Type Anything.., You Get World Wide Search Results Here. !

వాక్ శక్తి ౹౹ ఆరు లక్షణాలు - ౹౹ six characteristics of speech power.

 అసలు మాటలంటే ఏమిటి ? 

౹౹ వాక్ శక్తి ౹౹ ఆరు లక్షణాలు

ప్రపంచం లో మాట్లాడే ప్రాణి మనిషి ఒక్కడే.

మాటలకుండే శక్తి తోటే ఈ మానవుడనే జంతువు సువిశాల సమాజాన్ని నిర్మాణం చేసుకోగలిగాడు.

తోటి ప్రాణి కోటి ఫై ఆధిపత్యాన్ని సంపాదించాడు.

ప్రకృతి లోదాగి వుండే ఎన్నో రహస్యాలని మాటల సహయంతోటే అందరు వినియోగించుకో గలిగేతట్లు చేస్తున్నాడు .


మాటలంటే మాటలతో అయ్యేపని కాదు సుమా!

మాటల్ని మల్లెపువ్వుల్ల విరజిమ్మేవారున్నారు.

తూటాల్లా పేల్చే వారున్నారు ,

ఈటేల్ల చేసి పోదిచేవారున్నారు.

మాటల్ని కోటల్లా కట్టి ఎన్నో రహస్యాలు దాచేవారున్నారు.

మాటలను తాటికాయలంత చూపి తీరా పనిలోకి వట్చేసరికి సారం ఏమిలేకుండా నాటకాలాడేవారున్నారు.


మరి ఇందులో ....... మనమెందులో ? ? ?


అసలు మాటలంటే ఏమిటి ?


"మనస్సుని ఎదుటివ్యక్తి గ్రహించగలిగే భాషలో సూటిగా నిరాడంబరంగా ఆవిష్కరించే శబ్దాల మూట " శాస్త్రాల్లో " సమగ్రమైన అర్ధాన్నిచ్చే కొన్ని శబ్దాల కూర్పే మాట " అని నిర్వచిస్తారు.


ప్రాంతాలను బట్టి భాషలు వేరువేరుగా ఏర్పడి వున్దవత్చును.


 కానీ భావాన్ని వ్యక్తం చేసే పద్దతి మారదు.


మాటల్లో తొనకిసలాడే భావం ఎట్లాంటిది కావాలి ?

అనేదానికి అనుభవజ్ఞులైన పెద్దలు ఆరు లక్షణాలు చెప్పారు.


అవి


1. మాట సత్యమును దాటకూడదు. (సత్యం)

2. ఎదుటివానికి మేలు చేసేదిగా వుండాలి. (హితం)

3. వినసొంపుగా వుండాలి (ప్రియం )

4. మధురముగా వుండాలి. (మధురం)

5. పనికట్టుకు చాడీలు పలకరాదు (అసూచకత)

6. ఎంత మెచ్చిన మాట మితంగా వుండాలి. (మితం)


ఈ ఆరు లక్షణాలని ఒక క్రమం లో మనం అలవాటు చేసుకో గలిగితే లోకం లో మనకు శత్రువులీ వుండరు.

ఒంటరిగా హనుమంతుడు లంకకు వెళ్లి లంకకు వెళ్లి కార్యాన్ని సాధించుకు రాగలిగాడంటే ఇలాంటి వాక్ శక్తి వల్లనే .


ఎక్కడో తన రాజ్యం లో బయలుదేరిన రాముడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి తన కార్యం చేసుకు రాగాలిగాడన్నా

మధ్యేమార్గం వుండే ఎన్నోజాతులవారు, జంతువులు, వీరు, వారు, అనక అందరు శ్రీరామున్ని తమవాడిగా ప్రేమిన్చాగాలిగారన్న రాముడిలో వుండే ఈ పై ఆరు లక్షణాలు నింపుకున్న మాటతీరే కారణం. పై ఆరింటిలో


1. "సత్యం భూతహితం ప్రోక్తం" అని నిర్వచనము. చూసినది చూసినట్లు కుండ బ్రద్దలు కొట్టినట్లు కాకుండా ,ఎప్పుడు,

ఎవరివద్ద, ఎంతవరకు, ఏమిపలుకవచ్చునో తెలిసి పలకడం.


2. "హితం." అంటే శ్రేయస్సు కలిగేటట్లు పలకడం. మనం చెప్పేది సరియైనదే అయినా కొన్ని కొన్ని ఎదుటివారికి

నచ్చవు. "అయినా వాడు విననప్పుడు నాకెందుకు లెద్దూ . . .చెప్పి నేనెందుకు చెడ్డవాడిని కావాలి ? నా

మంచితనమేదో వాడితో నాకుంటే చాలు" అనుకుంటూ సర్డుకుపోకూడదు. పసివాడు పామును పట్టుకున్తుంటే

నయాన్నో , భయాన్నో,కసిరో చివరకు కొట్టి అయినా ఆ పని నుండి వాణ్ని తప్పించే ప్రయత్నం చేసినట్లు

చేతనైనంతవరకు మంచి మార్గంలో ఎదుటివాణ్ని పెట్టె ప్రయత్నాన్ని హితం అంటారు.


