరు?
దేవదత్తం
కర్ణుడి కొడుకులను చంపినవాడు?
నకులుడు
శ్రీ కృష్ణుని అష్టభార్యల పేర్లు - రుక్మిణీ, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, భద్రాదేవి, నాగ్నజితి, లక్షణ. శ్రీ కృష్ణుని కుమారులు - ప్రద్యుమ్నుడు, సాంబుడు.
శ్రీ రాముడు పర్ణశాల నిర్మించుకున్న ప్రాంతంపేరు?
పంచవటి
వ్యాసుడి అసలు పేరు?
కృష్ణ ద్వైపాయనుడు
ఘటోత్కచుని కొడుకు పేరు?
అంజనపర్వుడు
రావణాసురుని తల్లి పేరు?
కైకసి
శ్రీకృష్ణుని మేనమామ?
కంసుడు
ఇంద్రజిత్తు మరోపేరు?
మేఘనాధుడు
కురువంశ రాజులు?
కౌరవులు
పార్వతి అవతారాలలో ఒకటి?
కాళి
సప్తమహర్షుల్లో ఒకరు?
వశిష్టుడు
జాంబవతి, శ్రీకృష్ణుల కుమారుడు ఎవరు?
సాంబుడు
ఏకదంతుడు ఎవరు?
వినాయకుడు
భద్రకాళి అంటే ఎవరు?
పార్వతీదేవి
వశిష్టుని భార్య పేరేమి?
అరుంధతి
ఏకచక్రాధిపత్యము అంటే ఏమిటి?
సర్వాధికారము
పారిజాతాపహరణం కావ్యాన్ని రచించింది ఎవరు?
నంది తిమ్మన
రామ, రావణ యుద్ధానికి ముహూర్తం పెట్టింది?
రావణుడు
భక్త రామదాసు అసలు పేరు?
కంచర్ల గోపన్న
లక్ష్మణుడి మరో పేరు?
సౌమిత్రి
ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడికి ఉపదేశించిన వారు అగస్త్యుడు.
దుర్యోధనుని సోదరి పేరు దుశ్శల.
హనుమంతుడు లక్ష్మణుని ప్రాణాలు కాపాడటానికి తెచ్చిన పర్వతం పేరు సంజీవిని పర్వతం.
కర్ణుడు జన్మించటానికి కుంతిదేవికి వరమిచ్చింది సూర్యుడు.
మహాభారతంలో కవచకుండలాలతో పుట్టినది ఎవరు?
కర్ణుడు
రాముని వనవాసం పేరు పంచవటి.
రామాయణంలో మారీచుడు బంగారు జింకగా మాయారూపం దాల్చాడు.
బుద్దుడు జన్మస్థలం లుంబిని వనం
మన్మథుని భార్య పేరు రతీ దేవి
శ్రీ కృష్ణుని పెద్ద భార్య పేరేమి?
రుక్మిణి దేవి
శ్రీకృష్ణుడి తండ్రి పేరేమి?
వసుదేవుడు
జమదగ్ని కుమారుని పేరేమి?
పరశురాముడు
శ్రీ మహావిష్ణువు శంఖం?
పాంచజన్యం
అర్జునుడు శివుని గూర్చి తపస్సు చేసి పొందిన అస్త్రం పాశుపతాస్త్రం.
శ్రీ కృష్ణుని అన్న పేరు బలరాముడు.
యమునా నదీ తీరాన మథురలో ఉన్న వనం బృందావనం
నహుషుడు పుత్రుడు యయాతి. యతి సోదరుడు యయాతి. పద్మ పురాణంలో అద్వైతం గురించి యయాతి ఇంద్రుని రధసారథి అయిన మాతల్లితో చర్చించినట్టు చెప్పబడింది.
కుబేరుని భార్య వృద్ధి.
ముద్గల పురాణంలో గణేశుని లంబోదరుడు పేరుతో పిలిచారు.
