Type Anything.., You Get World Wide Search Results Here. !

ఉగాది - Ugadi

 

ఉగాది

వసంత ఋతువు మొదలవగానే నూతన చర్మము వచ్చి శరీరానికి నవ చైతన్యం లభిస్తుంది. పాము తన కుబుసం విడిచినట్లు, పకక్షులు (నెమలి మొదలైనవి) తమ ఈకలు రాల్చినట్లు. వృక్షములు ఆకులు రాల్చి చిగుళ్ళను సంతరించుకుటాంయి. కావున మనం అందరం మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరించడం మొదలు పెడితే చెట్లకు కొత్త ఆకులు చిగురించి ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నట్టు తీసుకునే నిర్ణయాదులు కూడా అలాగే ఫలవంతం అయి ఆనందంగా ఉంటాయి.

ఉగాది పచ్చడి తయారీ విధానం: 

అవసరమైన పదార్ధాలు:

మామిడికాయ (ఓ మాదిరి పరిమాణం కలది)- 1

వేప పువ్వు- 1/2 కప్పు

సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు- 1/2 కప్పు

కొత్త చింతపండు- 100 గ్రాములు

కొత్త బెల్లం- 100 గ్రాములు

మిరపకాయలు- 2

అరటిపండు - 1

చెరకు రసం -1/2 కప్పు

ఉప్పు - సరిపడేంత

నీళ్లు

అవసరమైతే అరటి పళ్లు, జామకాయలను కూడా వేసుకోవచ్చు.


తయారు చేసే విధానం:

ముందుగా వేపపువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాని గుజ్జును వేరుచేయాలి. మామిడికాయను, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరగాలి. తర్వాత చెరకు రసం సిద్ధం చేసి, మిగతా పళ్లను వాటిని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దాన్ని చింతపండు గుజ్జులో కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి కాయ ముక్కలు, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే. ఇక వసంత లక్ష్మీని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత స్వీకరించాలి. అంతేకాదు మిగతా వాళ్లకు అందజేయండి. కష్ట సుఖాలను జీవితంలో చవిచూడాలనే నిజాన్ని ఉగాది పచ్చడి సేవనం తెలియజేస్తుంది.


విశ్లేషణ

ఉగస్య ఆదిః ఉగాది. 'ఉగ' అంటే నక్షత్రపు నడక అని అర్థం. నక్షత్రముల నడక ప్రారంభం అంటే సృష్ట్యారంభం అయిన కాలం యొక్క 'ఆది' ఉగాది అయింది. ఉగాది పండుగ చారిత్రకరీత్యా కూడా అధిక ప్రాధాన్యం కలిగి ఉంది. జగద్విఖ్యాతి కాంచిన విక్రమార్కచక్రవర్తి చైత్రశుద్ధ పాడ్యమి రోజు ప్టాభిషిక్తుడు కాగా ఆ మహావీరుని సంస్మరణ చిహ్నముగా ఆ రోజు ఉత్సవాలు జరుపుట ఆచారమైనది.


మాసములకన్న ఋతువులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని, ఉగాదిని చైత్రమాసం నుండి ప్రారంభించారు. శిశిర ఋతువు అంటే చలికాలం పోయి, చైత్రమాసం నుండి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ కాలంలో చెట్లు చిగిర్చి పూతలు పూస్తాయి. కోయిల కూజితములు సన్నజాజులు, మల్లెల పరిమళాలు, వసంత ఋతువులో ఆహ్లాదమును కలిగిస్తాయి. ఇదే రీతి మనుష్యుని శరీరంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. శిశిర ఋతువులో శరీరపు చర్మంలో చిన్న చిన్న పొక్కుల మూలకం పొట్టు పోయి చాలా స్ఫుటముగా కనిపిస్తుంది. వసంత ఋతువు మొదలవగానే నూతన చర్మము వచ్చి శరీరానికి నవ చైతన్యం లభిస్తుంది. పాము తన కుబుసం విడిచినట్లు, పకక్షులు (నెమలి మొ||వి) తమ ఈకలు రాల్చినట్లు, వృక్షములు ఆకులు రాల్చి చిగుళ్ళను సంతరించుకుటాంయి. కావున మనం అందరం మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరించడం మొదలు పెడితే చెట్లకు కొత్త ఆకులు చిగురించి ఆహ్లాదంగా ఆనందంగా ఉన్నట్టు తీసుకునే నిర్ణయాదులు కూడా అలాగే ఫలవంతం అయి ఆనందంగా ఉంటాయి.