3. "ప్రియం" అనగా అందరికి నచ్చేట్లు పలకడం . లోకంలో మననుంచి పనినో , ప్రయోజనాన్నో ఆసించేవాళ్ళు ఎన్నో

తీపి కబుర్లు ఆడుతుంటారు. అవి వింటుటే వీళ్ళే మనకి సర్వరక్షకులు అన్నట్లు అనిపిస్తారు . మనలో చెడును

కూడా మనకి మంచి అనిపించేటట్లు తమ వాక్చాతుర్యంతో నిరూపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళని

కాకరాయుల్లంటారు . నిజానికి హితోక్తులకంటే ఇలా పలికే మాటలే ఎక్కువగా నచ్చుతు ఉంటాయి.

లోకులు ఇలాంటివాటికే ఎక్కువగా అలవాటు పడి వుంటారు. అందుకే మంచినే చెపుతున్నా , వినేవారి

మనస్సుకి నచ్చేటట్లు వినసొంపుగా వుండాలి. అయితే వినసొంపుగా వుండాలి కదా అంటూ లేని పోనీ కాళ్ళ బొల్లి

మాటలు పలకరాడు. పాపం! కాకారాయుళ్ళ మాటలు వినే రావణా సురుడు నాశనమైపోయాడు.


4. ఒక్కొక్క వ్యక్తి యొక్క మాటలు ఇష్టమైతే . అందులో సారం లేకపొయిన వింటుంటారు . దానిని ప్రియం

అంటారు. పలుకులు పై పై అనడంతో పాటు లోపలి విషయ గాంభీర్యం కూడా వున్నప్పుడు అది 'మధురం'

అవుతుంది. మన మాటలు మధురంగా ఉండేటట్లు అభ్యసించాలి.


5. కొందరికి అందరి చుట్టూ తిరుగుతూ వారికిష్టమున్న లేకున్నా మరొకరి కన్నాలు వెతకడం, నేరాలు మోపడం

వంటివి చాలా ఇష్టం . అసలవి లేకపోతె వారికి పొద్దే గడవదు. వీళ్ళని 'రంధ్రన్వేషణపరులు' అంటారు. ఇలాంటి

నీచులను పాములతో పోల్చుతారు.

అవేచ ! బాల భుజంగస్య విచిత్రం హి వధక్రమ: |

అన్యస్య కర్ణం దసతి ప్రాణైరన్యో వియుజ్యతే ||

సాటివారి చెవులు కొరికే నీచుడనే పాము ఆశ్చర్యకరంగా చంపుతుంది. ఒకళ్ళ చెవిని కాటేస్తుంది. మరొకరి ప్రాణం

తీస్తుంది. అల చాడీలు చెప్పడము, మాటలు చేరవేయడము వంటివి చేస్తూ ఎదుటి వారి చెవులు కొరికే వాళ్ళను

సూచకులు అంటారు. వాళ్ళంత అపవిత్రులు మరిలేరు అంటుంది ధర్మ శాస్త్రం . ఒకరిలో లోపాలు తెలిసిన ,

కనిపించిన అవి ఎందుకు ఏర్పడ్డాయో తెలిసేవరకు మౌనం వహించాలే తప్ప , పనికట్టుకుని చాడిలకు దిగరాదు.

అయితే ఎవరైనా వత్చి అడిగినప్పుడు మాత్రం తనకు తెలిసినంత వరకు దాపరికం లేకుండా చెప్పడం దోషం కాదు.


6. మితము అంటే పొదుపుగా అవసరమైనంత అని అర్ధము. మాట్లాడే కొద్దీ మనిషిలో శక్తీ క్షీణించిపోతుంది.

అందుకే ఎందరు మెచ్చుకుంటున్నా . . . మనం చెప్పేది మంచిదే అయినా అవసరానికి తగినంతగా మాత్రమె ,

కుదించుకుని, అవసరమైన పదాలను పొందికగా అమర్చుకుని సంక్షిప్తంగా మధురంగా మాట్లాడాలి.

మాట్లాడే విషయంలో ధర్మశాస్త్రం ఏమి చెప్పిందో చూడండి.


శ్లో || సత్యం బ్రూయాత్ , ప్రియం బ్రూయాత్ , నబ్రూయాత్ సత్యమప్రియం,

ప్రియంచ నానృతం బ్రూయాత్ , ఏష ధర్మ స్సనాతన: ||


మంచి మాట చెపితే వినడము ఎంత కష్టమో విభీషణుడు చెప్పాడు రావణునికి :


శ్లో || సులభ: పురుష: రాజన్ సతతం ప్రియవాదిన: ,

అప్రియస్య చ పద్యస్య వక్త శ్రోతా చ దుర్లభ: ||


" ఓ రాజ ! మనకి నచ్చినట్లు మాట్లాదేవారెందరో సులభంగా చుట్టూ తిరుగుతూనే వుంటారు. మనకి మంచి

కలిగించే మాటలు చెప్పేవాడు దొరకడం కష్టం . ఎందుకంటే అది మనకి వినడానికి చేదుగా వుంటుంది.

నచ్చకపోయినా హితమును కలిగించునది "పధ్యము" అంటారు.


- స్వస్తీ... 



Top

BOTTOM