కంసుని భార్య ఆస్తి.
అశ్వత్థామ తల్లి కృపి.
'రహస్య త్రయ సారం'evaru రచించారు?
వేదాంత దేశినన్.
బుధుడు చంద్రుడు కుమారుడు.
చ్యవనునికి యౌవనమిచ్చిన దేవతలు అశ్వనీదేవతలు.
దేవకుని చివరి కుమార్తె పేరేమిటి?
దేవకి.
ఉగ్రసేనునికి కుమారులెందరు?
పది.
కంసుడు ఎన్నో కుమారుడు?
పెద్ద కుమారుడు
వసుదేవుని అయిదుగురు చెల్లెళ్లలో పెద్ద ఎవరు?
కుంతి.
'కాలము ఎవరినీ నరకదు. అది కెవలం అన్ని విషయాలలోనూ మనిషి బుద్ధిని తప్పు దారికి మళ్లిస్తుంది' అని భారతంలో ఎవరు పలికారు?
సంజయుడు.
భానుకోపుడు ఎవరు?
కార్తికేయునితో యుద్ధం చేసిన రాక్షసుడు.
శ్రీకృష్ణుని భార్య సుప్రభ నివాసం పేరు పద్మకూటం.
కుంభకర్ణునితో యుద్ధం చేసిన వానర ప్రముఖుదెవరు?
చండబలుడు.
నిశుంభుడుని దుర్గ దేవి చిన్నమస్త రూపంలో సంహరించింది.
వ్యాసుడు సుద్యుమ్నుని వృత్తాంతం ఎవరికి చెప్పాడు?
ధర్మరాజు.
సుద్యుమ్నుని వృత్తాంతం ఏ సంధర్భంలో చెప్పాడు?
దండ ధర్మ పాలనం.
దక్షిణ భారతదేశంలోని తాళవనాన్ని భారతంలో ఎవరు జయించాడు?
సహదేవుడు.
నారదుని రూపం వానరునిలా కనబడుతుందని తనని ఎవరు శపించారు?
పర్వతుడు.
నారదుడు పర్వతుని ఏమని శపించాడు?
స్వర్గలోకంలో సంచరించలేవని.
అత్రి మహర్షి బ్రహ్మ మానసపుత్రుడు.
సప్త ఋషుల్లో ఒక్కరైనా అత్రి మహర్షి భార్య అనసూయ.
మణిమానుడనే రాక్షసుణ్ణి భీముడు వధించాడు.
కాలకంజుని, పౌలోముని ఎవరు వధించారు?
అర్జునుడు.
వీరు ఏ ప్రాంతం వారు?
హిరణ్యపురం.
దివ్యాస్త్రాల్ని ప్రదర్శించకూడదని అర్జునునికి చెప్పి వారించిందెవరు?
నారదుడు.
పురాణాల ప్రకారం ఖడ్గాన్ని ప్రప్రథమంగా ఎవరు ఉపయోగించారు?
శివుడు.
ఖడ్గం ఎనిమిది నామాలను స్మరించిన వారికి ఏ ఫలం కల్గుతుంది?
యుద్ధంలో విజయం.
తడిగా ఉన్న పాదాలతో నిద్రించకూడదని ఏ కావ్యం చెబుతుంది?
మహాభారతం.
ఆనుస్మృతిని నారాయణుడు ఉపదేశించారు. నారాయణుడు అనుస్మృతిని నారదునికి ఉపదేశించారు.
"కన్నులున్నవాడు, అలాగే అంధుడైనవాడు తన భర్త కావాలని కోరికున్న దేవలుడు కుమార్తె సువర్చల శ్వేతకేతుని వివాహమాడింది.
క్షత్రియునికి యుద్ధమే యజ్ఞమని భారతంలో వ్యాసుడు శుకదేవునికి చెప్పారు.
శివ సహస్రనామ స్తోత్రాన్ని తొలుత దక్షుడు పాఠించారు.