ఉగాది రోజు పాటించవలసిన నియమాలు :

1. తైలాభ్యంగనం : ఉగాదిరోజు సూర్యోదయం కాకుండా నిద్రలేచి తైలాభ్యంగనం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒంటికి, తలకి నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇంట్లో పూజాదికాలు చేసుకొని సూర్యుడికి నమస్కారం చేయాలి.


2. ప్రతిగృహద్వజారోహణం : దేశానికి స్వతంత్య్రం వచ్చినప్పుడు లేదా దేశానికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు సాదారణంగా జెండాలు ఎగురవేస్తుంటాం. అదే విధంగా బ్రహ్మకు సంబంధించినది, ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహణ ఇంటి ముందు చేయాలట. మన రాష్ట్రాల్లో ఇలాటి పద్ధతులు కనిపించవు కాని మహారాష్ట్రలో ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను పెట్టి ధ్వజారోహణం చేస్తారు.


3. నవవస్త్రాభరణధారణం, ఛత్రచామరాది స్వీకరణం : నవవస్త్రాధారణ, నవ ఆభరణ ధారణ చేయమని శాస్త్రం చెబుతుంది. ఎండాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పి నుంచి గొడుగు వేసుకోవడం చాలా అవసరం. ఉగాది రోజు కొత్త గొడుగు సంపాదించి ఉంచుకోవాలని సంకేతం. ఛత్ర ధారణం నేెత్ర శాంతికరం, ఎండ, గాలి, వాన మున్నగు వాని నుండి కాపాడి సౌఖ్యప్రదంగా ఉంచుతుంది. ఉగాదిరోజు చామరకు కూడా స్వీకరించాలి.


ఎండాకాలం విసనకర్ర ఆవశ్యకం బాగా ఉంది. వాటిలో వ్టివేళ్ళతో చేసినవి, వెదురుతో చేసినవి, తాకులతో చేసినవి శ్రేష్ఠమైనవి, వాటితో విసురుకోవడం వలన మేహశాంతి కలుగుతుంది. నేత్రాలకి చల్లదనంగా ఉంటుంది. ఛత్రచామరాలని ఈ ఎండాకాలంలో దానం చేయడం వలన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది.


4. దమనేన పూజ : దమనం అంటే ఒక పత్రి. సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలం విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది రోజు మొదలుకొని పౌర్ణిమ వరకు రోజూ ఒక దేవతా మూర్తికి పూజ చేయాలి.


చైత్రశుక్ల పాడ్యమి : బ్రహ్మకు; చైత్ర శుక్ల విదియ : ఉమ, శివ, అగ్నులకు ; చైత్ర శుక్ల తదియ : గౌరీ శంకరులకు; చైత్ర శుక్ల చతుర్థి గణపతికి ; చైత్ర శుక్ల పంచమి : నాగులకు; చైత్ర శుక్ల షష్ఠి: కుమారస్వామికి; చైత్ర శుక్ల సప్తమి సూర్యునకు ; చైత్ర శుక్లఅష్టమి: మాతృదేవతలకు; చైత్ర శుక్ల నవమి: మహిషాసుర మర్దినికి; చైత్ర శుక్లథమి: ధర్మరాజుకు; చైత్ర శుక్ల ఏకాదశి : మునులకు; చైత్ర శుక్ల ద్వాదశి : శ్రీ మహావిష్ణువుకు; చైత్ర శుక్ల త్రయోదశి : కామదేవునకు; చైత్ర శుక్ల చతుర్దశి : శంకరునకు; చైత్ర శుక్ల పూర్ణిమ : శచి, ఇంద్రులకు


సర్వాపచ్ఛాంతికర మహాశాంతి : సంవత్సరాది వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయవలసిన పండుగగా చెప్పబడి ఉంది. మహాశాంతి కలిగించుట వలన అన్ని దుఃఖాలు తొలుగుతాయి. మహాశాంతి చేయవలసని పండుగలో ఇది ఒకి కాబట్టి పూర్వం ఉగాది రోజు సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది. ఉగాదిరోజు విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.


