Type Anything.., You Get World Wide Search Results Here. !

దీపాలలో రకాలు - Types of lamps (Deepalu)

 దీపాలలో రకాలు

దీపలక్ష్మీ నమోస్తుతే

దీపం  లక్ష్మిదేవి అంశ. 

దీపం వెలిగించగానే 

'దీప లక్ష్మీ నమో నమః'  అని పఠిస్తూ 

నమస్కరించాలని దీపాలలో రకాలను వివరిస్తూ 

ఆగమశాస్త్రాలు తెలియజేస్తున్నాయి.



🪔 చిత్రదీపం..

రంగు రంగుల

 పొడులతో ముగ్గులు  పెట్టి ఆముగ్గు మీద పెట్టే దీపం.


🪔 మాలా దీపం..

అంతస్థులుగా వుండే దీపపు పళ్ళేలలో వెలిగించే దీపాలు.


🪔 ఆకాశ దీపం..

గృహానికి వెలుపల ఎత్తుగా, లేక  మిద్దెల మీద ఎత్తు గా పెట్టే దీపాలు. దీపాలను  యిలా వెలిగించి పెడితే

 భయాలు తొలగిపోతాయని అంటారు. 


🪔 జల దీపం..

నదులలో దీపాలను వెలిగించి వదలడం జలదీపం అంటారు.


🪔 పడవ దీపం..

నదీ తీరాలలో అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు.  పడవలా వెళ్ళే యీ దీపమే నౌకా దీపం  అని అంటారు. 


🪔 సర్వ దీపం..

గృహంలో వరుసగా వెలిగించే దీపాలు  సర్వదీపం.


🪔 మోక్ష దీపం...

పితృదేవతలు సద్గతులు

పొందాలని  ఆలయ  గోపురం మీద వెలిగించే దీపం.


🪔 సర్వాలయ దీపం..

కార్తీక పౌర్ణమి రోజున   సాయంకాలమున

శివాలయాల ముందు వెలిగించే దీపాలు. 


🪔 చొక్కపనై దీపం..

కార్తిక మాసంలో పౌర్ణమినాడు శివాలయాలకి ముందున

తాటాకులతో పెద్ద గూడగా  అల్లి  దానికి పూజ చేసి, దీపారాధన చేసి  కర్పూరజ్యోతిని దానిలో వెలిగిస్తారు. 


🪔 అఖండ దీపం..

కొండ శిఖరాన  పెద్ద దీపంగా  వెలిగించేది అఖండ దీపం.  తిరువణ్ణామలై , తిరుక్కళుకున్డ్రమ్ , పళని, తిరుప్పర కున్డ్రమ్ ఆలయాలలో

ఆలయాలలో అఖండ దీపం దర్శిస్తాము.


🪔 లక్ష దీపం..

ఒక లక్ష  దీపాలతో ఆలయమంతటా  అలంకరించడం  లక్ష దీపం . మైలాపూర్, తిరువణ్ణామలై,  తిరుక్కళుకున్డ్రమ్ ( 12 సంవత్సరాలకి ఒకసారి)

ఆలయాలలో అలంకరించడాన్ని లక్ష దీపం అంటారు.


🪔 పిండితో చేసే దీపాలు...

అమ్మవారి ఆలయాలలో

మ్రొక్కుకున్న ప్రకారం పిండితో దీపాలు వెలిగించేవి పిండి దీపాలు. కార్తిక మాసంలో

ప్రతిగృహంలోను ,  పిండి దీపాలు వెలిగించి పూజిస్తారు. కంచి కఛ్ఛపేశ్వరాలయంలో , 

కార్తిక మాసంలోని ఆదివారములలో  పిండి దీపం శిరస్సున ధరించి 

ఆలయానికి ప్రదక్షిణలు

చేసే ఆచారం వున్నది. 


🪔 వృక్ష దీపం..

ఒక వృక్షం వలె వుండే  అంతస్తులుగల కొమ్మల వలె వుండే ఆలయ స్ధంభాలలో  దీపాలు వెలిగిస్తారు.  సాధారణంగా

కేరళా దేవాలయాలలో   ఈ వృక్షదీపాలు అధికంగా వుంటాయి. 

చిదంబరం , తిరువణ్ణామలై,  ఆలయాలలో కూడా వృక్ష దీపాలను చూడవచ్చును.


- స్వస్తీ...




Top

BOTTOM