కృస్ణద్వైపాయనుడు అని ఎవరిని అంటారు?
వ్యాసుని
వ్యాసుని తల్లిదండ్రులు పరాశరుడు, సత్యవతి. ముత్తాత వశిష్ఠుడు, పితామహుడు శక్తి. వ్యాసుని కుమారుడు శుకుడు.
అంబ, అంబిక, అంబాలికలు కాశీరాజు కుమార్తెలు. వ్యాసుని వరం కారణంగా అంబికకు ధ్రుతరాష్ట్రుడు జన్మిచారు. అంబాలికకు పాండురాజు జన్మించారు.
భారతానికి ఉన్న మరో పేరు జయకావ్యం.
భారత యుద్ధం 18 రోజులు జరిగింది. ఈ యుద్ధంలో 18 అక్షౌహిణీల సైన్యం ఉంది.
కేశిని ఎవరి భార్య?
సగరుడు.
ఎవరి వరం పొంది ఆమె ఒక పుత్రుని పొందింది?
ఔర్యుడు.
వజ్రుడు ఎవరి పుత్రుడు?
అనిరుద్ద్హుడు.
బభ్రువాహనుని తల్లిదండ్రులు ఎవరు?
చిత్రాంగద, అర్జునుడు.
ధర్మరాజు రథసారధి పేరేమి?
ఇంద్రసేనుడు.
జయంతి ఎవరి కుమార్తె?
ఇంద్రుడు.
పరీక్షిత్తు పెద్దకొడుకు ఎవరు?
జనమేజయుడు.
భాగవతంలోని ప్రధమ స్కంధం లో శ్రీకృష్ణుని 39 కళ్యాణ గుణాలను చెప్పారు.
.
ధారణ అనగానేమి?
చిత్తస్థిరీకరణము.
వైష్ణవ తంత్రానుసారం మేధావి అను ఋషి చిత్తశుద్ధికై విష్ణుసహస్రనామముల లోని ఏ నామాన్ని జపించాడు?
ఓం సాక్షిణేనమ:.
విష్టుపురాణం మైత్రేయునికి, ఎవరికి మద్య సంవాదంతో ప్రారంభమవుతుంది?
పరాశరుడు.
మేరు పర్వతానికి ఉత్తరానికి ఉన్న పర్వతం పేరేంటి?
సుపార్శ్వ.
ఇంద్రద్యుమ్నుని కథ ఏ పురాణంలో కనిపిస్తుంది?
కూర్మ పురాణం.
కూర్మ పురాణం శివుని ఎన్ని అవతారాలను పేర్కొంటుంది?
ఇరవైఎనిమిది.
ఏ పురాణాన్ని వినాలని అనుకున్నా ఒకరోజు చేసిన పాపం తొలగిపోతుంది?
అగ్ని పురాణం.
అహోబిల క్షేత్రం మరో పేరు సింగవేల్‌కుండ్రం.
.
ముక్తినాథ్ క్షేత్రం గండకి నది ఒడ్డున ఉంది.
ముక్తినాథ్ క్షేత్రం నేపాల్ దేశంలో ఉంది.
.
మహాభారత యుద్దంలోని తొమ్మిదవరోజున భీష్ముడు సర్వతోభద్ర వ్యూహం రచించాడు. సర్వతోభద్ర బదులుగా పాండవులు మహావ్యూహం రచించారు.
కౌరవుల పక్షాన మండల వ్యూహాన్ని భీష్ముడు రచించారు. దీనికి సమాధానంగా యుధిష్ఠిరుడు వజ్రవ్యూహం రచించాడు.
ఛందోబద్ధమైన మంత్రాలను ఏమంటారు?
ఋక్కులు.
గద్యాత్మకములగు మంత్రాలను ఏమంటారు?
యజుస్సులు.
గీతాత్మకములగు మంత్రాలను ఏమంటారు?