పంచాంగపూజ, పంచాంగ శ్రవణం : ఉగాదిరోజు ఉదయాన్నే దేవుని దగ్గర పంచాంగాన్ని ప్టోలి. ప్రతి ఇంటిలో ఆ సంవత్సరం పంచాంగం ఉండాలి. పంచాంగం ఆ సంవత్సరంలో మనం చేయవలసిన కార్యక్రమాలకి అనువైన వాటిని చూపించే కరదీపికగా చెబుతారు. అందుకని పంచాంగానికి పూజ చేసి మధ్యాహ్న సమయంలో నూతన వస్త్రాలు కట్టుకుని బ్రామ్మణ ముఖంగా లేదా జ్యోతిష్కుల ముఖంగా ఆ పంచాంగాన్ని వినాలి. అలా వింం కాబట్టే పంచాంగ శ్రవణం అని పేరు.


పంచాంగశ్రవణం వలన గంగాస్నానం చేసిన ఫలితం గోదానం చేసిన ఫలితం లభిస్తుంది. శత్రువులు దూరం అవుతారు. దుస్వప్ననాశనం అవుతుంది. సంతానం, సంపత్తు కలుగుతుంది. అన్ని కర్మలు సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి.


ప్రపాదాన ప్రారంభం : అంటే బ్రహ్మాది సమస్త దేవతా స్వరూపమైన ధర్మఘట్టం దానం చేస్తున్నాను కాన నా మనోరథములన్నీ సమకూరాలని సంకల్పం చేసి నీటి కుండను దానం చేయాలి.


రాజదర్శనం : ఉగాదిరోజు రాజదర్శనం చేయాలాంరు. ఈ రోజుల్లో అది అసాధ్యం కాదు కాబట్టి దేవతాదర్శనం వలన ఈశ్వరానుగ్రహం వలన అందరూ అనుకూలంగా ఉంటారు అని తెలుసుకొని దేవాలయ దర్శనం చేయడం విశేషం.


వసంత నవరాత్రి ప్రారంభం : శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజలు ఏ విధంగా చేస్తారో వసంత నవరాత్రుల్లో కూడా అదే విధంగా కలశస్థాపన చేసి అమ్మవారి పూజలు చేయాలి. వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణ కాని, సుందరాకాండ పారాయణ కాని రామనామ జపాన్ని కాని ప్రత్యేకంగా చేస్తారు.


నింబకుసుమ భక్షణం : ఉగాదిరోజు ముఖ్యంగా నింబకుసుమ భక్షణం అని కొన్ని చోట్ల ఉంటే నింబ పత్ర భక్షణం అని మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. వాతావరణాన్ని అనుసరించి ఏర్పడిన సాంప్రదాయంగా దీన్ని చెబుతారు. వైద్యగ్రంథాలనుంచి తీసుకున్నదిగా దీన్ని చెబుతారు. నింబ కుసుమం అంటే వేప పువ్వు. నింబ పత్ర అంటే వేప ఆకు. ఇలాటి వాటిని తప్పనిసరిగా ఉగాదిరోజు ప్రతి ఒక్కరూ తినాలని మనకి శాస్త్రం చెబుతోంది. దాని నుంచే మనకి ఏర్పడినది ఉగాది పచ్చడి.


ఉగాది పచ్చడికి నవగ్రహాలకు కారకాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పు దానిలోని రసానికి చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వాటికి శని, బుధులు కూడా కారకులవుతారు.


కావున ఇన్ని విశిష్టతలు ఉన్న ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వికారి నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఎప్పుడూ ఆ శ్రీమాత దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.


Top

BOTTOM