సామములు
నలుని పాకశాలలో స్వాదిష్టమైన భోజనం దొరకగలదని యముడు వరమిచ్చారు. కోరినప్పుడు జలం దొరుకుతుందని నలునికి వరుణుడు వరమిచ్చారు. నలుడు దావానలం నుండి కర్కోటక నాగుని రక్షించాడు. నలుడు ఋతుపర్ణ రాజు దగ్గర అశ్వాధ్యక్షుడుగా పని చేశాడు. అశ్వాధ్యక్షునిగా ఉన్న నలునికి సేవకులు వార్ష్ణేయుడు, జీవలుడు.
.
స్వాయంభువాంతరంలో దేవతలు ఎవరు?
తుషితులు.
అత్రి ఏ పర్వతం మీద తపస్సు చేశాడు?
ఋక్ష పర్వతం.
నారదుడు ప్రాచీనబర్హికి చెప్పిన ఉపఖ్యానం పేరేమిటి?
పురంజనోపఖ్యానం.
ద్రౌపదీ స్వయంవరం తరువాత కర్ణుని, శల్యుని ఎవరు ఓడించారు?
భీముడు, అర్జునుడు.
ఏడుగురు ఋషులతో వివాహం చేసుకున్న గౌతమ గోత్రురాలైన కన్య ఎవరు?
జటిల.
పది మంది ప్రచేతసులను వివాహమాడిన కన్య ఎవరు?
వాక్షీ
వాక్షీ ఎవరి కుమార్తె?
కండు ముని.
సుందుడు, ఉపసుందుడు ఎవరి పుత్రులు?
నికుంభుడు.
నికుంభుడు ఎవరి వంశం వాడు?
హిరణ్యకశిపుడు.
వీరి తపస్సు వల్ల ఏ పర్వతం నుంచి పొగలు వచ్చాయి?
వింధ్య పర్వతం.
వీరికి ఎవరు ప్రత్యక్షమయ్యారు?
బ్రహ్మ.
వీరు ఏ వరం పొందారు?
వారిరువురు తప్ప ఎవరి చేతిలోనూ మృత్యువు లేకపోవడం
వీరి దగ్గరకు ఏ అప్సరసను పంపారు?
తిలోత్తమ.
సోపాన సంగీతం ఏ ప్రాంతానికి చెందినది?
కేరళ.
'భావయామి రఘురామం...' అంటూ సాగే కృతి ఎవరు రచించారు?
స్వాతి తిరుణాల్.
శృతుల మీద ఆధారపడ్డ కల్ప సూత్రాలను ఏమంటారు?
శ్రౌత సూత్రములు.
జైమినీయ శ్రౌత సూత్రం ఏ వేదానికి చెందింది?
సామవేదం
బౌధాయన శ్రౌత సూత్రం ఏ వేదానికి చెందింది?
కృష్ణయజుర్వేదం
స్మృతుల మీద ఆధారపడ్డ సూత్రాలను ఏమంటారు?
స్మార్త సూత్రాలు
మాల్యవాన్, సుమాలి, మాలి అను రాక్షసులు ఎవరి సంతానం?
సుకేశుడు.
సుమాలి పతి పేరు ?
కేతుమతి.
శతానీకుడు ఎవరి సోదరుడు?
విరాటరాజు.
శతానీకుడు ఎవరి ద్వారా వధింపబడ్డాడు?
శల్యుడు.
వరుణుడి సభ (నివాసస్థానం) ఏ రంగులో ఉంటుంది?
శ్వేతవర్ణం.
భగదత్తుడు, కిన్నరుల రాజు దృముడు ఎవరి సభలో కూర్చుంటారు?
కుబేరుడు.
భారతంలో 'అజాతశత్రువు' అని ఎవరికి పేరు వచ్చింది?
యుధిష్ఠిరుడు.
భీముడు, అర్జునుడు నా రెండు నేత్రాలు, శ్రీకృష్ణుడు నా మనస్సు అని భారతంలో ఎవరు పలికారు?
యుధిష్టిరుడు.
బృహద్రథునికి ఎవరి వరం వల్ల జరాసంధుడు జన్మించాడు?
చండకౌశికముని.
జరాసంధుడు రెండు ముక్కలుగా ఎలా జన్మించాడు?
కవలలైన ఇద్దరు తల్లులు మామిడి పండును రెండుగా కోసి తినడం వల్ల.
విసరివేయబడ్డ రెండు ముక్కలను ఏ రాక్షసి కలిపింది?
జర.
జర అనే ఆ రాక్షసిని ఏ పేరుతో బ్రహ్మ సృష్టించాడు?
గృహదేవి.
జర ఆ బాలకుని రాజుకు ఎందుకు ఇచ్చేసింది?
ఆమెకు రాజమందిరంలో సదా పూజలు జరుగుతూ ఉండేవి.
జరాసంధుని మంత్రుల పేర్లు ఏమిటి?
హంసుడు, డింభకుడు.
భాగవతంలోని ద్వితీయ స్కంధం సప్తమాధ్యాయంలో ఎన్ని అవతారముల గురించి చెప్పబడింది?
ఇరవైనాలుగు.
విష్ణు సహస్రనామాల్లోని ఏ మంత్రాన్ని పరశురాముడు పాప నివృత్తికై జపించాడని శైవాగమం చెబుతుంది?
ఓం కేశవాయనమః.
శైవాగమము అనుసారము విష్ణు సహస్రనామాల్లోని ఏ మంత్రాన్ని పరాశరుడు సర్వశాస్త్ర పారంగత్వమునకు జపించాడు?
ఓం పురుషోత్తమాయ నమః.
ఎవరి దర్శనం తరువాత దివ్యాస్త్రాలను ఇస్తానని ఇంద్రుడు అర్జునునితో పలికాడు?
శివుడు.
మూకాసురుడు అనే రాక్షసుడు ఏ రూపాన్ని ధరించి అర్జునుని వధించాలని యోచించాడు?
వరాహం.
ఆ రాక్షసుని ఏ ఇద్దరూ ఒకేసారి వధించారు?
శివుడు, అర్జునుడు.
ఇంద్రలోకంలో అర్జునుడు నృత్యం, సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?
చిత్రసేనుడు.
చిత్రసేనుడు ఎవరి మిత్రుడు?
ఇంద్రుడు.
ఊర్వశిని అర్జునుడు తిరస్కరించిన చరిత్ర వినిన వారికి ఏం లాభమని మహాభారతం చెబుతుంది?
విషయభోగములయందు వాంఛ ఉండదు.
శ్రీశుకుని వయసు శ్రీమద్భాగవతంలో ఎన్ని సంవత్సరాలని చెప్పబడింది?
పదహారు.
విష్ణురాతుడనగా ఎవరు?
పరీక్షిత్తు.
విశాల అనేది ఏ క్షేత్రానికి మరో పేరు?
బదరీ క్షేత్రం.
హరిద్వారానికి ఏ పురి అని పేరు?
మాయాపురి.
భాగవత లక్షణం ఏ పురాణంలో ఉంది?
గరుడ పురాణం.
ఉద్ధవుడు ఎవరికి శిష్యుడు?
బృహస్పతి.
సాటివారిలో శ్రేష్ఠతను పొందడానికి ఉద్దాలకుడు విష్ణు సహస్త్రనామాలలోని ఏ మంత్రాన్ని జపించాడు?
ఓం పరమాత్మనే నమః.
ఈ మంత్రాన్ని జపించమని ఉద్దాలకునికి ఎవరు చెప్పారు?
భృగు మహర్షి.
భీముడు ఏ వనంలో కిర్మీరుడనే రాక్షసుణ్ణి సంహరించాడు?
కామ్యకవనం.
కిర్మీరుడు ఎవరి సోదరుడు?
బకాసురుడు.